వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తండ్రి ఎలా పాలించాడో కొడుకుకు తెలిసే ఉంటది: తేజస్వీ యాదవ్‌పై నడ్డా విసుర్లు..

|
Google Oneindia TeluguNews

బీహర్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న కొద్దీ మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఆర్జేడీ లక్ష్యంగా బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వీ యాదవ్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో కుమారుడికి తెలుసు అనుకుంటా అని తేజస్విని ఉద్దేశించి కామెంట్ చేశారు. ఆర్జేడీ పాలనలో జరిగిన తప్పులను ఎత్తిచూపారు.

బీజేపీ-జేడీయూ కూటమి రాష్ట్ర అభివృద్ది కోసం పనిచేస్తోందని తెలిపారు. తమ హయాంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని తెలిపారు. కానీ గత ప్రభుత్వ హయాం, లాలూ అధికారంలో ఉన్న సమయంలో ఏం జరిగిందో తేజస్వికి తెలుసు అనుకుంటా అని నడ్డా సెటైర్లు వేశారు.

Nadda takes swipe at Tejashwi, ‘son’ should know how his father ruled..

అంతకుముందు రోజు మహిళ సాధికారత కోసం పనిచేస్తామని సీఎం నితీశ్ కుమార్ కామెంట్ చేశారు. గత 15 ఏళ్లలో ఏం జరిగిందో ప్రజలకు తెలుసు అని చెప్పారు. కానీ అంతకుముందు ఏం జరిగిందో ప్రజలకు తెలుసు అని చెప్పారు. పంచాయతీల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఇవ్వడంలో బీహర్ ముందు వరసలో ఉందని చెప్పారు. బాలిక విద్య కోసం పాటుపడుతున్నామని చెప్పారు.

బీహర్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ-బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. ఎల్జేపీ బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం జరిగింది. కానీ పైకి రెండు పార్టీలు మాత్రం విడివిడిగా పోటీ చేస్తున్నామని చెబుతున్నాయి. ఇటు ఆర్జేడీ మాత్రం ఒంటరిగా బరిలోకి దిగింది. పశు దాణా కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.

English summary
RJD supremo Lalu Prasad Yadav and his son Tejashwi, BJP president J P Nadda Thursday said the “son should know how his father ruled” the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X