వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రశంసలందుకున్న యువతిపై ఆన్‌లైన్ దాడి

ఆ యువతి పేరు సుహానా సయీద్ (22). కర్ణాటకలోని షిమోగా జిల్లాకు చెందిన ముస్లిం యువతి. బెంగళూరులో జరిగిన కన్నడ పాటల ‘రియాల్టీ షో’లో పాల్గొని హిందువుల భక్తిగేయం ఆలాపించినందుకు నిర్వాహకులు,

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆ యువతి పేరు సుహానా సయీద్ (22). కర్ణాటకలోని షిమోగా జిల్లాకు చెందిన ముస్లిం యువతి. బెంగళూరులో జరిగిన కన్నడ పాటల 'రియాల్టీ షో'లో పాల్గొని హిందువుల భక్తిగేయం ఆలాపించినందుకు నిర్వాహకులు, షో జడ్జిలు, హాజరైన ఆహుతుల ప్రశంసలందుకున్నారు. జడ్జిలు లేచి నిలబడి మరీ చప్పట్లు కొట్టి అభినందించారు. కానీ వివిధ సోషల్ మీడియా వెబ్‌సైట్లలో మాత్రం విమర్శలు వెల్లువెత్తాయి.

ఆమె హిందూ ముస్లింల సమైక్యతకు వారధిలా నిలుస్తుందని జడ్జిలు వ్యాఖ్యానించారు. కన్నడ సినీ సంగీత దర్శకుడు అర్జున్ జన్యా మాట్లాడుతూ 'మీ స్వరం చాలా బాగుంది. మీరు చాలా మంచి పనిచేశారు. హిందూ భక్తిగీతం పాడటం ద్వారా హిందు, ముస్లింల మధ్య ఐక్యతకు సంగీతం దారి చూపుతుందన్న సందేశాన్ని తీసుకెళ్ల చిహ్నంగా నిలిచావు' అని అభినందించారు. దాదాపు 100 సెకండ్ల నిడివి గల ఈ పాటను దాదాపు 46వేల మంది నెటిజన్లు ఫేస్‌బుక్‌లో పోస్టుచేసి ఆమెను పొగడ్తలతో ముంచెత్తారు.

Muslim Girl Trolled for Singing Hindu Devotional Song 2017

సుహానా పాడిన పాట సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సుహానా భక్తిగీతం పాడటంతో ఆమె సామాజిక వర్గ వ్యక్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆమెపై విమర్శలు ఎక్కుబెట్టారు. అందుకు ఫేస్‌బుక్‌లో ఏకంగా మంగళూరు ముస్లింలు అనే పేరిట ఒక పేజీ స్రుష్టించారు. 'అంత మంది పురుషుల ముందు పరదా లేకుండా హిందూ గీతం పాడి ముస్లింల ప్రతిష్ఠకు భంగం కలిగిస్తావా? గొప్ప విజయం సాధించానని భావించొద్దు. ఖురాన్ అధ్యయనానికి కనీసం ఆరు నెలల సమయం పడుతుంది. ఇతరుల ముందు నీ అందచందాలు ప్రదర్శించేందుకు నిన్ను నీ తల్లిదండ్రులు ప్రోత్సహించారు. నీ కారణంగా నీ తల్లిదండ్రులు స్వర్గానికి వెళ్లరు. నీవు గౌరవించకపోతే పరదా తీసేయవచ్చు' అని పేర్కొన్నారు.

Muslim Girl Trolled for Singing Hindu Devotional Song 2017

హిందూ గీతం పాడటం వల్ల సాధించిందేమిటని నిలదీశారు. సుహానా ముస్లిం మతం పేరు ప్రతిష్ఠలు మంటగలిపిందని అని ఎంఎస్ సయ్యద్ అనే వ్యక్తి ఫేస్‌బుక్ వేదికగా విమర్శలు చేశారు. పురుషుల ఎదుట పాట పాడేందుకు సుహానాను ప్రోత్సహించిన ఆమె తల్లిదండ్రులు స్వర్గానికి వెళ్లరన్నాడు. సుహానా బురఖాను గౌరవించకుంటే అది కూడా ఆమె తీసివేయవచ్చు అని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ఈ పరిణామాల నేపథ్యంలో సుహానాను ఆమె తల్లిదండ్రులు అజ్నాతంలోకి తీసుకెళ్లారు. మంగళూరు ముస్లిం పేజీలో విమర్శల స్థాయిలోనే ఆమెకు ఆన్ లైన్‌లో వివిధ వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది.

English summary
Suhana Sayed, 22, from Shimoga district was attacked online on various social media platforms for taking part in a Kananda singing reality show and singing a Hindu devotional song. Suhana got a standing ovation from the judges and the audience for her performance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X