వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మైసూరు దసరా ఉత్సవాలు ప్రారంభం: దేశ, విదేశాల నుంచి లక్షల మంది హాజరు !

ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మైసూరు దసరా ఉత్సవాలను నిత్యోత్సవ కవి డాక్టర్ నిసార్ అహమ్మద్ గురువారం ప్రారంభించారు.

|
Google Oneindia TeluguNews

మైసూరు: ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మైసూరు దసరా ఉత్సవాలను నిత్యోత్సవ కవి డాక్టర్ నిసార్ అహమ్మద్ గురువారం ప్రారంభించారు. కర్ణాటక సంప్రధాయం ప్రకారం గురువారం నుంచి మైసూరు నగరంలోని మైసూరు ప్యాలెస్ తో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

మైసూరు దసరా (ఫొటోలు)

మైసూరు నగరం సమీపంలోని చాముండేశ్వరీ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దసరా ఉత్సవాలు ప్రారంభించారు. దసరా ఉత్సవాల ప్రారంభోత్సవంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో పాటు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.

Mysore Special pooja for goddess Chamundi in Mysuru Dasara

దేశ, విదేశాల నుంచి మైసూరు దసరా ఉత్సవాలను తిలకించడానికి కొన్ని లక్షల మంది మైసూరు నగరం చేరుకుంటున్నారు. డప్పు వాయిద్యాలు, జానపద నృత్యాలు, వివిధ సాంసృతిక కార్యాక్రమాలతో దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభించారు.

చాముండేశ్వరి కొండ మీద అమ్మవారికి డాక్టర్ నిసార్ అహమ్మద్ ప్రత్యేక పూజలు చేసి దసరా ఉత్సవాలు ప్రారంభించారు. ఈనెల 30వ తేదీ వరకు మైసూరు నగరంలోని 20 ప్రాంతాల్లో 30 సాంసృతిక కార్యాక్రమాలతో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముందు జాగ్రత్త చర్యగా మైసూరు నగరంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

English summary
On occasion of Dasara, special worship for Goddess Chamundi in Chamundi hills is taking place from 4am on Sep 21st. The City of Palaces has been decked up to host its world famous 10-day Mysuru Dasara fest starting Thursday with pomp and pageantry and an increase in the number of tourists is expected this year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X