వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమీర్‌ఖాన్ 'పీకే' చిత్రంలో ఆ సీన్స్ తొలగించండి: ముస్లీం మతపెద్దలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

లక్నో: అమీర్ ఖాన్ నటించిన పీకే చిత్రం పైన హిందుత్వవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. పలువురు ముస్లిం మత గురువులు కూడా దీని పైన భగ్గుమంటున్నారు. మతభావాలు కించపరిచేలా ఉన్న సన్నివేశాలని సినిమా నుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

సున్నీ మతగురువు, ఆల్ ఇండియా ముస్లీం పర్సనల్ లా బోర్డ్ సభ్యులు మౌలానా ఖలీద్ రషీద్ ఫిరంగి మహాలీ సోమవారం మాట్లాడుతూ.. మతభావాలు కించపరిచేలా ఉన్న సన్నివేశాలను సెన్సార్ బోర్డు వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. సినిమాలోని కొన్ని సన్నివేశాలు కొన్ని వర్గాలను కించపరిచేలా ఉన్నాయని చెప్పారు.

 Muslim clerics seek removal of controversial scenes from 'pk'

వాక్ స్వాతంత్రం పేరిట ఇలాంటివి సరికాదన్నారు. ఇప్పటికే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో మతఘర్షణలు చోటు చేసుకుంటున్నాయని, పీకే సినిమా ద్వారా మరింతగా రెచ్చగొట్టవద్దని కోరారు. కాగా, పీకే చిత్రం పైన హిందుత్వవాదులు మండిపడుతున్న విషయం తెలిసిందే.

మరోవైపు అమీర్ ఖాన్ తాజా చిత్రం పీకేకు స్వామి అగ్నివేష్ మద్దతు పలికారు. హిందూ మత విశ్వాసాలను ఆసరాగా చేసుకొని ప్రజలను మోసగిస్తున్న వారికి వ్యతిరేకంగా తీసిన ఈ చిత్రానికి పన్ను మినహాయింపు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

English summary
Even as Hindu organisations continue to demand a ban on Aamir Khan-starrer pk for its alleged anti-Hindu content, Muslim clerics are also seeking removal of controversial scenes from the film.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X