వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ వెంట బ్లాక్ బాక్స్! అనుమానాలెన్నో? ఈసీకి ఫిర్యాదు!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రయాణించిన హెలికాప్టర్ లో ఓ పేద్ద నల్లరంగు ట్రంకు పెట్టె వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. అందులో ఏముందనే విషయంపై చర్చ నడుస్తోంది. కర్ణాటకలోని చిత్రదుర్గలో మోడీ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సందర్భంగా ఈ బ్లాక్ బాక్స్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. నరేంద్రమోడీ హెలికాప్టర్ దిగిన వెంటనే.. కొందరు భద్రతా సిబ్బంది అందులో నుంచి బ్లాక్ బాక్స్ ను తీసుకుని పరుగెత్తుకుంటూ వెళ్లి, ఓ కారులో పెట్టడానికి సంబంధించిన దృశ్యాలతో కూడిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఘటనపై కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశారు. ఆ బ్లాక్ బాక్స్ అంతు తేల్చాలని విజ్ఞప్తి చేశారు.

<strong>మూడు లక్షల మంది తెలుగు ఓటర్లు: అక్కడ గెలవాలంటే.. మనోళ్లు దయ తల్చాల్సిందే!</strong>మూడు లక్షల మంది తెలుగు ఓటర్లు: అక్కడ గెలవాలంటే.. మనోళ్లు దయ తల్చాల్సిందే!

కొద్దిరోజుల కిందట ఎన్నికల ప్రచారంలో భాగంగా నరేంద్రమోడీ కర్ణాటకలోని చిత్రదుర్గకు వెళ్లారు. చిత్రదుర్గలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ లో దిగారు. ఆయనకు రక్షణగా మరో మూడు హెలికాప్టర్లు చిత్రదుర్గలో దిగాయి. వాటిల్లో ఓ హెలికాప్టర్ లో ఈ బ్లాక్ బాక్స్ కనిపించింది. హెలికాప్టర్ కిందికి దిగిన వెంటనే- అక్కడి భద్రతా సిబ్బంది చెరో వైపు పట్టుకుని పరుగెత్తుకుంటూ ఈ పెట్టెను తీసుకెళ్లడం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. ఈ వీడియోను కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావు సేకరించారు. దాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అనంతరం కర్ణాటక ఎన్నికల ప్రధానాధికారి, కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం దృష్టికి తీసుకెళ్లారు.

 Mystery Box Carried Out of PM Modi’s Chopper, Karnataka Cong Files Complaint

ఆ పెట్టేలో ఏముందనే విషయాన్ని తేల్చాలని, ఎవరు? ఎందుకు? ఎక్కడికి తీసుకెళ్లారనే విషయాన్ని తేల్చాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఆనంద్‌ శర్మ డిమాండ్‌ చేశారు. ఈ వీడియోపై మోడీ స్పందించాలని, వెంటనే వివరణ ఇవ్వాలని ఆయన పట్టుబట్టారు. బ్లాక్ బాక్స్ ను తీసుకెళ్లిన కారు మోడీ కాన్వాయ్ లోనిది కాదని ఆయన ఆరోపించారు. మోడీ భద్రతా సిబ్బందిలోని ఇద్దరు వ్యక్తులు ఆ ట్రంకు పెట్టెను హెలికాప్టర్‌ నుంచి కిందకు దించి ఓ ప్రైవేటు కారులో పెట్టిన దృశ్యం ఆ వీడియోలో రికార్డయ్యింది.

English summary
A mysterious black box that was allegedly carried out of Prime Minister Narendra Modi’s helicopter, after he landed in north Karnataka’s Chitradurga on Friday, 12 April, has snowballed into a controversy following a Congress complaint. In a video released by the Congress, two men can be seen carrying the box out of the chopper. Congress leaders, including KPCC President Dinesh Gundu Rao, tweeted a video showing the black box being carried away by a few unidentified people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X