వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో పిటిషన్ : ముస్లిం మహిళలకు మసీదుల్లోకి ప్రవేశం కల్పించండి

|
Google Oneindia TeluguNews

శబరిమలై అయ్యప్పస్వామి ఆలయంలోకి మహిళలకు ప్రవేశం కల్పించాలంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన కొద్దిరోజుల్లోనే తమకు కూడా సున్నీ ఆలయాల్లోకి ప్రవేశం కల్పిస్తూ ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నారు కేరళకు చెందిన ముస్లిం సామాజిక వర్గానికి చెందిన మహిళలు.

ప్రొగ్రెసివ్ ముస్లిం వుమెన్ ఫోరం అధ్యక్షురాలు సామాజిక కార్యకర్త వీపీ జురా ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని యోచిస్తున్నారు.సున్నీ ఆలయాలు ముస్లిం మహిళలకు ప్రవేశం కల్పించాలని ఆమె పిటిషన్‌లో కోరనున్నారు. మసీదుల్లో మహిళలను పురుషులను వేరుగా చూస్తారని అదే తనకు చాలా ఇబ్బందిగా మారిందని ఈ నేపథ్యంలోనే తాను సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు జురా తెలిపారు. ఈ పిటిషన్ సమానత్వం కోసమే వేస్తున్నట్లు ఆమె వెల్లడించారు.

Muslim Womens Group to Move Supreme Court to Seek Entry Into Sunni Mosques

మహిళలు మసీదుల్లో ప్రార్థన చేసేందుకు అనుమతించరని వారికి కూడా సమాన హక్కు కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రాఫెట్ మహ్మద్ కాలంలో మహిళలకు మసీదులోకి ప్రవేశం ఉండేదని ఆమె గుర్తుచేశారు. ఈ క్రమంలోనే అడ్వకేట్ వెంకట సుబ్రమణ్యం ఈ వారంలో తన తరుపున సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు జురా తెలిపారు. కొద్దిరోజుల క్రితమే సున్నీ మహిళలు మసీదుల్లోకి ఎందుకు అనుమతించరంటూ కమ్యూనిస్ట్ నేత కొడియేరి బాలకృష్ణన్ ప్రశ్నించారు.

మహిళల పట్ల ఎక్కడా కూడా వివక్ష ఉండరాదని ఆమె అన్నారు. కొందరు మహిళలు మసీదులకు వెళుతున్నారని చెప్పిన కొడియేరి తిరువనంతపురంలోని బీమపల్లి మసీదులో మహిళలకు ప్రవేశం ఉందని చెప్పారు. మహిళలు హజ్ యాత్రలకు కూడా వెళుతున్నారని చెప్పిన కొడియేరి మహిళలు మసీదులోకి ప్రవేశం లేనప్పుడు మక్కా మసీదుకు కూడా అనుమతి ఇవ్వకూడదని ఆమె అన్నారు.

English summary
Days after Supreme Court lifted the ban on entry of menstruating women in the Sabarimala temple, a Kerala-based Muslim women’s outfit is now all set to approach the top court to gain entry in Sunni temples.Social Activist VP Zuhra, President of Kozhikode-based progressive Muslim women’s forum NISA, has decided to petition the Supreme Court, praying that Sunni mosques across the country must allow entry to women.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X