వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ్ఞాన్‌వాపీ మసీదు వివాదం: నేడు సుప్రీంకోర్టు ముందుకు అంజుమన్ పిటిషన్

|
Google Oneindia TeluguNews

ఉత్తరప్రదేశ్‌లో గల కాశీ విశ్వనాథ్- జ్ఞాన్‌వాపీ మసీదు వివాదం కొసాగుతోంది. దీనికి సంబంధించి ఇవాళ మూడురోజుల పాటు చేసిన సర్వే నివేదికను అందజేయాల్సి ఉంది. అయితే ఈ కేసులో ముస్లింలు ఫైల్ చేసిన అంశాలపై విచారణ జరగనుంది. దీంతో ప్రాధాన్యం సంతరించుకుంది.

మసీదు మేనెజ్ మెంట్ కమిటీ అంజుమన్ ఈ ఇంతెజమీయ గత వారం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో వారణాసి సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని కోరింది. ఇక్కడ ఆలయం ఉండేదని సివిల్ కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దానిపై అంజుమన్ కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై తమకు అనుకూలంగా తీర్పు వస్తోందని ఆశాభావంతో ఉంది.

Muslim sides plea in Supreme Court today

వివాదాస్పద కాశీ విశ్వనాథ ఆలయం, గ్యాన్‌వాపి మసీదు పరిసర ప్రాంతాలను భారత పురావస్తు విభాగం ఆధ్వర్యంలో సర్వే చేయడానికి అనుమతిస్తూ వారణాసిలోని స్థానిక కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిని అంజుమన్ కమిటీ తప్పుపట్టింది. ప్రస్తుతం మసీదు ఉన్న ప్రాంతం 2 వేల ఏళ్ల కిందటి నుంచి కాశీ విశ్వనాథ ఆలయానికి చెందిందని, 1664లో మొగల్‌ చక్రవర్తి ఔరంగజేబ్‌ అక్కడ అక్రమంగా మసీదు నిర్మించినందున ఆ ప్రాంతాన్ని మళ్లీ ఆలయానికి స్వాధీనం చేయాలని 2019లో వీఎస్‌ రస్తోగి అనే న్యాయవాది ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. మొత్తం ఈ ప్రాంతాన్ని సర్వే చేయాలని అందులో కోరారు. దీనిపై వారణాసిలోని స్థానిక కోర్టు తీర్పు వెలువరించింది. దీనిని ముస్లిం బాడీ సవాల్ చేసింది. ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

English summary
three-day survey of the Kashi Vishwanath-Gyanvapi mosque premises is expected to be submitted before the Varanasi civil court today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X