వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముస్లింలకు భద్రత లేదు.. అందుకే పేరు మార్చుకోండి.. అధికారి ట్వీట్‌పై నెటిజన్ల ఫైర్..

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : దేశవ్యాప్తంగా మూక దాడులు పెరిగిపోతున్నాయి. ఆవుల్ని అక్రమంగా తరలిస్తున్నారని ఒకచోట, జై శ్రీరాం అనలేదని మరోచోట దాడులకు తెగబడుతున్నారు. ఇలాంటి ఘటనలు తరుచూ చోటు చేసుకుంటుండంతో ఓ ముస్లిం అధికారి స్పందించారు. మూక దాడుల భయంతో మధ్యప్రదేశ్‌కు చెందిన ఆ ఆఫీసర్ తన పేరు మార్చుకోవాలని నిర్ణయించారు. అయితే ఆయన పేరు మార్చుకోవడానికి చెప్పిన కారణంపై నెటిజన్లు మండిపడుతున్నారు.

హోదా డైరెక్టర్...అవినీతి "అదనం": ఉన్నత స్థానం కోల్పోయిన తెలుగు ఐపీఎస్

దాడుల భయంతో పేరు మార్పు

మధ్యప్రదేశ్‌కు చెందిన నియాజ్ ఖాన్ ప్రభుత్వ అధికారి. ఉన్నత హోదాలో ఉన్న ఆయన కొంతకాలంగా వెలుగులోకి వస్తున్న మూక దాడులతో భయపడిపోయానని అంటున్నారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేశారు. ముస్లింలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో తనను తాను కాపాడుకునేందుకు పేరు మార్చుకునేందుకు సిద్ధమైనట్లు చెప్పారు. పేరు మార్చుకుంటే తాను ముస్లింనన్న విషయాన్న ఎవరూ గుర్తించలేరని, అలా ద్వేషమనే కత్తి నుంచి తనను తాను కాపాడుకోవాలనుకుంటున్నట్లు నియాజ్ ఖాన్ ట్వీట్‌ చేశారు. మార్చుకున్న పేరే తనను కాపాడుతుందని అన్నారు.

ఏ వ్యవస్థ ముస్లింలను కాపాడలేదని

తన ఆహార్యం, వేషధారణ తాను ముస్లింనన్న విషయం బయటపెట్టేలా ఉండదన్న నియాజ్ ఖాన్.. కేవలం తన పేరును మార్చుకుంటే సమస్య మొత్తం తీరిపోతుందని చెప్పారు. ముస్లింలు ధరించే టోపీ, కుర్తా ధరించి, గడ్డం కలిగి ఉన్నవారు మాత్రం పెద్ద ప్రమాదంలో ఉన్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అన్నారు. దేశంలో ఏ వ్యవస్థ ముస్లింలను కాపాడలేదని అందుకే పేరు మార్చుకోవడం ఒక్కటే సమస్యకు పరిష్కారమని నియాజ్ అభిప్రాయపడ్డారు.

బాలీవుడ్ హీరోలకు సూచన

బాలీవుడ్ హీరోలకు సూచన

బాలీవుడ్‌లో ఉన్న ముస్లిం హీరోలంతా తన బాటలోనే పయనిస్తూ పేరు మార్చుకోవాలని నియాజ్ ఖాన్ సూచించారు. అలా చేస్తేనే వారి సినిమాలు ఆడతాయని అన్నారు. బడా బడా హీరోలు నటించిన సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయంటే అందుకు కారణమేంటో వారే అర్థం చేసుకోవాలని మరో ట్వీట్ చేశారు. నియాజ్ ఖాన్ ఇలాంటి కామెంట్లు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంతోనూ సోషల్ మీడియాలో ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సమాజంలో చూపుతున్న వివక్ష కారణంగా తాను అస్పృశ్యుడినన్న భావన కలుగుతోందని, ఖాన్ అనే పేరు తనను దెయ్యంగా వెంటాడుతోందని జనవరిలో సోషల్ మీడియాలో ఆయన చేసిన పోస్ట్ పెద్ద దుమారమే రేపింది.

మండిపడుతున్న నెటిజన్లు

మండిపడుతున్న నెటిజన్లు

నియాజ్ ఖాన్ ట్వీట్లపై నెటిజన్లు మండిపడుతున్నారు. మూక దాడుల కారణంగా పేరు మార్చుకోవాలన్న ఆయన వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. ప్రభుత్వ అధికారి అయి ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడుతున్నారు. ఇలాంటి కామెంట్లు చేసి నియాజ్ ఖాన్ దాడులకు పాల్పడే వారని మరింత రెచ్చగొడుతున్నారని పలువురు అభిప్రాయపడ్డారు.

English summary
Upset over the rising mob lynching incidents in the country, a Muslim bureaucrat in the Kamal Nath government in Madhya Pradesh wants to change his name. In a series of tweets on Saturday, senior officer Niyaz Khan expressed his fear for the safety of the Muslim community in the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X