వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆఫక్ అలీ: ఆవుల కోసం భార్యనే వద్దనుకున్నాడు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

కాన్పూర్: ఆవులంటే అతనికి ప్రాణం. వాటి కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు. ఎంతలా అంటే కట్టున్న భార్యనే వదిలేసేంతలా. వివరాల్లోకి వెళితే... కాన్పూర్‌కి చెందిన ఆఫక్ అలీ అనే వ్యక్తికి ఆవులంటే ప్రాణం. ఆవుల కోసం కట్టుకున్న భార్యనే వదిలేశాడు.

అఫల్ అలీ ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో నివసిస్తున్నాడు. ఇతని దగ్గర 14 ఆవులు ఉన్నాయి. ఎల్లప్పుడూ వాటి గురించే ఆలోచిస్తూ, వాటితోనే గడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. తన భర్త ఎప్పుడూ ఆవులతో ఎక్కువ సమయం గడుపుతుండటాన్ని చూసిన అతని భార్యకు కోపం వచ్చింది.

తాడోపేడో తేల్చుకుందామని నీకు నేను కావాలా, ఆవులు కావాలా? అని ఒక రోజు అఫక్ అలీని భార్య నిలదీసింది. అందుకు అఫక్‌ ఆవులే కావాలంటూ అందుకోసం తన కుటుంబాన్ని కూడా వదులుకున్నాడు. ఈ స్టోరీ 13 సంవత్సరాల క్రితం జరిగింది.

Muslim man chooses cows over wife in Etawah

అయితే ఇప్పుడు ఈ స్టోరీ బయటకు రావడానికి కారణం.. ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా ఆవు మాంసంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఆవు మాంసం తింటున్నారంటూ కొందరు ముస్లింలపై దాడులు కూడా చేస్తున్నారు.

ఈ క్రమంలో అఫల్ అలీ స్టోరీ తోటి ముస్లింలకు ఎంతో ఆదర్శంగా నిలుస్తోంది. అఫక్‌ అలీ 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఓ ఆవుని కొనుక్కున్నాడు. అలా ఒకొక్కటిగా అవి పెరిగి 14కు చేరాయి. ఈ ఆవుల కోసం 2001లో తాను కట్టుకున్న భార్య ఆఫ్రాజ్ జహాన్‌ను వదిలేశానని చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం అఫక్ అలీ వయసు 55. అయితే పరాయి స్త్రీపై వ్యామోహంతో కాకుండా ఆవులపై ప్రేమతో తన కుటుంబాన్ని వదిలేశానని అఫక్ చెబుతున్నాడు. అంతలా వాటిపై ప్రేమను పెంచుకున్నాడు. రోజూ ఉదయాన్నే వాటికోసం పచ్చిగడ్డిని పోగు చేసి అవి కడుపునిండా తినేదాకా వాటితోనే ఉంటాడు.

వారం వారం వాటికి వైద్య పరీక్షలు చేయిస్తూ కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. గత 30 ఏళ్లుగా ఈ ఆవులను కంటికి రెప్పలా చూసుకుంటున్నందుకు తాను ఎంతో అదృష్టవంతుడినని చెప్పాడు. ఇందుకు గ్రామస్థులు కొందరు తనని మెచ్చుకున్నారని చెప్పుకొచ్చాడు.

అయితే ఆవుల కోసమే కుటుంబాన్ని వదిలేశానని తన బంధువులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారని చెప్పాడు. కొందరు ఆవులను మంచి ధరకు విక్రయించాలని అడిగినా అందుకు తన మనస్సు అంగీకరించదని తెలిపాడు. జంతు కార్యకర్త రాజీవ్ చౌహాన్ మాట్లాడుతూ అఫక్ మాకు ఓ ప్రేరణ అని చెప్పాడు.

English summary
A Muslim man in Etawah left his wife over his love for a herd of 14 cows. Afaq Ali alias Munna in Etawah district said that when his wife asked him to choose between her and his 14 cows, he went for the latter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X