వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముస్లింలు ఓటేయకున్నా ఓకే .. ఆర్ఎస్ఎస్ రక్తం నాది ... కేంద్రమంత్రి గడ్కరీ వివాదాస్పద వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : పుల్వామా తర్వాత ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుంటే బీజేపీ నేతల మాత్రం కాంట్రవర్సీ కామెంట్లు కొనసాగుతోన్నాయి. పాక్ పై దాడితో కర్ణాటక లో లోక్ సభ సీట్లు పెరుగుతాయని యడ్యూరప్ప నాలుక కరచుకోగా .. తర్వాత సీన్ లోకి గడ్కరీ ఎంట్రీ ఇచ్చారు. యడ్డీ లాగా సీట్ల గురించి కాకుండా తన నియోజకవర్గంలోని ఓట్ల గురించి ప్రస్తావించారు.

గడ్కరీ కరడుగట్టిన హిందుత్వవాది

గడ్కరీ కరడుగట్టిన హిందుత్వవాది

నితిన్ గడ్కరీ కరడుగట్టిన హిందుత్వవాది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మళ్లీ నాగ్ పూర్ నుంచి పోటీ చేస్తానని శుక్రవారం జాతీయ మీడియాకు చెప్పారు. గెలుపుపై మాత్రం ధీమా వ్యక్తం చేశారు. మెజారిటీ కూడా 5 లక్షల ఓట్లు దాటుతుందని అంచనా వేశారు. ఇంతవరకు బాగుంది కానీ తర్వాతే తన గెలుపుపై ధీమో .. లేదో కానీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనకు ముస్లింలెవరూ ఓటేయకున్నా ఫర్వాలేదని వ్యాఖ్యానించారు. తాను ఆర్ ఎస్ ఎస్ వాదినని .. 10 లక్షల మంది ముస్లింల మధ్య నిలబడి కూడా ఇదే మాట చెప్తానన్నారు. అయితే వారిలో కొందరు ఓటేస్తే హ్యాపీ, వేయకున్నా పర్లేదు. ఈ విధంగా మాట్లాడటం తప్పే కావొచ్చు కానీ లెక్కలేసుకొని మాట్లాడే రకం కాదని .. బాధ్యతగల బీజేపీ కార్యకర్తగా దేశమే సుప్రీం అని భావిస్తా అని స్పష్టంచేశారు.

తెరపైకి పేరు వెనుక ?

తెరపైకి పేరు వెనుక ?

పనిలో పనిగా ప్రధానమంత్రి కావాలనే కోరిక తనకు లేదని స్పష్టంచేశారు. పదవీ చేపట్టేందుకు ఉండాల్సిన లక్షణాలు తనలో లేవని ... విస్పష్టంగా చెప్పారు. కానీ ఇటీవల మోదీకి ప్రత్యామ్నాయంగా తన పేరు ఎందుకు వినిపిస్తుందో తెలియడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ మెజార్టీ సాధించి .. తిరిగి అధికారం చేపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మోదీ ప్రధాని అవుతారు .. తామంతా మంత్రులుగా మోదీ వెంట ఉంటామని స్పష్టంచేశారు. మోదీ అభ్యర్థిత్వాన్ని మేమే సమర్థిస్తుంటే ఇక ప్రధాని పదవీకి పోటీ ఎక్కడ ఉందని గడ్కరీ ప్రశ్నించారు.

సఖ్యత .. సమర్థతే కారణమా ?

సఖ్యత .. సమర్థతే కారణమా ?

తన వద్దకు వచ్చేవారితో బాగా మాట్లాడుతానని స్పష్టంచేశారు గడ్కరీ. కష్టపడి పనిచేస్తానని .. పార్టీ కోసం నిస్వార్థంగా శ్రమిస్తానని పేర్కొన్నారు. ఈ లక్షణాల వల్లే తనను ప్రధాని అభ్యర్థిగా ప్రచారం చేసి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.

సిద్ధాంతాలే విభిన్నం ..

సిద్ధాంతాలే విభిన్నం ..

బీజేపీ, ఆ పార్టీ అగ్రనేతల ప్రచారం కాంగ్రెస్ ముక్త్ బారత్ .. ఈ నినాదంపై గడ్కరీ భిన్నంగా స్పందించారు. సిద్ధాంతాలు భిన్నంగా ఉన్నంత మాత్రానా విపక్షాలను ప్రత్యర్థులుగా చూడాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. దీంతోపాటు నిరుద్యోగులు ఉద్యోగాల కోసం చూడటం మాని .. ఉద్యోగం కల్పించేస్థాయికి ఎదిగేందుకు కృషిచేయాలని సలహా ఇచ్చారు.

English summary
Nitin Gadkari is a hardline Hindutva. he would contest the Lok Sabha elections from Nagpur again. The majority of the population is expected to cross 5 lakh votes. He said that no Muslim was voted for him. he is standing between 10 lakh Muslims. But if some of them are happy, they will not be happy. It is wrong to speak this but it is not a calculation, it is clear that the country is supreme as a responsible BJP activist.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X