వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భర్తకు ఝలక్ ఇచ్చిన ముస్లీం మహిళ: రివర్స్ లో తలాఖ్, దెబ్బకు దెబ్బ !

భర్త, అతని కుటుంబ సభ్యులు పెట్టే చిత్రహింసలు తాళలేక ఓ ముస్లీం మహిళ తన భర్తకు విడాకులు ఇచ్చేందుకు తలాఖ్ చెప్పింది. ముస్లీం సాంప్రధాయం ప్రకారం భార్యలకు విడాకులు ఇవ్వడానికి భర్తలు తలాఖ్ చెబుతుంటారు.

|
Google Oneindia TeluguNews

లక్నో: భర్త, అతని కుటుంబ సభ్యులు పెట్టే చిత్రహింసలు తాళలేక ఓ ముస్లీం మహిళ తన భర్తకు విడాకులు ఇచ్చేందుకు తలాఖ్ చెప్పింది. ముస్లీం సాంప్రధాయం ప్రకారం భార్యలకు విడాకులు ఇవ్వడానికి భర్తలు తలాఖ్ చెబుతుంటారు.

అయితే ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీలో రివర్స్ లో భర్తకు తలాఖ్ చెప్పిన విషయం వెలుగు చూసింది. పుట్టింటికి వచ్చిన కొన్ని నెలలు అయినా తాను, తన కుమార్తె గురించి ఎలా ఉన్నారు అంటూ ఆరా తియ్యలేదని విరక్తి చెందిన ఆమహిళ భర్తకు తలాఖ్ చెప్పి వారి మంతం ఆచారం ప్రకారం విడాకులు తీసుకుంది.

ఆరేళ్ల క్రితం

ఆరేళ్ల క్రితం

రాయ్ బరేలీలో బాధితురాలు జాతీయ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ తనకు ఆరేళ్ల క్రితం వివాహం అయ్యిందని చెప్పారు. అప్పటి నుంచి అదనపు కట్నం కోసం తన భర్త, ఆయన కుటుంబ సభ్యులు తనను చిత్రహింసలు పెట్లారని విలపించారు.

పాప పుట్టిందని చిత్రహింసలు, కిడ్నాప్

పాప పుట్టిందని చిత్రహింసలు, కిడ్నాప్

తనకు కుమార్తె పుట్టిన తరువాత వేధింపులు మరింత ఎక్కువ అయ్యాయని ఆమె ఆరోపించారు. అదనపు కట్నం తీసుకురావాలని తన కుమార్తెను తన భర్త ఓ సారి కిడ్నాప్ చేశాడని సంచలన ఆరోపణలు చేశారు. అత్తింటివారి ఆగడాలు భరించలేక తాను పుట్టింటికి చేరుకున్నానని అన్నారు.

కొన్ని నెలలు అయినా సరే !

కొన్ని నెలలు అయినా సరే !

తాను పుట్టింటికి వచ్చి నెలలు పూర్తి అయినా భార్య, కుమార్తె ఎలా ఉన్నారు అని తన భర్త ఒక్క సారికూడా ఆరా తియ్యలేదని, అలాంటి వ్యక్తితో కలిసి జీవించాల్సిన అవసరం లేదని నిర్ణయించుకుని విడాకుల కోసం మూడు సార్లు తాను తలాఖ్ చెప్పానని ఆమె మీడియా ముందు బోరున విలపిచారు.

నాభర్తను వదలను, కోర్టులో !

నాభర్తను వదలను, కోర్టులో !

తనకు, తనకుమార్తె పోషణ కోసం భరణం ఇప్పించాలని తాను కోర్టును ఆశ్రయిస్తానని బాధితురాలు చెప్పారు. షరియత్ చట్టాల ప్రకారం వివాహ సమయంలో చెప్పినట్లుగానే తాను చేశానని ఆమె చెప్పారు. భార్య, పిల్లలను పట్టించుకోని భర్త నుంచి విడిపోవడం సరైనదే అని మతపెద్దలు చెప్పిన విషయాన్ని ఇదే సమయంలో ఆమె గుర్తు చేశారు.

వరకట్నం కేసు పెట్టి !

వరకట్నం కేసు పెట్టి !

అదనపు కట్నం కోసం భార్యను వేధించిన భర్త మీద ఐపీసీ 498 సెక్షన్ ప్రకారం ఫిర్యాదు చేశామని బాధితురాలు తరపు న్యాయవాది మీడియాకు చెప్పారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు స్పందించి చట్టప్రకారం ఆమెకు న్యాయం చెయ్యాలని న్యాయవాది పోలీసులకు మనవి చేశారు.

సుప్రీం కోర్టులో విచారణ

సుప్రీం కోర్టులో విచారణ

మూడుసార్లు తలాఖ్ అనే పదాన్ని పలకడం ద్వారా ముస్లీం పురుషులు వైవాహిక బంధాన్ని తుంచేసుకునే పద్దతిపై దాఖలైన పలు పిటిషన్లు విచారించేందుకు సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ప్రత్యేకంగా వేసవి సెలవులు రద్దు చేసుకుని పని చేస్తున్నది.

దెబ్బకు దెబ్బ మొదలైయ్యింది ?

దెబ్బకు దెబ్బ మొదలైయ్యింది ?

తలాఖ్ వివాదం సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్న సందర్బంలో రాయ్ బలేరీలో రివర్స్ గేర్ లో ఓ మహిళ తలాఖ్ అనే పధం ఉపయోగించి భర్తతో విడాకులు తీసుకున్నారని వెలుగు చూడటం కోసమెరుపు. అయితే కుమార్తె భవిష్యత్తు కోసం ఆమె మంచి నిర్ణయం తీసుకున్నారు పలువురు మహిళలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

English summary
A Muslim woman hailing from Uttar Pradesh on Friday took to the Shariyat to divorce her husband, alleging domestic violence by in-laws over dowry. The woman claimed that her husband and in-laws used to mistreat over dowry and all hell broke loose after she gave birth to a girl child.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X