వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో రైలు ప్రమాదం: మహారాష్ట్రలో పట్టాలు తప్పిన దురంతో ఎక్స్‌ప్రెస్

మంగళవారం తెల్లవారుజామున నాగ్‌పూర్-ముంబై దురంతో ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది.

|
Google Oneindia TeluguNews

నాగ్‌పూర్: రైల్వేలో వరుస ప్రమాద ఘటనలకు బ్రేక్ పడటం లేదు. తాజాగా మరో రైలు పట్టాలు తప్పడంతో.. రైల్వే భద్రతపై ఆందోళన పెరుగుతోంది. మంగళవారం తెల్లవారుజామున నాగ్‌పూర్-ముంబై దురంతో ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. మహారాష్ట్రలోని తిత్వాల స్టేషన్ కు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ప్రమాద ఘటనలో మొత్తం 7భోగీలు పట్టాలు తప్పగా.. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే కొద్దిమందికి మాత్రం స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. భారీ వర్షాలకు పట్టాల పైకి బురద, రాళ్లు వచ్చి చేరడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా చెబుతున్నారు.

Nagpur Mumbai Duronto Express derails, train services to Mumbai hit

డ్రైవర్ సమయస్పూర్తితో వ్యవహరించడం వల్ల పెను ప్రమాదం తప్పిందంటున్నారు. నిజానికి ఆ సమయంలో పొగమంచు కూడా భారీగా కమ్ముకోవడంతో తనకేమి కనిపించలేదని డ్రైవర్ తెలిపారు. ఈ ప్రమాదంతో ముంబై లోకల్ ట్రైన్ సర్వీసులు నిలిచిపోనున్నాయి.

కాగా, అగస్టు 19న పూరి-హరిద్వార్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పి భారీ ప్రాణ నష్టం సంభవించిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో 21మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే రైల్వే మంత్రి సురేష్ ప్రభు సైతం రాజీనామాకు సిద్దపడగా.. ప్రధాని మోడీ పునరాలోచించుకోవాల్సిందిగా ఆయనకు సూచించారు. తాజా ప్రమాద ఘటనతో సురేశ్ ప్రభు ఎలా స్పందిస్తారా? అన్నది చూడాలి.

English summary
The Nagpur Mumbai Duronto Express has derailed near Titwala. The incident at Maharashtra took place on the wee hours of Tuesday. The incident took place near the Kasara Ghat section.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X