వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెల్లివిరిసిన మత సామరస్యం: హిందువుకు ముస్లిం సోదరుల అంత్యక్రియలు.. ఎక్కడంటే...

|
Google Oneindia TeluguNews

దేశంలో మరోసారి మత సామరస్యం వెల్లివెరిసింది. రాజస్థాన్‌లో ఓ హిందువు అనారోగ్యంతో చనిపోయాడు. అయితే అతని కుటుంబంలో ఒక్కరు కూడా పురుషులు లేకపోవడం.. బంధువులు దూరంగా ఉండటంతో... ముస్లిం సోదరులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. హిందు ఆచార, సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియల క్రతువు ముగించారు.

జైపూర్‌లోని భజ్‌రంగ్ నగర్ భట్టా బస్తీలో రాజేంద్ర అనే వ్యక్తి ఉండేవారు. అతనికి క్యాన్సర్ రక్కిసి సోకింది. జైపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం అతను చనిపోయారు. అయితే అతని అంత్యక్రియలు నిర్వహించడం కుటుంబసభ్యులకు కత్తిమీద సాములా మారింది. ఎందుకంటే అతని కుటుంబంలో ఒక్క పురుషుడు కూడా లేదు. అలాగే ఉన్న బంధువులు కూడా లాక్ డౌన్ వల్ల రాలేకపోయారు. చుట్టుపక్కన ఉన్నవారు కూడా హిందువులు లేరు. దీంతో ఏం చేయాలి అనుకొంటున్న సమయంలో అక్కడున్న ముస్లింలు ముందుకొచ్చారు.

Muslim neighbours perform last rites of Hindu man during lockdown

రాజేందర్ అంతిమ సంస్కరాలను హిందు సాంప్రదాయం ప్రకారం నిర్వహించారు. హిందు మతానికి చెందిన రాజేందర్ చనిపోతే..ముస్లింలు అంత్యక్రియలు నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. కరోనా వైరస్ సందర్భంగా విధించిన లాక్ డౌన్ సందర్భంగా మరోసారి మత సామరస్యం వెల్లివిరిసింది.

English summary
Hindu man Rajendra passed away due to cancer in Rajasthan's Jaipur, his Muslim neighbours stepped and cremated him with full Hindu rituals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X