వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మయన్మార్ కాదు: పాక్ హెచ్చరిక, పారికర్ కౌంటర్

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: మయన్మార్‌లాంటి దేశంగా పాకిస్తాన్‌ను ఎంత మాత్రం భావించడానికి వీల్లేదని పాక్ దేశీయ వ్యవహారాల మంత్రి నిస్సార్ అలీ ఖాన్ భారత్‌కు స్పష్టం చేశారు. భారత్ ఎలాంటి బెదిరింపులకు పాల్పడినా తాము లొంగే ప్రసక్తే లేదని అన్నారు.

భారత్‌లో ఉగ్రవాద చర్యలకు పాల్పడే దేశాలకు మయన్మార్‌లో భారత కమెండోలు జరిపిన చర్య హెచ్చరికేనంటూ భారత కేంద్ర మంత్రి రఘువంశ్ ప్రసాద్ స్పష్టం చేసిన నేపథ్యంలో పాక్ తీవ్రంగా స్పందించింది.

ఆయన మాటల్ని తమను హెచ్చరించినట్టుగా పరిగణించిన పాకిస్తాన్ ‘ఎవరు ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా తిప్పికొట్టే శక్తియుక్తులు మాకు ఉన్నాయి. మా బలాన్ని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు'అని నిస్సార్ అలీ ఖాన్ తేల్చి చెప్పారు.

 Manohar Parrikar

భయపడే స్పందించారు: పాక్‌పై రక్షణశాఖ మంత్రి పారికర్

భారత సైన్యం మయన్మార్ ఆపరేషన్ పట్ల ప్రపంచ దేశాలు ఆశ్చర్యానికి గురైందని, ఈ ఘటన తర్వాత దేశ భద్రతపై వారి అభిప్రాయాలు మారిపోయాయని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ అన్నారు. భారత ఆపరేషన్ పట్ల భయపడిన వారే ఇప్పుడు మాట్లాడుతున్నారని పాకిస్థాన్‌కు కౌంటర్ ఇచ్చారు. ‘భారత కొత్త చర్య పట్ల ఎవరైతే భయపడుతున్నారో.. వారే ఇప్పుడు స్పందిస్తున్నారు' అని అన్నారు.

‘18మంది భారత సైనికులను చంపిన మిలిటెంట్లపై భారత సైన్యం మయన్మార్‌కు వెళ్లి దాడి చేసింది. ఈ దాడిలో 38మందికిపైగా మిలిటెంట్లను మట్టుపెట్టింది. ఇది పొరుగు దేశాలకు ఒక సందేశం' అని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ అన్నారు. రాజ్యవర్ధన్ సింగ్ వ్యాఖ్యలు పాకిస్థాన్‌కు ఓ హెచ్చరికలా వెళ్లాయి. దీంతో పాకిస్థాన్ స్పందించింది.

English summary
Days after India's offensive against militants along its eastern border stunned the world, Defence Minister Manohar Parrikar on Thursday said that the action against insurgency has led to a change in the mindset of the full security scenario in the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X