వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మస్ట్ రీడ్: క్రెడిట్ స్కోరు బాగుంటేనే తక్కువ వడ్డీకే రుణాలు..ఎలాగంటే?

|
Google Oneindia TeluguNews

సాధారణంగా బ్యాంకుల నుంచి రుణాలు పొందాలంటే అంత సులభం కాదు. దీనికి ఎన్నో లెక్కలు ఉంటాయి. చాలా డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. గ్యారెంటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఎన్నో లెక్కలు ఉంటాయి. ఇక అంతకంటే ముఖ్యంగా రుణాలు పొందేవారు అప్పటికే క్రెడిట్ కార్డు వినియోగిస్తున్నట్లయితే ఆ క్రెడిట్ స్కోరును స్థిరంగా మెయింటెయిన్ చేయడం చాలా అవసరం. ఎందుకంటే ఆ క్రెడిట్ స్కోరు ఆధారంగానే ఎంత రుణం ఆయా బ్యాంకులు ఇవ్వగలవో ఏ వడ్డీరేటుతో ఇవ్వగలరో అనేది ఆధారపడి ఉంటుంది.

క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించలేక భార్యా, బిడ్డతో కలిసి ఏం చేశాడంటే..?క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించలేక భార్యా, బిడ్డతో కలిసి ఏం చేశాడంటే..?

 క్రెడిట్ స్కోరు ఆధారంగానే బ్యాంకు రుణాలు

క్రెడిట్ స్కోరు ఆధారంగానే బ్యాంకు రుణాలు

క్రెడిట్ కార్డు... ఈ రోజుల్లో అవసరాలకు డబ్బులు లేకుంటే ఆదుకునేది ఈ క్రెడిట్ కార్డే. అయితే క్రెడిట్ కార్డు వినియోగించి అవసరాలను తీర్చుకుంటున్నాం. అయితే ఏ మేరకు వాడుకున్న ఆ డబ్బును తిరిగి సకాలంలో చెల్లిస్తున్నామన్నది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే భవిష్యత్తులో బ్యాంకుల నుంచి రుణాలు పొందాలంటే ఈ క్రెడిట్ కార్డు స్కోరు ఆధారంగానే బ్యాంకులు రుణాలు ఇస్తాయి. అందుకే రుణాలు పొందాలంటే మంచి క్రెడిట్ స్కోర్ ఉండటం చాలా అవసరం అంటున్నారు ఆర్థిక నిపుణులు.

థర్డ్ పార్టీ సమాచారం ఆధారంగా...

థర్డ్ పార్టీ సమాచారం ఆధారంగా...

చాలావరకు బ్యాంకులు, రిజర్వ్ బ్యాంకుతో అనుసంధానమైన బెంచ్‌మార్క్‌లు, థర్డ్ పార్టీ ద్వారా వచ్చే క్రెడిట్ స్కోర్‌ను పరిగణలోకి తీసుకుని ఫలానా వ్యక్తికి వివిధ వడ్డీరేట్ల ఆధారంగా రుణాలు ఇచ్చేందుకు యోచిస్తున్నాయని ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం కనీసమంటే మూడు ప్రభుత్వంరంగ బ్యాంకులు బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిండికేట్ బ్యాంకులు థర్డ్ పార్టీ క్రెడిట్ స్కోర్ ఆధారం చేసుకుని రుణాలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు ఎకనామిక్స్ టైమ్స్ తన కథనంలో ప్రచురితం చేసింది.

 తక్కువ వడ్డీకే రుణం పొందాలంటే క్రెడిట్ స్కోరు ...

తక్కువ వడ్డీకే రుణం పొందాలంటే క్రెడిట్ స్కోరు ...

