చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చెన్నైలో రష్యా రాయబారి కార్యాలయాన్ని ముట్టడించిన ముస్లీంలు, ధర్నా, వార్నింగ్!

|
Google Oneindia TeluguNews

చెన్నై: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కారణంగా సిరియాలో రక్తం ఏరులైపారుతోందని ఆరోపిస్తు చెన్నైలో శుక్రవారం ముస్లీం సోదరులు ఆందోళనకు దిగారు. చెన్నైలోని సెయింట్ హోం ప్రాంతంలోని రష్యా రాయబారి కార్యాలయం ముందు వేలాది మంది ముస్లీం సోదరులు ధర్నా నిర్వహించారు.

రష్యా ఆయుధాలు

రష్యా ఆయుధాలు

సిరియాలో జరుగుతున్న దాడులకు రష్యా ఆయుధాలు సరఫరా చేస్తోందని శుక్రవారం చెన్నైలో ముస్లీం సోదరులు ఆరోపించారు. సిరియాలో ఉగ్రవాదులు ఉన్న ప్రాంతాలు గుర్తించి వైమానిక దాడులు చెయ్యాలని ముస్లీం సోదరులు డిమాండ్ చేశారు.

అమాయకులు బలి

అమాయకులు బలి

రష్యా చేస్తున్న వైమానిక దాడుల వలన అయామకులు, పిల్లలు, మహిళలు బలి అవుతున్నారని ముస్లీం సోదరులు ఆరోపించారు. వెంటనే సిరియాలో వైమానిక దాడులు నిలిపివెయ్యాలని, లేదంటే ఆందోళన ఉదృతం చేస్తామని ముస్లీం సొదరులు హెచ్చరించారు.

ఒక్కసారిగా ర్యాలీలు

ఒక్కసారిగా ర్యాలీలు

శుక్రవారం నమాజ్ పూర్తి చేసుకున్న ముస్లీం సోదరులు, అనేక సంఘాల కార్యకర్తలు అనేక ప్రాంతాల్లోని మసీదుల నుంచి నేరుగా ర్యాలీగా రష్యా రాయబారి కార్యాలయం దగ్గరకు చేరుకున్నారు. రష్యా తీరును వ్యతిరేకిస్తూ ముస్లీం సోదరులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు.

రష్యా అధ్యక్షుడి క్లారిటీ

రష్యా అధ్యక్షుడి క్లారిటీ

రష్యా సహకారంతో సిరియాలో జరుగుతున్న వైమానిక దాడులతో గౌటా నగరంలో శవాలు కుప్పలు కుప్పలుగా పడిపోయాయి. ప్రస్తుతం గౌటా నగరం ఉగ్రవాదుల ఆధీనం లో ఉంది. సుమారు 4 లక్షల మంది సామాన్య ప్రజలు గౌటా నగరంలో చిక్కుకున్నారు. సిరియాలో వైమానిక దాడులు నిలపమని మానవతా దృక్పథంతో రోజుకు ఐదు గంటలు మాత్రం దాడులు నిలిపివేస్తామని, ఆ సమయంలో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు.

English summary
Muslim organisations protest in front of Russian emphassy at Chennai santhome, they were raising slogans against Russia which is supporting Syria war by supplying weapons.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X