వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంతరిక్షంలో అదృశ్యమైన బుల్లి ఉపగ్రహాలు.. అంగారకుడిని దాటి ఎటు వెళ్లి ఉంటాయి..?

|
Google Oneindia TeluguNews

అంతరిక్షంలో ప్రపంచంలోనే అత్యంత చిన్న ఉపగ్రహం అదృశ్యమైంది. మార్స్ ఉపగ్రహాన్ని స్టడీ చేసేందుకు నాసా రూపొందించిన ఈ బుల్లి ఉపగ్రహం కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది. మే 5 , 2018లో అంగారక గ్రహం గురించి పలు విషయాలు బయట ప్రపంచానికి తెలిపేందుకు గాను నాసా ఈ చిన్న ఉపగ్రహాన్ని నింగిలోకి పంపింది. ఈ ఉపగ్రహంలో రెండు బుల్లి రోబోలను అమర్చారు. వీటికి ఈవ్, వాల్ ఈ అనే పేర్లు కూడా పెట్టారు. రెండు రోబోలను కలిపి మార్కో అని పిలుస్తారు.

అంగారకుడి విశేషాలను వెలికితీసిన మార్కో

అంగారకుడిపై పరిశోధనల్లో భాగంగా మార్కో నింగిలోకి దూసుకెళ్లిందని నాసా పేర్కొంది. అయితే అది నిశీధిలో ఎక్కడుందో ట్రేస్ చేయలేక పోతున్నట్లు అధికారులు వెల్లడించారు. మార్కో కనిపించకపోయినప్పటికీ అది చేసిన సేవలను కొనియాడింది నాసా. ఇదో విజయవంతమైన ఉపగ్రహంగా నాసా అభివర్ణించింది. మార్కో పూర్తి పేరు మార్స్ క్యూబ్ వన్ అని ఇదో మినీ స్పేస్ క్రాఫ్ట్‌గా అభివర్ణించింది. ఇది నింగిలోకి వెళ్లిన సమయం నుంచే సేవలు అందించిందని నాసా వెల్లడించింది. అంగారకుడికి చెందిన పలు అద్భుతమైన చిత్రాలను వాల్ పంపిందని అధికారులు వెల్లడించారు. మరోవైపు ఈవ్ రేడియో సైన్స్ ‌కు సంబంధించిన పనులను పూర్తి చేసిందని నాసా వెల్లడించారు.

నెల రోజులుగా సమాచారం పంపని ఉపగ్రహాలు

నెల రోజులుగా సమాచారం పంపని ఉపగ్రహాలు


ఇక మార్కో నుంచి సంకేతాలు అంది దాదాపు నెలరోజులైందని నాసా తెలిపారు. డిసెంబర్ 29న వాల్‌ఈ నుంచి చివరిసారిగా సంకేతాలు అందగా... జనవరి 4వ తేదీన ఈవ్ నుంచి ఆఖరిసారిగా సంకేతాలు అందాయని నాసా పేర్కొంది. ఇక ప్రస్తుత గణాంకాలు ప్రకారం వాల్ ఈ ఒక మిలియన్ మైళ్ల దూరంలో ఉండగా అది అంగారక గ్రహాన్ని దాటి వెళ్లిపోయిందన్నారు. ఇక ఈవ్ ఉపగ్రహం అంగారకుడి నుంచి 2 మిలియన్ మైళ్ల దూరంలో ఉన్నట్లు సమాచారం.

 ఉపగ్రహాలకు వచ్చిన సమస్యలు

ఉపగ్రహాలకు వచ్చిన సమస్యలు

ఇదిలా ఉంటే వాల్‌ఈలో లీకేజీ తలెత్తిందని నాసా అధికారులు చెప్పారు. దీంతో కమాండ్లను అందుకోవడం పంపడంలో విఫలమైనట్లు అధికారులు చెప్పారు. బ్యాటరీ రీఛార్జ్ కూడా విఫలమై ఉండొచ్చనే అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. సూర్యుడి కక్ష్య చుట్టూ ఈ ఉపగ్రహాలు తిరుగుతున్నందున... ఫిబ్రవరి వచ్చేసరికి అవి చాలా దూరంగా వెళ్లిపోయాయని దీంతో యాంటెన్నా వ్యవస్థ పనిచేయకుండా పోయినట్లు తెలిపారు. మళ్లీ వేసవి వచ్చేవరకు అవి సూర్యుడి దగ్గరకు వచ్చేలా కనిపించడం లేదని చెప్పారు. మళ్లీ వాటి ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నిస్తామని నాసా అధికారులు వెల్లడించారు. ఇది కాకపోతే కొత్త ఉపగ్రహాలను త్వరలోనే నింగిలోకి పంపే కార్యక్రమం చేస్తామని చెప్పారు.

English summary
The world's first mini-satellites to venture into deep space - designed to monitor NASA's InSight Mars lander - have fallen silent and it's likely we may never hear from them again.On May 5, 2018, NASA launched a stationary lander called InSight to Mars. Riding along with InSight were two CubeSats the first of this kind of spacecraft to fly to deep space.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X