• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జై హింద్, జై శ్రీరాం కాదు : దీదీ సంచలనం

|

కోల్ కతా : టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తాను, తన పార్టీ వందేమాతరం అని అంటోందని .. విశ్వసిస్తోందని కుండబద్దలు కొట్టారు. తాము కలలో కూడా జై శ్రీరాం అనే మాటలను నమ్మబోమని తేల్చిచెప్పారు. బీజేపీ, ఆరెస్సెస్ హిందూత్వ ఎజెండగా రాముడు, హిందుత్వంతో ముందుకెళ్తుండగా .. టీఎంసీ జై శ్రీరాం అనబోనని మరోసారి స్పష్టంచేయడం పొలిటికల్ సర్కిల్లో చర్చకు దారితీసింది.

 My slogan is Jai Hind and Vande Mataram not Jai Shri Ram

జై బంగ్లా

బెంగాల్‌లో బీజేపీ జై హిందు అని అంటే తాము జై బంగ్లా, జై హిందు అంటామని ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. మా స్లోగన్ వందేమాతరం, లేదంటే జై హింద్ ఉంటుంది తప్ప మరొటి ఉండదని ... జై శ్రీరాం బీజేపీ స్లోగన్ అని విమర్శించారు. అలాగే తాము హిందు-ముస్లింల పేరుతో రాజకీయాల చేయమని, చేయబోమని స్పష్టంచేశారు. దేశంలో ప్రతి కులం, మా కులమే, కానీ బీజేపీ కుల రాజకీయాల గురించి ... ప్రచారానికి వస్తోన్న మోదీని అడగండి అని ప్రజలను కోరారు మమత.

మాదే విజయం ..

బెంగాల్‌లో టీఎంసీ విజయంపై మమత ధీమాతో ఉన్నారు. తమకు మోదీ, బీజేపీతో ఎలాంటి ప్రమాదం ఉండబోదన్నారు. రాష్ట్రంలో కులమతాలకతీతంగా అందరూ టీఎంసీని సపోర్ట్ చేస్తున్నారని గుర్తుచేశారు. అంతేకాదు ఈ ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాజయం తప్పదని జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల్లో మోదీ, మీరు వ్యక్తిగత విమర్శలు హద్దుమీరాయని మీడియా ప్రతినిధి ప్రశ్నిస్తే .. ఈ గొడవను రాజేసింది ఎవరూ అని ఎదురు ప్రశ్నించారు. అంతేకాదు మోదీ ఇక కాలం చెల్లిన బాబు అని మరోసారి గుర్తుచేశారు. మోదీకి తానే స్పీడ్ బ్రేకర్ వేస్తున్నట్టు ధీమాతో చెప్పారామె. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుందని కానీ మోదీ మాత్రం వ్యక్తిగత దూషణకు దిగారని పేర్కొన్నారు. అలాంటి సాంప్రదాయం తీసుకొచ్చినందునే ... మోదీపై ఎదురుదాడికి దిగాల్సి వచ్చిందని స్పష్టంచేశారు మమత.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Trinamool Congress president and West Bengal Chief Minister Mamata Banerjee on Thursday said she and her party believes in the slogan 'Jai Hind' and not 'Jai Shri Ram'. Attacking the Bharatiya Janata Party (BJP), Mamata Banerjee said, "Let the BJP say Jai Shri Ram in West Bengal but we will say Jai Bangla and Jai Hind." "We never do the politics of Hindu-Muslim. Every religion is my religion, every caste is my caste. Why the BJP does this politics, you should ask Narendra Modi," she said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more