వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజీవ్ హంతకురాలు నళిని శ్రీహరన్‌కు మొదటిసారి నెల రోజుల పాటు పెరోల్

|
Google Oneindia TeluguNews

గత ఇరవే ఏడేళ్లుగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవీత కాలం జైలు శిక్ష అనుభవిస్తున్న నళిని నెల రోజుల రోజుల పాటు పెరోల్ లభించింది. తన కూతురు వివాహం కోసం ఆరు నెలల పాటు సాధరణ సెలవు కావాలని నళిని సుప్రిం కోర్టులో పిటిషన్ వేసింది.దీంతో మద్రాస్ హై కోర్టు 30 రోజుల పాటు పెరోల్ జారీ చేసింది.

కాగా 27 సంవత్సరాలుగా రాజీవ్ హత్య కేసులో వెల్లోర్ సెట్రల్ జైలులో నళిని శ్రీహరన్ జైలు శిక్ష అనుభవిస్తోంది. అయితే ఇన్ని సంవత్సరాల్లో నెల రోజుల పాటు పెరల్ లభించడం ఇదే మొదటి సారి. కాగా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నెల రోజుల సాధరణ సెలవులు ఇవ్వాలనే నిబంధన ఉంది. కాని ఆమేకు ఎలాంటీ సెలవులు లభించలేదు.ఇక దీనితో పాటు ఆర్టిక‌ల్ 161 ప్ర‌కారం 20 ఏళ్లు శిక్ష పూర్తి చేసుకున్న వారిని విడుద‌ల చేయ‌వ‌చ్చు అంటూ 1994లో ప్ర‌భుత్వం ఓ స్కీమ్‌ను తీసుకువ‌చ్చింది. దాని ప్ర‌కారం రిలీజ్ చేయాలంటూ న‌ళిని త‌న పిటిష‌న్‌లో వేడుకున్న‌ది.ఈనేపథ్యంలోనే ఆరునెలల పాటు తన కూతురు వివాహం కోసం కూడ పెరోల్ ఇవ్వాలంటూ పేర్కోంది.

Nalini Sriharan will be out on parole for 30 days

కాగా పెరోల్ ఇచ్చిన మద్రాస్ హైకోర్టు పెరోల్ రోజుల్లో మిడీయాతో మాట్లాడడం గాని, రాజకీయనాయకులతో సమావేశాలు గాని చేయకూడదని ఆదేశించింది.కాగా రాజీవ్ గాంధీ హత్య కేసులో మరణదండను విధించిన కోర్టు తిరిగి దాన్ని యావజ్జీవ శిక్షగా ప్రకటించిన విషయం తెలిసిందే.

English summary
India's longest serving woman prisoner and Rajiv Gandhi assassination life convict Nalini Sriharan will be out on parole for 30 days, as the Madras high court on Friday allowed her plea seeking ordinary leave
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X