వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాన్న నాతో చెప్పిన విషయం!.. అదో గొప్ప కానుక: రాహుల్ గాంధీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నేడు భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీ 27వ వర్థంతి సందర్భంగా.. ఆయన కుమారుడు, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ, పలువురు కాంగ్రెస్ నాయకులు ఆయనకు నివాళులు అర్పించారు. ఢిల్లీలోని రాజీవ్ గాంధీ స్థూపం వద్ద రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించిన అనంతరం.. రాహుల్ ట్విట్టర్ ద్వారా తన సందేశాన్ని పంచుకున్నారు.

My father taught that hate is a prison for those who carry it: Rahul Gandhi

'ద్వేషం కలిగి ఉన్నవాళ్లు చెరసాలలో ఉన్నట్టే అని నాన్న చెప్పారు అందరినీ ప్రేమించాలి, గౌరవించాలి అన్న విలువైన మాటలు ఆయన నాకు చెప్పారు. ఓ కుమారుడికి తండ్రి ఇచ్చే విలువైన కానుక ఇది. అందుకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ' అని ట్వీట్ లో రాహుల్ పేర్కొన్నారు.

తనను ప్రేమించేవారి హృదయాల్లో రాజీవ్‌ గాంధీ చిరస్మరణీయంగా నిలిచిపోతారని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ కుటుంబ సభ్యులతో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఆయనకు నివాళులు అర్పించారు.

కాగా, 1991, మే 21న తమిళనాడులోని పెరంబూరులో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న రాజీవ్‌గాంధీని ఎల్‌టీటీఈ హత్య చేసింది. అయితే ఆ హంతకులను తాము గతంలోనే క్షమించేశామని రాహుల్, ఆయన సోదరి ప్రియాంక అప్పట్లో ప్రకటించారు.

ఇదిలా ఉంటే, నిజానికి ఈరోజే కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకారం చేయాల్సి ఉన్నా.. రాజీవ్ వర్థంతి కారణంగా బుధవారానికి దాన్ని వేయిదా వేశారు.

English summary
Paying homage to his father, Rajiv Gandhi, on his 27th death anniversary, Congress president Rahul Gandhi on Monday said that the former Prime Minister taught him that "hate is a prison for those who carry it".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X