వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Ayodhya verdict: ‘రామమందిర నిర్మాణానికి ముస్లింలకు ఆహ్వానం’

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అయోధ్య కేసులో సుప్రీంకోర్టు శనివారం ఇచ్చిన తీర్పు అమోదయోగ్యంగా ఉందని హిందూ మహాసభ నాయకుడు స్వామి చక్రపాణి వ్యాఖ్యానించారు. .అయోధ్యలో రామమందిరం నిర్మాణ సమయంలో ముస్లింలను కూడా తాము ఆహ్వానిస్తామని ఆయన తెలిపారు.

Ayodhya Verdict: 'ఇది చారిత్రక తీర్పు. తీర్పుతో భిన్నత్వంలో ఏకత్వం’Ayodhya Verdict: 'ఇది చారిత్రక తీర్పు. తీర్పుతో భిన్నత్వంలో ఏకత్వం’

రామమందిర నిర్మాణానికి ముస్లింలకు ఆహ్వానం

రామమందిర నిర్మాణానికి ముస్లింలకు ఆహ్వానం

‘మసీదు నిర్మాణానికి ముస్లిం కోసం 5 ఎకరాల భూమి ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. మసీదు నిర్మాణ సమయంలో మేము అక్కడికి వెళతాం. భవ్య రామమందిర నిర్మాణ సమయంలో మేము ముస్లింలను ఆహ్వానిస్తాము' అని స్వామి చక్రపాణి తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం తాము నడుచుకుంటామని ఆయన అన్నారు .రామ్ లల్లాకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు.

దైవ సంబంధ తీర్పంటూ ఉమా భారతి

దైవ సంబంధ తీర్పంటూ ఉమా భారతి

అయోధ్య భూ వివాదం కేసులో సుప్రీంకోర్టు శనివారం ఇచ్చిన తీర్పును బీజేపీ సీనియర్ నేత ఉమా భారతి స్వాగతించారు. ఇది దైవసంబంధ తీర్పు అని వ్యాఖ్యానించారు. అశోక్ సింఘాల్, అద్వానీ చేసిన పోరాటానికి ఫలితం దక్కిందన్నారు.
కాగా, అయోధ్యలోని వివాదాస్పద స్థలం హిందువులదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2.77 ఎకరాల వివాదాస్పద స్థలం హిందువులకు అప్పగించాలని ఆదేశించింది. ముస్లింలకు అయోధ్యలోనే 5 ఎకరాల స్థలం ఇవ్వాలని తీర్పు చెప్పింది. స్థలం స్వాధీనం చేసుకునేందుకు 3 నెలల్లో ట్రస్ట్ వేర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.

సుప్రీంకోర్టు తీర్పు ఇలా..

సుప్రీంకోర్టు తీర్పు ఇలా..

మసీదు నిర్మాణానికి ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. మసీదు నిర్మాణానికి సున్నీ వక్ఫ్ బోర్డుకు 5 ఎకరాల స్థలం కేటాయించాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం లేదా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిర్మోహి అఖారా వ్యాజ్యాన్ని కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. పురావస్తు శాఖ నివేదికల ఆధారంగా నిర్ణయం తీసుకుంటున్నామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం వివాదాస్పద స్థలం ప్రభుత్వానికి చెందిందని పేర్కొన్నారు. వివాదాస్పద స్థలంపై ఎవరూ యాజమాన్య హక్కులు కోరలేదని తెలిపారు. నిర్ణయానికి ముందు రెండు మతాల విశ్వాసాలను పరిగణలోకి తీసుకున్నామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ చెప్పారు. అక్కడ మందిరం ఉన్నట్లు పురవాస్తు శాఖ నివేదికలు చెబుతున్నాయని పేర్కొన్నారు.

English summary
Hindu Mahasabha leader Swami Chakrapani said here on Saturday welcomed Supreme Court verdict in the Ayodhya case and said 'Muslim side would also be invited during the construction of grand Ram Temple at Ayodhya.'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X