• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నగోట్రా ఎన్ కౌంటర్ .. ఉగ్రచొరబాటు వెనుక పాక్ హస్తం .. వాటిపై పాక్ ముద్ర

|

నగోట్రాలో నిన్న జరిగిన ఎన్కౌంటర్లో జైషే మొహమ్మద్ కి సంబంధించిన నలుగురు ఉగ్రవాదులు హతం అయిన విషయం తెలిసిందే. అయితే వారి వద్ద నుండి సేకరించిన ఆయుధాల పై, వారు తెచ్చుకున్న మందులు, ఫోన్లు అన్నీ పాకిస్థాన్ కు చెందినవి కావడం, ఈ ఉగ్రవాదుల చొరబాటు వెనుక పాకిస్తాన్ కుట్ర ఉంది, పాకిస్తాన్ సహకారంతోనే వీరు ఇండియాలోకి ప్రవేశిస్తున్నారు అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

జమ్మూ, కాశ్మీర్ లో ఎన్‌కౌంటర్ ..నలుగురు జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాదులు హతంజమ్మూ, కాశ్మీర్ లో ఎన్‌కౌంటర్ ..నలుగురు జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాదులు హతం

పాకిస్తాన్ కంపెనీ మైక్రో ఎలక్ట్రానిక్స్ డిజిటల్ మొబైల్ రేడియో .. ఉగ్రవాదులకు సందేశాలు

పాకిస్తాన్ కంపెనీ మైక్రో ఎలక్ట్రానిక్స్ డిజిటల్ మొబైల్ రేడియో .. ఉగ్రవాదులకు సందేశాలు

నగోట్రా ఎన్ కౌంటర్ లో మరణించిన ఉగ్రవాదుల వద్ద ఉన్న పరికరాలు , మందుగుండు సామాగ్రి, వారు తెచ్చుకున్న మెడిసిన్స్ అన్నీ పాక్ కుట్రను బయటపెడుతున్నాయి. మీరు ఎక్కడికి చేరుకున్నారు? పరిస్థితి ఏమిటి? ఏదైనా సమస్య ఉందా ?, 2 ఓక్లాక్, మీకు తెలియజేస్తాము"పాకిస్తాన్ కంపెనీ మైక్రో ఎలక్ట్రానిక్స్ తయారుచేసిన డిజిటల్ మొబైల్ రేడియోలో గురువారం జమ్మూలోని నాగ్రోటాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు కాల్చి చంపిన నలుగురు జైష్-ఇ-మొహమ్మద్ ఉగ్రవాదులకు వచ్చిన కొన్ని టెక్స్ట్ సందేశాలు ఇవి.

ఉగ్రవాదుల వద్ద పాకిస్తాన్ క్యూ మొబైల్ తయారుచేసిన స్మార్ట్‌ఫోన్‌లు , ఆయుధాలు అక్కడివే

ఉగ్రవాదుల వద్ద పాకిస్తాన్ క్యూ మొబైల్ తయారుచేసిన స్మార్ట్‌ఫోన్‌లు , ఆయుధాలు అక్కడివే

పాకిస్తాన్ సంస్థ క్యూ మొబైల్ తయారుచేసిన స్మార్ట్‌ఫోన్‌లతో ఉగ్రవాదులు పాకిస్తాన్‌లో తమ హ్యాండ్లర్లతో సంప్రదింపులు జరిపారు. వారు కరాచీలో తయారుచేసిన ఆయుధాలను ,ఆర్‌డిఎక్స్‌ ను తీసుకువెళుతున్నారు. పాకిస్తాన్లో తయారు చేసిన బూట్లు ధరించారు.ఉగ్రవాదుల వద్ద స్వాధీనం చేసుకున్న వాటిలో 11 ఎకె అటాల్ట్ రైఫిల్స్, 24 మ్యాగజైన్స్, 7.5 కిలోల ఆర్‌డిఎక్స్‌తో పాటు 20 మీటర్ల ఐఇడి వైర్, ఆరు డిటోనేటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రికవరీలలో ఒక అండర్ బారెల్ గ్రెనేడ్ లాంచర్ (యుబిజిఎల్), 29 గ్రెనేడ్లు, ఐదు రైఫిల్ గ్రెనేడ్లు, ఆరు మ్యాగజైన్‌లతో మూడు పిస్టల్స్, వైర్‌లెస్ సెట్ మరియు జిపిఎస్ ఉన్నాయి.

