• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

'శశికళను రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకొనేందుకు ప్రయత్నించా, ఆ వీడియో డీలీట్ చేశారు'

By Narsimha
|

బెంగుళూరు: విలాస జీవితానికి అలవాటుపడిన అన్నాడిఎంకె నుండి బహిష్కరణకు గురైన శశికళ జైలులో కూడ అదే జీవితాన్ని గడిపేందుకు ప్రయత్నించారని జైళ్ళశాఖ నుండి ఇటీవలే ట్రాఫిక్ విభాగానికి బదిలీపై వెళ్ళిన డిఐజీ రూప చెప్పారు. పరప్పరఅగ్రహరజైలులో శశికళ పొందుతున్న విఐపీ ట్రీట్‌మెంట్‌ను ఆమె బట్టబయలు చేశారు. ముడుపులు తీసుకొన్న కొందరు అధికారులు ఆమెకు జైళ్లోనే సౌకర్యాలు కల్పిస్తున్నారని రూప బాంబు పేల్చారు. జైలు నుండి బయటకు వెళ్తోంటే ఆమె పట్టుకోవాలని ప్రయత్నించినట్టు రూప చెప్పారు. అయితే శశికళను రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకోవాలని ఆమె ప్రయత్నించినట్టు తేల్చారు.

ఆస్తుల కేసులో కర్ణాటకలోని పరప్పర ఆగ్రహర జైలులో శశికళ జైలుశిక్షను అనుభవిస్తున్నారు.అయితే జైలులో శశికళ విఐపీ సౌకర్యాలను పొందుతున్నారనే విషయాన్ని డిఐజీ రూప బాహ్య ప్రపంచానికి తెలిపారు.

ఈ విషయమై ఆమె ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీంతో కర్ణాటకలో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ఈ విషయమై రూప సర్వీస్ రూల్స్ బ్రేక్ చేశారని కూడ ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రి సిద్దరామయ్య కూడ ప్రకటించారు. దీంతో ఆమెను ట్రాఫిక్ విభాగానికి బదిలీ చేశారు.

జైళ్ళశాఖలో చోటుచేసుకొన్న పరిణామాలు శశికళను పట్టుకొనేందుకు తాను చేసిన ప్రయత్నాలను ఆమె బయటపెట్టారు. తమిళ సాయంకాలం దినపత్రిక మురస్ కు ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆమె పలు విషయాలను వెల్లడించారు.

శశికళను రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకొనేందుకు ప్రయత్నించా

శశికళను రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకొనేందుకు ప్రయత్నించా

జైలు పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌లో శశికళ నివాసం ఉందని డిఐపీ రూప గుర్తించారు. శశికళ అసలు జైల్లోనే లేరని ఆమె తెలిపారు. శశికళ జైలుకు సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉన్నారని సమాచారం అందింది. స్వయంగా ఆమెను పట్టుకోవాలని ప్రయత్నించినట్టు చెప్పారు. అయితే సాద్యం కాలేదన్నారు. జైలు నుండి బయటకు వెళ్తూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఆమెకు ఇంకా కఠినమైన శిక్షలు ఉండేవని డిఐజీ రూప చెప్పారు. తాను చేసిన ఆరోపణలు రుజువైతే శశికళకు మరింత కాలం శిక్షలు పడే అవకాశం లేకపోలేదని ఆమె చెప్పారు.

  Sasikala bribes prison officers, gets luxury treatment in jail | Oneindia News
  సాధారణ ఖైదీలను బెదిరించారు

  సాధారణ ఖైదీలను బెదిరించారు

  జైలులో ఉన్న సాధారణ ఖైదీలను బెదిరింపులకు గురిచేశారని డిఐజీ రూప చెప్పారు. జైలులో చోటుచేసుకొన్న అవకతవకలపై ఉన్నతాధికారులకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్టు చెప్పారు. తాను సమర్పించిన నివేదికలోవన్నీ వాస్తవాలేనన్నారు. నాలుగుసార్లు తనిఖీలు నిర్వహించినట్టు చెప్పారు. తనిఖీలకు వెళ్ళినప్పుడు ఖైదీలను అధికారులు బెదిరింపులకు గురిచేసేవారని చెప్పారు.దీంతో కొన్ని విషయాలు తనకు తెలియకుండా ఉన్నాయన్నారు. శశికళకు ఐదు గదులు కేటాయించింది నిజమేనన్నారు. ఆ గదుల్లో ఎల్‌ఈడీ టీవి, మంచం, కుక్కర్, కాఫీ మేకర్, సూప్ తయారీ సామాన్లు, గృహోపకరణాలున్నాయన్నారు. రెండో రూమ్‌లో లెక్కలేనన్నీ చుడీదార్లు, చీరలు,నైటీలున్నట్టు ఆమె చెప్పారు.

