వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూపీలో బీజేపీ హవా: వీరంతా ఏం కోరుకుంటున్నారంటే..

ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ గాలి వీచినట్లుగా ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. అయితే కమలం పార్టీకి పూర్తి మెజార్టీ మాత్రం వచ్చే అవకాశాలు లేవని ఎక్కువ సర్వేలు తేల్చాయి. దీంతో హంగ్ వచ్చే అవకాశముందని స్పష్ట

|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ గాలి వీచినట్లుగా ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. అయితే కమలం పార్టీకి పూర్తి మెజార్టీ మాత్రం వచ్చే అవకాశాలు లేవని ఎక్కువ సర్వేలు తేల్చాయి. దీంతో హంగ్ వచ్చే అవకాశముందని స్పష్టమవుతోంది.

బీజేపీకి షాక్, మాయావతితో సిద్ధం: అఖిలేష్ షాకింగ్ ప్రకటనబీజేపీకి షాక్, మాయావతితో సిద్ధం: అఖిలేష్ షాకింగ్ ప్రకటన

బీజేపీకి చెక్ పెట్టేందుకు ఎస్పీ-బీఎస్పీ కలిస్తే ప్రభుత్వం ఏర్పాటు అయ్యే అవకాశాలను కూడా కొట్టేసే పరిస్థితి లేదు. ఇప్పటికే సీఎం అఖిలేష్ యాదవ్ ఈ ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. తమకు తక్కువ సీట్లు వస్తే బీఎస్పీతో జత కట్టేందుకు సిద్ధమన్నారు. మాయావతి నుంచి మాత్రం స్పందన రాలేదు.

ముస్లీంలు కోరుకుంటున్నది ఇదే

ముస్లీంలు కోరుకుంటున్నది ఇదే

యూపీలో ఉన్న ఎక్కువ మంది ముస్లీంలు ఎస్పీ-బీఎస్పీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు. హంగ్ ఏర్పడే పరిస్థితి వస్తే.. బీజేపీని పక్కన పెట్టాలని వారు కోరుకుంటున్నారు.

సర్వేలో ఏం చెప్పారంటే..

సర్వేలో ఏం చెప్పారంటే..

'క్రౌడ్ న్యూసింగ్' ఈ విషయమై ఓ సర్వే చేసింది. 92 శాతం మంది ముస్లీంలు హంగ్ పరిస్థితి వస్తే ఎస్పీ-బీఎస్పీ కలవాలని చెప్పాయి. ఈ రెండు పార్టీలు కూడా తమ తమ విభేదాలు పక్కన పెట్టాలని కోరుకుంటున్నారు.

ఈ ప్రాంతాల్లో సర్వే..

ఈ ప్రాంతాల్లో సర్వే..

10 ముస్లీం మెజార్టీ ప్రాంతాలలో ఈ సర్వే నిర్వహించారు. 2,600 మందిని ఈ విషయమై అడిగారు. అర్బన్, రూరల్ ప్రాంతాల్లో సర్వే చేశారు. ఇందులో ఎక్కువ శాతం మంది మాయావతి - అఖిలేష్ కలవాలని కోరుకున్నారు.

బీజేపీపై అసంతృప్తితోనే..

బీజేపీపై అసంతృప్తితోనే..

ఎన్నికల్లో ముస్లీం ఓట్లు ఎస్పీ-కాంగ్రెస్, బీఎస్పీల మధ్య చీలిపోయాయి. ఎస్పీ-కాంగ్రెస్ 55 శాతం ఓట్లు, బీఎస్పీ 36 శాతం ఓట్లు ఆ వర్గం నుంచి పొందాయని తెలుస్తోంది. బీజేపీ పైన అసంతృప్తితోనే వారు ఈ పార్టీలు కలవాలని కోరుకుంటున్నాయి.

English summary
Even as most exit polls indicated a hung Assembly in Uttar Pradesh, a survey of the Muslim community in the State show large number of them want the Samajwadi Party (SP) and Bahujan Samaj Party (BSP) to join hands in such a situation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X