వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమానుషం: 70 మంది విద్యార్థినులను నగ్నంగా చేసి తనిఖీ, అందుకోసమేనా?

ఉత్తర్ ప్రదేశ్ లోని కస్తూర్బాగాంధీ రెసిడెన్షియల్ స్కూల్ లో విధ్యార్థినులను నగ్నంగా చేసి ఓ వార్డెన్ అతి దారుణంగా ప్రవర్తించింది. వరుసగా 70 మంది విద్యార్థినులను నిలబెట్టి మరీ చెక్ చేసింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

లక్నో:ఉత్తర్ ప్రదేశ్ లోని కస్తూర్బాగాంధీ రెసిడెన్షియల్ స్కూల్ లో విధ్యార్థినులను నగ్నంగా చేసి ఓ వార్డెన్ అతి దారుణంగా ప్రవర్తించింది. వరుసగా 70 మంది విద్యార్థినులను నిలబెట్టి మరీ చెక్ చేసింది.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్ లోని కస్తూర్బాగాంధీ రెసిడెన్షియల్ స్కూల్ వార్డెన్ 70 మంది విద్యార్థినులను వరుసగా నిలబెట్టింది.

అయితే వరుసగా విద్యార్థినులను బట్టలు విప్పేయాలని వార్డెన్ ఆదేశించింది. బట్టలు విప్పేయని విద్యార్థినులపై చితకబాదుతానని ఆమె హెచ్చరించింది.

muzaffarnagar School Warden 'Strips' 70 Girls to Check for Menstrual Blood

దీంతో విద్యార్థినులను వరుసగా నిలబెట్టి తనిఖీలు చేసింది వార్డెన్. ఈ ఘటన పట్ల విద్యార్థినులు తమ కుటుంబసభ్యులకు పిర్యాదు చేశారు. అంతేకాదు మీడియా వద్ద కూడ విద్యార్థినులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ఆ వార్డెన్ ను ఉద్యోగం నుండి తొలగించారు. అయితే ఆ వార్డెన్ మాత్రం తాను చేసిన పనిని సమర్థించుకొంది. హాస్టల్ బాత్ రూమ్ లో ఓ చోట రక్తం మరకలు కన్పించాయని చెప్పింది.

ఎవరికి ఎలాంటి సమస్య ఉందో చెప్పేందుకు అమ్మాయిలు ఇబ్బంది పడే అవకాశం ఉన్నందున వారి ఆరోగ్యానికి హని జరగకుండా చూడాలని తాను ప్రయత్నించినట్టు తెలిపింది.

బాధితురాలు ఎవరో గుర్తించేందుకే తాను విద్యార్థినుల బట్టలు విప్పేయాల్సి వచ్చిందని వార్డెన్ వివరణ ఇచ్చారు. చదువు విషయంలో తాను చాలా కఠినంగా ఉంటానని, అందుకే చాలా మందికి తాను నచ్చడం లేదని ఆమె చెప్పుకొచ్చింది. ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు ఉన్నతాధికారులు.

English summary
The concerned students at the Kasturba Gandhi Girls Residential School said the female warden rounded them up and ordered them to strip and allegedly threatened them with a beating if they disobeyed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X