ఉగ్రవాదుల వద్ద స్వాధీనం చేసుకున్న మెడిసిన్స్ పాకిస్తాన్ ఫార్మా కంపెనీలవే

ఉగ్రవాదుల వద్ద స్వాధీనం చేసుకున్న మెడిసిన్స్ పాకిస్తాన్ ఫార్మా కంపెనీలవే

ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న మందులలో నొప్పు తగ్గటానికి కావాల్సిన మెడిసిన్స్, విరేచనాలకు యాంటీబయాటిక్స్, యునాని మందులు, ఇంజెక్షన్లు మరియు సర్జికల్ క్లాత్ ఉన్నాయి. పాకిస్తాన్ కంపెనీలైన లాహోర్ మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (కసూర్), ఖర్షి ఇండస్ట్రీస్ (ఖైబర్ పఖ్తున్ఖ్వా), సామి ఫార్మాస్యూటికల్స్ (కరాచీ), రెహమాన్ రెయిన్బో ప్రైవేట్ లిమిటెడ్ (లాహోర్) మరియు సనోఫీ-అవెంటిస్ పాకిస్తాన్ లిమిటెడ్ (కరాచీ) వీటిని తయారు చేశాయి.

 జమ్మూ కాశ్మీర్ లో జరుగుతున్న డీడీసి ఎన్నికలను టార్గెట్ చేసుకున్న ఉగ్రవాదులు

జమ్మూ కాశ్మీర్ లో జరుగుతున్న డీడీసి ఎన్నికలను టార్గెట్ చేసుకున్న ఉగ్రవాదులు

జమ్మూ కాశ్మీర్ లో జరుగుతున్న డీడీసి ఎన్నికలను టార్గెట్ చేసుకున్న ఉగ్రవాదులు ఎన్నికలలో భారీ విధ్వంసం సృష్టించటం కోసం ప్రయత్నం చేస్తున్నట్టు తేలింది . ఎన్నికలలో ఇప్పటికే నామినేషన్లు భారీగా వేయటం తో పాటు ప్రజల నుండి మంచి స్పందన కనిపించింది . పాకిస్తాన్ ఉగ్రవాదులు మరియు భారీ మొత్తంలో ఆయుధాలతో విధ్వంసం సృష్టించి ప్రజాస్వామ్య వికేంద్రీకరణ ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నం చేసేందుకు వచ్చారని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు.

  Twitter Removes Amit Shah Display Photo | Oneindia Telugu
   జమ్మూలోని బాన్ టోల్ ప్లాజా వద్ద ఉగ్రవాదుల హతం

  జమ్మూలోని బాన్ టోల్ ప్లాజా వద్ద ఉగ్రవాదుల హతం

  భద్రతా దళాల ఇంటెలిజెన్స్ సూచనల మేరకు చేసిన ఆపరేషన్లలో 2019 ఆగస్టు నుండి 200 మందికి పైగా ఉగ్రవాదులు 30 మంది విదేశీయులతో సహా హతమయ్యారు .జమ్మూ & కాశ్మీర్ పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, ఉగ్రవాదులు జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దును దాటి సాంబాకు దక్షిణాన జాతీయ రహదారిపై ముందుగానే ప్లాన్ ప్రకారం ఉంచిన ఒక ప్రదేశంలో ట్రక్కులోకి చేరారు .ఈ ట్రక్ వారిని కాశ్మీర్‌కు తీసుకెళ్లాల్సి ఉంది, కాని ఇంటెలిజెన్స్ ఏజెన్సీల సమాచారంతో జమ్మూలోని బాన్ టోల్ ప్లాజా వద్ద ఆగిపోయింది. పోలీసులు ట్రక్కును తనిఖీ చేయడానికి ప్రయత్నించినప్పుడు, ఉగ్రవాదులు కాల్పులు జరిపారు, పోలీసులలో ఇద్దరు గాయపడ్డారు. ఆ తరువాత జరిగిన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మృతి చెందారు.

  English summary
  It is learned that four militants belonging to Jaish-e-Mohammed were killed in an encounter in Nagotra yesterday. However, on the weapons seized from them, all the drugs and phones they brought were from Pakistan, suggesting that there was a Pakistani conspiracy behind the terrorist infiltration and that they were entering India with the cooperation of Pakistan.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X