వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమ్మ అడిగిందని స్కూటర్‌పై.. కారు ఇస్తానంటూ ఆనంద్ మహీంద్రా ఆఫర్..!

|
Google Oneindia TeluguNews

బెంగళూర్‌ : అమ్మపై ప్రేమ అపురూపమని నిరూపించాడు ఓ కొడుకు. అమ్మ కోసం ఉద్యోగం వదులుకున్నాడు. వృద్దాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పట్టించుకోని కలికాలంలో అమ్మకు అన్నీ తానై శభాష్ అనిపించుకున్నాడు. పేగుబంధానికి సరికొత్త నిర్వచనం చెప్పాడు. కని పెంచిన తల్లిదండ్రులను ఛీ కొడుతున్న వారెందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆ క్రమంలో ఆయన ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాడు. హంపి చూడాలని ఉందిరా అని అడిగిందే తడవుగా ఆయన స్పందించిన తీరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. ఏనాడూ ఏమి అడగని తల్లి తనను అలా అడగగానే తీర్థయాత్రలకు తీసుకెళ్లాడు. ఇందులో అసలు కథ తెలియాలంటే ఈ కథనం మొత్తం చదవాల్సిందే.

అమ్మ అడిగిందని.. కొడుకు ఇలా

అమ్మ అడిగిందని.. కొడుకు ఇలా

కర్ణాటకలోని మైసూరుకు చెందిన కృష్ణ కుమార్ తన స్కూటర్‌పై తల్లిని ఎక్కించుకుని దేశవ్యాప్తంగా ఆలయాల పర్యటనకు శ్రీకారం చుట్టాడు. 70 ఏళ్ల తల్లిని వెనుక కూర్చోబెట్టుకుని హ్యాపీగా జర్నీ చేస్తున్నాడు. వంద, రెండు వందల కిలోమీటర్ల ప్రయాణానికే అలసిపోయే ఈ రోజుల్లో ఏకంగా ఇప్పటివరకు 48 వేల 100 కిలోమీటర్ల తీర్థయాత్ర పూర్తి చేశాడు. ఏనాడు ఏమి అడగని తన తల్లి హంపి చూడాలని ఉందని అడగడంతో.. హంపియే కాదమ్మా, పెద్ద పెద్ద ఆలయాలు చూపిస్తానంటూ ఆయన చేపట్టిన ఈ యాత్ర ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

70 ఏళ్ల వయసున్న తల్లిని స్కూటర్‌పై ఎక్కించుకుని..!

తల్లిదండ్రులను భారంగా భావించే ఈ రోజుల్లో కన్నతల్లి కోరిక మేరకు కృష్ణ కుమార్ స్పందించిన తీరు నెట్టింట ప్రశంసలు అందుకుంటోంది. 70 ఏళ్ల తన తల్లిని భారం అనుకోకుండా ఆమె హంపి చూడాలని కోరిన వెంటనే ఓకే అమ్మా అంటూ ఆయన స్పందించిన తీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అమ్మకు దేశంలోని ప్రధాన ఆలయాలు, పర్యాటక ప్రాంతాలు చూపించాలని డిసైడ్ కావడంతోనే మొదట తాను చేస్తున్న బ్యాంక్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అమ్మతో పాటు తాను అపురూపంగా చూసుకుంటున్న బజాజ్ చేతక్ స్కూటర్‌కు మరమ్మతులు చేయించి తీర్థయాత్రకు సిద్ధం చేశాడు.

ఆనంద్ మహీంద్రా ద‌ృష్టికి చేరిన వీడియో

ఆనంద్ మహీంద్రా ద‌ృష్టికి చేరిన వీడియో

క‌ృష్ణ కుమార్ తల్లి ప్రేమను చాటే అద్భుత సన్నివేశాలు ఆవిష్కరించే వీడియో ఒకటి బయటకు వచ్చింది. నాంది ఫౌండేషన్ సీఈవో మనోజ్ కుమార్ ఆ వీడియోను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. అమ్మను అపురూపంగా చూసుకుంటున్నాడని కృష్ణ కుమార్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఆ వీడియో కాస్తా మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా దృష్టికి చేరడంతో ఆయన స్పందించారు. ఆనంద్ మహీంద్రా ఇలాంటి వీడియోలను, ఫోటోలను ట్విట్టర్ ఖాతాలో వాట్సాప్ వండర్ బాక్స్ ట్యాగ్‌తో షేర్ చేస్తుంటారు. తల్లిపై ఇంతలా అమితమైన ప్రేమను కురిపిస్తున్న కృష్ణ కుమార్ చాలా గ్రేట్ అంటూ కితాబిచ్చారు.

