వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

MyAbhyas- స్మార్ట్ లెర్నింగ్‌కు కొత్త మార్గం

Google Oneindia TeluguNews

కరోనావైరస్ మొత్తం ప్రపంచాన్ని ఇళ్లకే పరిమితం చేసింది. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు జాగ్రత్త చర్యల్లో భాగంగా స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు మూసివేశారు.ఇక పిల్లలంతా ఇళ్లకే పరిమితం కానుండటంతో వారి చదువులను కొనసాగించేందుకు వారికి కావాల్సిన విద్యను MyAbhyas (మైఅభ్యాస్) అనే ఆన్‌లైన్ ట్రైనింగ్ సొల్యూషన్స్ అందిస్తోంది. ఈ ఆన్ ‌లైన్ ఎడ్యుకేషన్ సిస్టంతో పిల్లల్లు చదువుకునే ప్రక్రియకు బ్రేక్ పడదు.

2020లో మై అభ్యాస్ అనే ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఒకటవ తరగతి నుంచి 12వ తరగతి వరకు లెర్నింగ్ కార్యక్రమాన్ని ఈ యాప్ అందిస్తుంది. సీబీఎస్‌ఈ, మరియు కేఎస్‌ఈఈబీ విద్యార్థులకు ఒక వరంలా మారింది. హోంవర్క్ చేసే విషయంలో కానీ, సందేహాలు క్లియర్ చేసుకునే సెషన్, టెక్ట్స్‌ బుక్ సొల్యూషన్స్, వీడియో పాఠాలు, శాంపిల్ పేపర్లు, మాక్ టెస్టులు, ఆరవ తరగతి నుంచి 12వ తరగతి వరకు రివిజన్ నోట్స్, గత సంవత్సరాల బోర్డు పేపర్స్‌ ఈ యాప్‌ ద్వారా లభిస్తాయి. ఈ ఆన్‌లైన్ విద్య ద్వారా ఇటు ట్యూటర్‌కు అటు విద్యార్థుల మధ్య మంచి ఇంటరాక్షన్ కలిగి ఉంటుంది. రియల్ టైంలో ఒకరినొకరు చూసుకోవడం, టీచర్ చెప్పే పాఠాలు వినడం, రాసుకోవడం నిజంగా క్లాస్ రూం అనుభూతిని కలిగిస్తుంది. అంతేకాదు ఈ యాప్‌లో క్విజ్, క్విక్ టెస్టులు, మరియు సందేహాలు నివృత్తి చేసుకునే ఫీచర్స్ కూడా ఉన్నాయి.

ఈ యాప్ విద్యార్థులు సొంతంగా పాఠాలు నేర్చుకునేందుకు, ఇతరులతో కలిసి మాట్లాడటం, పోటీ ప్రపంచంలో సొంత ప్రణాళికలతో ముందుకెళ్లేలా వ్యూహరచన చేసేందుకు దోహదపడుతుంది. అంతేకాదు మై అభ్యాస్ యాప్ బెస్ట్ టీచర్లను అందించడం, టెక్నాలజీ, కంటెంట్, ప్రపంచపు అత్యుత్తమ విద్యను అందిస్తుంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అమలు కానున్న నేపథ్యంలో 21శతాబ్దపు పోటీ ప్రపంచంలో విద్యార్థులకు మెరుగుదిద్దేందుకు మై అభ్యాస్ యాప్ సిద్ధంగా ఉంది.

మిషన్
కొత్త టెక్నాలజీని కనుగొనడం, పంచడం, అమలు చేయడం. క్రియాశీల, సహకార మరియు ప్రామాణికమైన అభ్యాసాన్ని ప్రోత్సహించే మెరుగైన అభ్యాస పద్ధతులు.