  ఆపిల్ ఐ ఫోన్, రెండు సిమ్‌కార్డులు

  ఆపిల్ ఐ ఫోన్, రెండు సిమ్‌కార్డులు

  జైల్లో ఖైదీలు ధరించాల్సిన యూనిఫామ్‌ను ఆమె ఏనాడూ ధరించలేదని డిఐజీ రూప చెప్పారు. ఆమె గదిలో ఉన్న యూనిఫాం దుస్తుల మడతలే అలా ఉన్నాయన్నారు. శశికళకు అవసరమైన మందులు బయట నుండే వస్తున్నాయన్నాయని చెప్పారు. జైల్లో శశికళకు ఆపిల్ ఐ ఫోన్, రెండు సిమ్‌కార్డులున్నట్టు సమాచారం అందిందన్నారు. అయితే ఆమెను తనిఖీ చేసినప్పుడు అవి దొరకలేదన్నారు. సెల్‌ఫోన్లు పనిచేయకుండా జైలులో అమర్చిన జామర్లు పనిచేయడం లేదని జైలు అధికారులు చెప్పారని రూప వివరించారు. ఎన్నికల కమిషన్‌కు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించిన కేసులో దినకర్‌తో పట్టుబడిన బెంగుళూర్ ప్రకాష్ అనేకసార్లు శశికళను పలుసార్లు జైల్లో కలుసుకొన్న విషయమై ఢిల్లీ పోలీసులు విచారిస్తున్నారు.

  పనిచేస్తున్న సిసి కెమెరాలు

  పనిచేస్తున్న సిసి కెమెరాలు

  పరప్పర అగ్రహర జైలులో చోటుచేసుకొన్న పరిణామాలపై డిఐజీ రూప నివేదిక అనంతరం ఈ జైలులో తిరిగి సిసికెమెరాలు పనిచేస్తున్నాయి. తనకు కేటాయించిన గదిలోనే శశికళ గడుపుతున్నారు. ఆమె సెల్ చుట్టూ అమర్చిన సిసి కెమెరాలు పనిచేస్తున్నాయి. బెంగుళూరులోని జైళ్ళశాఖ ఉన్నతాధికారుల కార్యాలయాల్లో ఈ జైలులో ఏం జరుగుతోందో ప్రత్యక్షంగా కన్పిస్తోంది.వారం రోజుల నుండి శశికళ జైలు ఆహరాన్ని తీసుకొంటున్నారు.

  నా వీడియో దీలీట్ చేశారు

  నా వీడియో దీలీట్ చేశారు

  జూలై 10వ, తేదిన జైలు ను సందర్శించిన సమయంలో శశికళ బ్యారక్‌ను పరిశీలించినట్టు చెప్పారు.అయితే ఆమె ఉపయోగించిన కిచెన్‌లో వస్తువులను తాను తన సెల్‌ఫోన్‌లో రికార్డు చేసినట్టు చెప్పారు.అయితే తన ఫోన్ సక్రమంగా పనిచేయకపోవడంతో జైళ్ళశాఖ నుండి తెప్పించిన హ్యాండీక్యామ్‌తో రికార్డు చేసినట్టు చెప్పారు. అయితే ఈ కెమెరాలో రికార్డు చేసిన వీడియోను పెన్‌డ్రైవ్‌లో లోడ్ చేసి ఇవ్వాలని కోరాను. అయితే కెమెరాలో ఎలాంటి వీడియోలు లేవని అధికారులు తనకు ఇచ్చారన్నారు.

  English summary
  D.Roopa, Deputy Director General (Prisons) kicked off a storm by exposing the preferential treatment meted out to the jailed AIADMK leader V. Sasikala and the multi-crore stamp paper scam convict Abdul Kareem Telgi in Parappana Agrahara Central Jail, the firebrand cop has alleged that "some officials" within her department are working against her to destroy the evidence she collected.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more