చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విడుదల చేయండి: 23 ఏళ్లుగా జైల్లో రాజీవ్ కిల్లర్ నళిని

By Pratap
|
Google Oneindia TeluguNews

Nalini files petition to release from jail
చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసుకు సంబంధించి 23 ఏళ్లుగా జైలులో ఉన్న తనను విడుదల చేయాలని కోరుతూ నళిని సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆమె తరఫున కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. రాజీవ్ గాంధీని హత్యచేసినవారిలో నళిని ఒక్కరు

రాజీవ్‌గాంధీ హత్యకేసులో మరణశిక్ష పడిన మురుగన్‌, శాంతన్‌, పేరరివాలన్‌లు క్షమభిక్షకోరుతూ రాష్ట్రపతిని అభ్యర్థించగా దానిపై 10 సంవత్సరాలుగా ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో మళ్లీ వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీం ప్రధాన న్యాయమూర్తి సదాశివం ఈ ముగ్గురి విడుదలపై రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.

దీంతో ఫిబ్రవరి 19వ తేదీన నళిని సహా రాజీవ్‌ హంతకులు ఏడుగురిని విడుదల చేయనున్నట్లు రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. అయితే తమిళ ప్రభుత్వ నిర్ణయంపై అభ్యంతరం తెలుపుతూ కేంద్రప్ర భుత్వం సుప్రీంకోర్టు తలుపుతట్టింది. ఆ

పిటిషన్‌ విచారణ మంగళవారం జరుగనున్న నేపథ్యంలో నళిని తరఫు న్యాయవాది రాధాకృష్ణన్‌ సుప్రీంకోర్టులో తాజాగా పిటిషన్‌ దాఖలు చేశారు. గత 23 ఏళ్లుగా జైలులో వున్న తనను విడుదల చేయాల్సిందిగా నళిని ఆ పిటిషన్‌లో అభ్యర్థించారు.

English summary
Rajiv Gandhi killer Nalini urged to Supreme Court to release, as she was in jail since 23 years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X