21వ శతాబ్దంలోని పోటీ ప్రపంచంలో పిల్లలను మెరుగ్గా తీర్చిదిద్దడం, అత్యుత్తమమైన విద్యను అందించడం, చదువుకునే వాతావరణం కల్పించడం

విద్యాపరంగా సాంకేతికతను టీచర్లకు అందివ్వడం, ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్ మరియు క్లాస్‌రూమ్ ఫెసిలిటేషన్

విజన్

గ్రామీణ ప్రాంతాలకు విద్యను అందించడం

ప్రతి విద్యార్థికి చక్కటి విద్యా బోధన అందించడం

ప్రతి ఒక్కరికీ అందుబాటు ధర కల్పించడం

స్ట్రక్చర్డ్ కోర్సులు

మై అభ్యాస్ యాప్ ద్వారా ప్రణాళికబద్దమైన కంటెంట్‌ను అందించడం ద్వారా యూజర్ ఇంటరాక్షన్ సులభతరంగా ఉంటుంది. కాన్సెప్ట్‌లను మరింత సులభంగా ఉండేందుకు లేదా అర్థమయ్యేందుకు విభజించి చెప్పడం జరుగుతుంది.

లైవ్ టెస్టులు మరియు క్విజ్‌లు

లైవ్‌లో క్విజ్‌లు మరియు టెస్టులు నిర్వహించడం ద్వారా విద్యార్థి నైపుణ్యతకు మరింత పదను పెట్టొచ్చు. ఈ ఆరోగ్యవంతమైన పోటీలో విద్యార్థులు పాల్గొనడం ద్వారా జీవితంలో పోటీతత్వాన్ని అలవర్చుకుంటారు

నెట్‌వర్క్ విత్ గ్రూప్

ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా విద్యార్థులకు ఎన్నో రకాల నెట్‌వర్కింగ్ అవకాశాలను పుష్కలంగా అందించడంతో తల్లిదండ్రుల్లో తమ పిల్లల గురించి ఉన్న భయాన్ని పోగొడుతుంది.

డైరెక్టర్ల గురించి:

సునీల్ కుమార్. వి: రెండు దశాబ్దాలుగా లెర్నింగ్ మరియు డెవలప్‌మెంట్‌లో అనుభవం. లేటెస్ట్ కంటెంట్ డెవెలప్‌మెంట్ టెక్నాలజీస్‌లో విశేష అనుభవం కలిగి ఉన్నారు.మైక్రోసాఫ్ట్ మరియు కెనాడియన్ ఏవియేషన్‌లో పనిచేసిన అనుభవం కూడా ఉంది. లెర్నింగ్ మరియు డెవలప్‌మెంట్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో ఒక ఎంట్రప్య్రూనర్‌గా గుర్తింపు పొందారు.

ఇకపై ఆన్‌లైన్ విద్య జీవితంలో ఒక భాగంగా తయారైపోతుందని బలంగా నమ్ముతారు సునీల్. అంతేకా కాదు టెక్నాలజీ జీవితంలో కీలక పాత్ర పోషిస్తుందని చెబుతారు. కనీస విద్యతో తమకంటూ ఒక ఉద్యోగం ఉండాలని చెబుతూ తీసుకొచ్చిన కొత్త విద్యావిధానం నిజంగా శుభవార్తే అవుతుంది. ఆన్‌లైన్ ద్వారా నేర్చుకునే పాఠాలతో విజ్ఞానం పెరుగుతుందని సునీల్ గట్టిగా నమ్ముతారు.

శారదా ఎం కృష్ణమూర్తి: రెండున్నర దశాబ్దాల పాటు మీడియా రంగంలో అనుభవం ఉంది. జర్మన్ ట్రైనర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. మెర్సిడీస్, బోష్ దూరదర్శన్‌లాంటి గొప్ప సంస్థల్లో పనిచేసిన అనుభవం శారదా కృష్ణ మూర్తికి ఉంది. రికార్డు అయిన లైవ్ లెక్చర్లు వినడం ద్వారా లెర్నర్స్‌కు టెక్నాలజీ దోహదం చేస్తుందని నమ్ముతారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా పాఠాలు నేర్చుకోవడంలో ఆన్‌లైన్ విద్య కీలక పాత్ర పోషిస్తుంది. ఎక్కడైతే ఆఫ్‌లైన్ విద్యలో నాణ్యత లోపిస్తుందో అలాంటప్పుడు ఆన్‌లైన్ విద్య ఈ గ్యాప్‌ను భర్తీ చేస్తుందని శారదా కృష్ణమూర్తి చెబుతున్నారు. ఆన్‌లైన్ విద్యా ద్వారా మారుమూల గ్రామీణ ప్రాంతాలకు కూడా విద్యను అందించొచ్చని చెబుతున్నారు.

మరింత సమాచారం కోసం

www.myabhyas.com
[email protected]

1800 572 4455

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X