సూపర్ కొడుకు అంటూ.. కారు గిఫ్ట్ ఇస్తానంటూ ప్రకటన

సూపర్ కొడుకు అంటూ.. కారు గిఫ్ట్ ఇస్తానంటూ ప్రకటన

దేశవ్యాప్తంగా వైరల్ అయిన కృష్ణ కుమార్ అమ్మ ప్రేమ ఆనంద్ మహీంద్రా దృష్టికి చేరడంతో ఆయనకు కారు బహుకరిస్తానంటూ ట్వీట్ చేశారు. ఆ వీడియో పోస్ట్ చేసిన నాంది ఫౌండేషన్ సీఈవో మనోజ్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కృష్ణ కుమార్‌ను తనకు కలిపిస్తే ఆయనకు Mahindra KUV 100 NXT కారు బహుమతిగా ఇస్తానని ప్రకటించారు. అమ్మతో కలిసి ఆ కొడుకు చేస్తున్న ఈ ప్రయాణంలో తాను ఇచ్చే కానుక ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

అమ్మ త్యాగాల ముందు.. ఇదెంత : కృష్ణ కుమార్

అమ్మ త్యాగాల ముందు.. ఇదెంత : కృష్ణ కుమార్

మైసూరులో ఒంటరిగా కాలం వెళ్లదీస్తున్న తన తల్లి అడిగిన చిన్న కోరికతో కొడుకుగా తన హృదయం చలించిందని అంటారు కృష్ణ కుమార్. ఆమెకు తాను ఒక్కడినే కుమారుడినని.. ఆమెను అపురూపంగా చూసుకోవాల్సిన బాధ్యత తనదే అన్నట్లుగా చెప్పుకొచ్చారు. హంపి చూడాలని ఉందిరా అని తల్లి అడిగేసరికి ఆమె చేసిన త్యాగాలకు తాను ఎంతో కొంత చేయాల్సిన అవసరముందని ఫీలయినట్లు తెలిపారు. అందుకే ఉద్యోగం, డబ్బు, సమయం.. అలా దేని గురించి ఆలోచించలేదని.. ఆమెను సంతోషపరచడమే ఉద్దేశంగా తీర్థ యాత్రలకు సిద్ధమైనట్లు చెప్పారు.

 7 నెలల నుంచి తీర్థయాత్ర.. ఇప్పటికే పలు ఆలయాల దర్శనం

7 నెలల నుంచి తీర్థయాత్ర.. ఇప్పటికే పలు ఆలయాల దర్శనం


ఇన్నాళ్లు వంటింటికే పరిమితమైన తన తల్లిని ఇలా తీర్థయాత్రకు తీసుకెళ్లడం తనకు ఎంతో ఆనందంగా ఉందంటున్నారు కృష్ణ కుమార్. ఏడు నెలల నుంచి వివిధ రాష్ట్రాల్లో పర్యటించినట్లు చెప్పారు. ఇప్పటికే పలు ఆలయాలను సందర్శించడంతో పాటు ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలను చూసినట్లు తెలిపారు. అయితే ఖర్చు విషయంలో మాత్రం పొదుపు మంత్రం పాటిస్తున్నట్లు వెల్లడించారు. హోటల్ గదుల అద్దెలతో పాటు భోజన ఖర్చులు మిగిలించుకోవడానికి మఠాలు, సత్రాల్లో బస చేస్తున్నామని.. ఇక ఆహారం కూడా అక్కడే తినేవారమని వివరించారు. కొన్ని సందర్భాల్లో చిరుతిళ్లు స్కూటర్ సైడ్ డిక్కీలో ఉంచుకుంటామని చెప్పుకొచ్చారు.

English summary
Anand Mahindra has shared a beautiful story on Twitter and it will make you smile for sure. Dakshinmurthy Krishna Kumar from Mysuru quit his job in a bank and travelled with his mother on his scooter for 48, 100kms as she had not stepped out of her town. So, Dakshinmurthy intended to take her on a tour of India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X