వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముస్లింలు పాకిస్థాన్‌ వెళ్లనందుకే వేధింపులకు గురిచేస్తున్నారు...! ఎంపీ ఆజాం ఖాన్

|
Google Oneindia TeluguNews

వివాదస్పద సమాజ్‌వాది ఎంపీ ఆజం ఖాన్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఇటివల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నటి జయప్రదపై పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆయన చివరకు రాంపూర్ పార్లమెంట్ నియోజక వర్గం నుండి ఎంపీకయ్యారు. కాగా తాజగా మరోసారి ఆయన వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.ముస్లింలు భారత దేశంలో అనేక వేధింపులకు గురవుతున్నారని ఆయన అన్నారు. తాము పాకిస్థాన్‌కు వెళ్లిపోనందుకే తమపై వేధింపులకు గురిచేస్తున్నారని అన్నారు.

 ముస్లింలు భారత్‌ను స్వదేశంగా భావించారు...

ముస్లింలు భారత్‌ను స్వదేశంగా భావించారు...

వివాదస్పద వ్యాఖ్యలతో నిరంతరం వార్తల్లో ఉండే రాంపూర్ ఎంపీ సమాజ్ పార్టీ సీనియర్ నేత ఆజాం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మూక దాడులపై స్థానిక మీడియాతో మాట్లాడిన అజాం ఖాన్ దేశంలో ఉన్న ముస్లింపై ఇంకా దాడులు కొనసాగుతున్నాయని అన్నారు. ముఖ్యంగా 1947 లో దేశ విభజనలో భాగంగా ముస్లింలు ఎవరైతే పాకిస్థాన్‌కు వెళ్లకుండా ఉన్నందుకే వారిపై దాడులు కొనసాగుతున్నాయని అన్నారు. అయితే అప్పటి ముస్లింలు భారత దేశాన్ని తమ దేశంగా భావించడం వల్లే పాకిస్థాన్‌కు వెళ్లలేదని అన్నారు.

గాంధీతో పాటు ఇతర నాయకులు ముస్లింలను వెళ్లకుండా ఆపారు...

గాంధీతో పాటు ఇతర నాయకులు ముస్లింలను వెళ్లకుండా ఆపారు...


పాకిస్థాన్‌కు ముస్లింలు వెల్లకుండా మౌలానా అబుల్ కలాం ఆజాద్,పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ,తోపాటు సర్ధార్ పటేల్ ,మహాత్మా గాంధీలు సైతం విజ్ఝప్తి చేశారని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలోనే ఇండియాలో ఉన్న ముస్లింలు డిగ్నిఫైడ్‌గా బ్రతకలేక పోతున్నారని అన్నారు. 1947 నుండి చాల నిరాశ జీవితాన్ని గడుపుతున్నామని అన్నారు. ఇది చాల సిగ్గుచేటని పేర్కోన్నారు.

ఎన్నికల్లో బీజేపీ అనేక ఇబ్బందులకు గురి చేసింది.

ఎన్నికల్లో బీజేపీ అనేక ఇబ్బందులకు గురి చేసింది.

ఇందులో భాగంగా బీజేపీ ప్రభుత్వం ఆయనపై ఆనేక ల్యాండ్ వివాదాలకు సంబంధించి తనపై కేసులు నమోదు చేసిందని తెలిపారు. ఎన్నో ఒడిదుడుకులను ,కుట్రలను తట్టుకుని ఎంపీగా గెలుపోందానని చెప్పిన ఆయన చివరికి జిల్లా కలెక్టర్ కూడ కాషాయ బట్టలు వేసుకుని పోలింగ్ బూత్‌ల్లో పర్యటించాడని అనంతరం ఓటర్లను సైతం వేధింపులకు గురి చేశాడని ఆయన ఆరోపణలు చేశారు.కాగా ఎన్నికల సమయంలో కూడ ప్రత్యర్ధిగా పోటి చేసిన జయప్రదపై ఆనేక వివాదస్పద వ్యాఖ్యలు చేసి అనంతరం వెనక్కి తీసుకున్నాడు.

English summary
In another controversial statement, senior leader of the Samajwadi Party (SP) Azam Khan said on Saturday that Muslims in the country are being punished for their decision to not go migrate to Pakistan after the partition in 1947.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X