వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిప్పుసుల్తాన్ వలనే మా రాజులకు ఇబ్బంది, ఊచకోత, వ్యతిరేం, మైసూరు రాజమాత, రాజకీయాలు!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: టిప్పుసుల్తాన్ కారణంగా మా మైసూరు మహారాజ్యానికి హాని కలిగిందని, మా కుటుంబ సభ్యులు అనేక ఇబ్బందులకు గురైనారని, మేలుకోటేలో ఊచకోత జరిగిందని, అందు వలనే తాము టిప్పు జయంతిని వ్యతిరేకిస్తామని మైసూరు రాజవంశస్తురాలు మాతా ప్రమోదా దేవి ఒడయార్ అన్నారు. ఓ కార్యక్రయంలో మాట్లాడిన మాతా ప్రమోదా దేవి ఒడయార్ టిప్పుసుల్తాన్ కారణంగా మా కుటుంబ సభ్యులు సమస్యలు ఎదుర్కొన్నారని చెప్పారు.

టిప్పుసుల్తాన్ ఊచకోత

టిప్పుసుల్తాన్ ఊచకోత

దీపాళి పండుగ రోజు మేలుకోటేలోని అయ్యంగార్ వంశస్తుల మీద టిప్పు సుల్తాన్ దాడి చేసి ఊచకోత కోసి నరమేధం సృష్టించాడని మాతా ప్రమోద దేవి ఒడయార్ అన్నారు. ముమ్మడి చిక్కరాజ ఒడయార్ (మైసూరు రాజు) కాలంలో రాజకుటుంబ సభ్యులను నిర్బంధించి వేధింపులకు గురి చేశాడని మాతా ప్రమోదా దేవి ఒడయార్ ఆరోపించారు.

అందుకే వ్యతిరేకం

అందుకే వ్యతిరేకం

మైసూరు రాజ వంశస్తులను టిప్పుసుల్తాన్ అనేక విధాలుగా వేధింపులకు గురి చేశాడని, అందుకే తాము టిప్పు జయంతిని వ్యతిరేకించి దూరంగా ఉంటున్నామని మాతా ప్రమోదా దేవి ఒడయార్ అన్నారు. దేశంలో ప్రజలతో పాటు తాము ఉన్నామని, టిప్పు జయంతిని అధికారికంగా ఎందుకు నిర్వహిస్తున్నారు అని తాము ప్రభుత్వాన్ని ప్రశ్నించమని, అది వారే తెలుసుకోవాలని మాతా ప్రమోదా దేవి ఒడయార్ అన్నారు.

చీకటి రోజులు గుర్తున్నాయి!

చీకటి రోజులు గుర్తున్నాయి!

టిప్పుసుల్తాన్ మా రాజకుటుంబ సభ్యులను ఎలా వేధించాడు అనే విషయం మా పెద్దలు చెప్పారని, ఆ విషయాలు మాకు ఇంకా గుర్తు ఉన్నాయని మాతా ప్రమోదా దేవి ఒడయార్ అన్నారు. మా పెద్దలు పడిన కష్టాలు, వాళ్లు అనుభవించిన నొప్పి గురించి ఇంకా వివరంగా తాను చెప్పలేనని మాతా ప్రమోదా దేవి ఒడయార్ అన్నారు. ఈ విషయంపై తాను ఇంకా ఎక్కువ మాట్లాడలేనని, టిప్పు జయంతికి తమ మద్దతు మాత్రం ఉండదని మాతా ప్రమోదా దేవి ఒడయార్ స్పష్టం చేశారు.

రాజకీయాల్లోకి రాజవంశం!

రాజకీయాల్లోకి రాజవంశం!

రాజకీయ రంగప్రవేశంపై మాట్లాడిన మాతా ప్రమోదా దేవి ఒడయార్ ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయాల్లోకి రావలసి అవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో మా కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి రారని అన్నారు. తన కుమారుడు యదువీర్ ఒడయార్ కూడా ఇప్పటి పరిస్థితుల్లో రాజకీయాల్లో అడుగుపెట్టరని మాతా ప్రమోదా దేవి ఒడయార్ స్పష్టం చేశారు. అయితే రాబోయే రోజుల్లో తన కుమారుడు యదువీర్ ఒడయార్ మనసు మార్చుకుంటే మాత్రం తాను ఏమీ చెప్పలేనని, అది అతని ఇష్టం అని మాతా ప్రమోదా దేవి ఒడయార్ అన్నారు.

శబరిమల ఆచారం

శబరిమల ఆచారం

శబరిమల ఆలయంలో మహిళలు ప్రవేశించే విషయంపై మాట్లాడిన మాతా ప్రమోదా దేవి ఒడయార్ అందరికీ దైవ దర్శనం చేసుకునే హక్కు ఉందని అన్నారు. మహిళలు దైవ దర్శనం చేసుకోవడం నేరం కాదని మాతా ప్రమోదా దేవి ఒడయార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఎంతో కాలంగా వస్తున్న సాంప్రధాయాలను పాటించాలని, దానిని వ్యతిరేకించి ఆలయంలో ప్రవేశించరాని మాత ప్రమోదా దేవి ఒడయార్ అన్నారు.

మా వంశస్తుల ఆచారం

మా వంశస్తుల ఆచారం

మా వంశస్తుల ఆచారం, కట్టుబాట్లను తాము ఇప్పటి వరకూ కాపాడుకుంటూ వస్తున్నామని, ఈ విషయాలపై తాను ఎక్కువ మాట్లాడనని మాతా ప్రమోదా దేవి ఒడయార్ అన్నారు. దేవాలయాలకు వెళ్లడం, వెళ్లకపోవడం వాళ్ల ఆలోచనకు సంబంధించిన విషయం అని మాతా ప్రమోదా దేవి ఒడయార్ అన్నారు.

English summary
Pramoda devi Wadiyar Said that I personally oppose Tippu Jayanti. But i do not speak much about this.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X