ఉదాహరణకు గృహరుణాలు మంజూరు చేయాలంటే ఓ వ్యక్తి క్రెడిట్ స్కోరును క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి తీసుకుని దాని ఆధారంగా వడ్డీలను సవరించి రుణాలు మంజూరు చేయనుంది బ్యాంక్ ఆఫ్ బరోడా. 900 స్కోరుకుగాను 760 క్రెడిట్ స్కోరు ఒక కస్టమర్‌కు ఉందంటే వారికి మిగతావారితో పోలిస్తే 1శాతం తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వనుంది. ఇక 675కంటే తక్కువ క్రెడిట్ స్కోరు ఉన్న వారికి రుణాలు మంజూరు చేయడం చాలా అరుదుగా జరుగుతుంది. ఇక క్రెడిట్ స్కోరు 760కి పైగా మెయిన్‌టెయిన్‌ చేసేవారు 8.1శాతం వడ్డీ చెల్లించనుండగా అంతకంటే తక్కువగా అంటే 675-724 మధ్య ఉంటే 9.1 శాతం వడ్డీ చెల్లిస్తున్నారు.

 రుణం ముగిసే వరకు మంచి స్కోరు ఉండాల్సిందే

రుణం ముగిసే వరకు మంచి స్కోరు ఉండాల్సిందే

ఇక క్రెడిట్ స్కోరును 725 నుంచి 759 మధ్య మెయిన్‌టెయిన్ చేస్తున్నట్లయితే తీసుకున్న రుణంపై 8.35శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే కేవలం రుణం తీసుకునేందుకు మాత్రమే మంచి క్రెడిట్ స్కోరు మెయిన్‌టెయిన్ చేస్తే సరిపోదని రుణం చెల్లించేవరకు ఆ స్కోరును స్థిరంగా మెయిన్‌టెయిన్ చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ క్రెడిట్ స్కోరు పడిపోతే రుణంపై తీసుకున్న వడ్డీ ఆటోమేటిగ్గా పెరిగిపోతుందని చెబుతున్నారు. మంచి క్రెడిట్ స్కోరు మెయిన్‌టెయిన్ చేయడం వల్ల దీర్ఘకాలం రుణాలపై ఒక్క శాతం వడ్డీ తగ్గుతుందంటే కొన్ని లక్షలు ఆదా అవుతాయని నిపుణులు చెబుతున్నారు.

క్రెడిట్ స్కోరును ఎలా చెక్ ‌ చేసుకోవాలి..?

క్రెడిట్ స్కోరును ఎలా చెక్ ‌ చేసుకోవాలి..?

క్రెడిట్ స్కోరు మెయిన్‌టెయిన్‌ చేయాలంటే ఎప్పటికప్పుడు స్కోరును తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం చాలా సంస్థలు కస్టమర్ల క్రెడిట్ స్కోరును అందిస్తున్నాయి. ఇందులో సిబిల్, ఈక్వీఫాక్స్, ఎక్స్‌పీరియన్, సీఆర్ఐఎఫ్‌లాంటి బ్రాండెడ్ సంస్థలు ఒకరి వ్యక్తిగత క్రెడిట్ స్కోరు వివరాలను తెలుపుతాయి. ఇదంతా వారు ఏ బ్యాంకు నుంచి అయితే క్రెడిట్ కార్డు పొందారో ఆ బ్యాంకులు ఈ సంస్థలకు మొత్తం సమాచారంను అందిస్తాయి. కొన్ని బ్యాంకులు తమ అంతర్గత విచారణను చేసుకుని లోన్లు మంజూరు చేస్తుండగా చాలా బ్యాంకులు థర్డ్ పార్టీ ఇచ్చే నివేదికను ఆధారం చేసుకుని లోన్లు మంజూరు చేస్తున్నాయి. ఇందుకోసమే సులభతరంగా రుణాలు పొందాలంటే క్రెడిట్ స్కోరును 760 మెయిన్‌టెయిన్ చేస్తే బాగుంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

English summary
Maintaining a good credit score will now help customers get cheaper interest rates on loans from banks.Some banks, which have already linked Reserve Bank of India's external benchmark regime, look to utilise third-party credit score to offer different interest rates on retail loans to potential buyers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X