వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉర్దులోకి హనుమాన్ చాలీసా,ముస్లీం యువకుడి కృషి

By Srinivas
|
Google Oneindia TeluguNews

లక్నో: ఎంతో శక్తిమంతమైనదిగా, పవిత్రమైనదిగా భావించే హనుమాన్ చాలీసాను ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ ముస్లీం యువకుడు ఉర్దూలోకి అనువాదం చేశారు. ఆ యువకుడి పేరు అబిద్ అల్వీ.

అబిద్ అల్వీ జాన్‌పూర్‌కు చెందిన వారు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ... తాను మరిన్ని చాలీసాలను ఉర్దూలోకి అనువదిస్తానని చెప్పారు.

శివ చాలీసాను కూడా ఉర్దూలోకి అనువదిస్తానని చెప్పారు. ఇలా చేయడం వల్ల రెండు మతాల వారు ఒకరి సంస్కృతి, విశ్వాసాలను మరొకరు మరింత చక్కగా తెలుసుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు.

హిందువులు, ముస్లీంలు.. ఇరు మతాల వారు కూడా పరస్పరం ఒకరి మతం సంప్రదాయాల గురించి మరొకరు తెలుసుకోవాలనేది తన కోరిక అని చెప్పారు. తాను ఉర్దూ పుస్తకాలను హిందీలోకి అనువదిస్తున్నట్లు చెప్పారు.

 Muslim youth translates Hanuman Chalisa into Urdu

హనుమాన్ చాలీసాను ఉర్దూలోకి అనువదించాలనే ఆలోచన ఎప్పుడు వచ్చిందనే విషయంపై అబిద్ అల్వీ చెప్పారు. తాను ఓసారి వారణాసికి వెళ్లానని, అక్కడ పలువురు విదేశీయులు హనుమాన్ ఛాలీసా పఠించమని ప్రజలను కోరారని చెప్పారు. అప్పుడు తనకు ఈ ఆలోచన వచ్చిందన్నారు.

హనుమాన్ చాలీసాను హిందీ నుంచి ఉర్దూలోకి తర్జూమా చేసేందుకు తనకు మూడు నెలల సమయం తీసుకుందని చెప్పారు. హనుమాన్ చాలీసాకు పూర్తి న్యాయం, ఎలాంటి తప్పు లేకుండా చూసేందుకు అంత సమయం తీసుకుందన్నారు.

తనకు తన తండ్రి ఖురాన్‌లోని అంశాలను చెప్పారని తెలిపారు. కాగా, ప్రముఖ ఉర్దూ కవి అన్వర్ జలాల్ పురి హిందువుల మత గ్రంథం శ్రీ మద్ భగవద్గీతను ఇప్పటికే ఉర్దూలోకి అనువదించారు.

English summary
A Muslim youth in Uttar Pradesh has now translated Hindu prayer Hanuman Chalisa into Urdu after noted Urdu poet Anwar Jalalpuri came out with his rendition of Shrimad Bhagwad Gita.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X