వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాన్ హలాల్ ఉండదని జొమాటో యాప్ అన్ ఇన్‌స్టాల్ చేస్తున్న ఆ యువత

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : ఆహారానికి కుల, మతాలు లేవని ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో స్పష్టంచేసింది. ఫుడ్ ఆర్డర్ చేసిన అమిత్ శుక్లా హిందువేయతర వ్యక్తి తీసుకురావడంతో రిజెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ముస్లిం యుూజర్లు స్పందిస్తున్నారు. జొమాటో తీరును తప్పుపడుతూ .. ఏకంగా యాప్‌ను అన్ ఇన్‌స్టాల్ చేస్తున్నారు. మరికొందరు యూజర్లు కూడా జొమాటోపై రియాక్టవుతున్నారు. 'తాము ఆర్డర్ చేసింది కాకుండా మిగతా ఆహారం అందిస్తారా అని వాజిద్ అనే యూజర్ జొమాటోను ప్రశ్నించారు.

నాన్ హలాల్ ఎలా ?

నాన్ హలాల్ ఎలా ?

అంతేకాదు తాను హలాల్ కానీ ఫుడ్ ఆమోదించబోనని స్పస్టంచేశారు. మీ యాప్‌లో నాన్ హలాల్ అని మెన్షన్ చేయలేదని .. కొన్ని రెస్టారెంట్లలో అలా సర్వ్ చేయడం లేదని తాను ఎక్వైరీ చేస్తే తెలిసొచ్చిందని పేర్కొన్నారు. దాంతో తాము జొమాటో యాప్ నుంచి క్విట్ అవుతున్నామని పేర్కొన్నారు. అయితే దీనిపై జొమాటో యాజమాన్యం స్పందించింది. మీకు జరిగిన అనుభవం మరొకరికి జరగొద్దని భావిస్తోన్నాం. అందుకే చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. అంతేకాదు మీ ఆర్డర్ నంబర్ తమకు షేర్ చేయాలని కోరారు. వెంటనే చర్యలు తీసుకుంటామని వివరించారు. ఇలా ఉంటే మరికొందరు జొమాటోలో హిందుత్వ అజెండా ఉందని మరికొందరు అంటున్నారు. మరికొందరు తమ యాప్ అన్ ఇన్ స్టాల్ చేస్తున్నారు.

ఏం జరిగిందంటే ..?

ఏం జరిగిందంటే ..?

ఇటీవల అమిత్ శుక్లా అనే వ్యక్తి జొమాటోలో ఫుడ్ డెలివరీ చేశాడు. ఆయన చేసిన ఆహారం సమయానికి వచ్చింది. అయితే ఆకలితో ఉన్న ఆ ఫుడ్ తీసుకోవాల్సిన శుక్లాకు మతం అడ్డొచ్చింది. డెలివరీ బాయ్ తమ మతం కాదని వింత కారణం చెప్పాడు. అంతేకాదు తాను చేసిన ఘనకార్యాన్ని సోషల్ మీడియా ట్విట్టర్‌లో షేర్ చేశాడు. దీనికి జొమాటో తీవ్రంగానే స్పందించింది. తమకు కుల, మత పట్టింపులు లేవని స్పష్టంచేసింది. మీకు ఆహారం వద్దంటే క్యాన్సిల్ చేయండి, రీ ఫండ్ మాత్రం ఇవ్వబోమని తేల్చిచెప్పింది. మత ఛాందసవాది అయిన శుక్లా ఆర్డర్ క్యాన్సిల్ చేసి .. తన మత మౌఢ్యాన్ని నిరూపించుకున్నాడు. తనకు రీ ఫండ్ కూడా వద్దని చెప్తూ తాను బుక్ చేసిన ఆహారాన్ని తీసుకోకుండా క్యాన్సిల్ చేశాడు.

కుల,మతాలు లేవు

కుల,మతాలు లేవు

దీనిపై జొమాటో స్పందిస్తూ .. ఆహారానికి మతం లేదని, మీకు తెలిసి కుల, మతాలు ఉన్నాయా అని శుక్లాను ప్రశ్నించింది. అంతేకాదు జొమాటో వ్యవస్థాపకుడు దీపేందర్ జోయల్ కూడా రియాక్టరయ్యారు. ‘మేం భారతదేశ వారసత్వ సంపదకు వారసులైనందుకు గర్వంగా భావిస్తున్నాం, అంతేకాదు తమ వినియోగదారులు, భాగస్వాముల సహకారంతో జొమాటో ఉన్నత శిఖరాలను అదిరోహిస్తున్నాం. అయితే ఈ సందర్భంగా తమ వ్యాపార సంస్థను పెంచుకునేందుకు మాత్రం విలువలకు కట్టుబడి ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో విలువలకు తిలోదకాలివ్వం.. తమ వ్యాపారంలో నష్టమొచ్చినా ఫరావాలేదు‘ అని ట్వీట్ చేశారు. హిందుయేతర డెలివరీ బాయ్ తీసుకొచ్చిన ఆహారాన్ని శుక్లా నిరాకరించడంతో ఈ మేరకు ఘాటుగా స్పందించారు గోయల్.

English summary
Food delivery company Zomato makes it clear that there is no caste and creed in the food. Muslim Users are responding. Uninstalling the app.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X