• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనాతో ప్రపంచవ్యాప్తమైన "నమస్తే" ‌- తాజాగా నమస్తే చెప్పుకున్న ఫ్రాన్స్‌, జర్మనీ అధినేతలు..

|

కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రజల జీవన విధానం కూడా మారుతోంది. ప్రభుత్వాల ఆలోచనా విధానం కూడా మారుతోంది. చివరికి పలకరింపులు కూడా మారిపోతున్నాయి. గతంలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో రాజకీయ నేతల నుంచి బ్యూరోక్రాట్ల వరకూ వివిధ రూపాల్లో పలకరించుకునే వారు. కానీ ఇప్పుడంతా ఒకటే ట్రెండ్‌. అదే నమస్తే. ఎక్కడో భారత్‌లో నేతలు, జనం పలకరింపులకు అనుసరించే నమస్తే పదాన్ని చెప్పకుండానే అదే విధానంలో ఇప్పుడు ప్రపంచ దేశాల అధినేతలు పలకరించుకోవడం చూస్తుంటే భారతీయ విధానం ఇప్పుడు ప్రపంచానికి మార్గదర్శిగా మారిందంటే అతిశయోక్తి కాదు.

  Namaste Goes Global, భారత సంప్రదాయం లో పలకరించుకున్న ఫ్రాన్స్‌, జర్మనీ అధినేతలు! || Oneindia Telugu
  కరోనాతో వచ్చిన మార్పు...

  కరోనాతో వచ్చిన మార్పు...


  కరోనా లాక్‌ డౌన్‌ సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోడీ ఓసారి ప్రెస్‌ మీట్లో మాట్లాడుతూ ఇకపై ఏదీ గతంలోలా ఉండదన్నారు. అది అక్షరసత్యమని నిరూపణ కావడానికి ఎంతో కాలం పట్టలేదు. భారత్‌తో పాటు ప్రపంచ దేశాల్లోనూ అన్నీ శరవేగంగా మారిపోతున్నాయి. జీవన విధానాల దగ్గరి నుంచి రోజు వారీ దినచర్యలు కూడా మారిపోయాయి. ఇవన్నీ మారిపోయాయి అనే కంటే మారక తప్పలేదనడంలో సందేహం లేదు. కరోనా కారణంగా కొంతకాలం పాటు తమ అధికార నివాసాలకే పరిమితమైన ప్రపంచ దేశాల అధినేతలు, రాజకీయ నాయకులు, జనం ఇప్పుడిప్పుడే రోడ్లపైకి వస్తున్నారు. కానీ అన్నిచోట్లా ఒకటే ధోరణి కనిపిస్తోంది. అదే టచ్‌ మీ నాట్‌. ఎవరికి వారు పలు జాగ్రత్తలు తీసుకుంటూ సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. అదే సమయంలో పలకరించుకునే విధానాల్లోనూ పలు మార్పులు వచ్చేశాయి. ఇప్పుడు వాటిలోనూ భారత్‌ ప్రపంచదేశాలకు మార్గదర్శిగా నిలుస్తోంది.

  భారతీయ పలకరింపు..

  భారతీయ పలకరింపు..


  ప్రపంచంలో ఇతర దేశాల మాట ఎలా ఉన్నా మన దేశంలో మాత్రం శతాబ్దాలుగా నమస్తే పదం వినిపిస్తుంటుంది. అతిధి మర్యాదల ప్రారంభంలోనూ, పలకరింపుల్లోనూ నమస్తే పదం తప్పనిసరి. దేశంలో వందలాది భాషలున్నా నమస్తే పదాన్ని మాత్రం ప్రజలు, ప్రభుత్వాలు, ప్రభుత్వాధినేతలు అంతా కామన్‌గా పాటిస్తుంటారు. చివరికి తాజాగా మన ప్రధాని నరేంద్రమోడీ కూడా నమస్తే ట్రంప్ కార్యక్రమం ఏర్పాటు చేసి మరీ ప్రపంచ పెద్దన్నను గౌరవించారు. అంతకు ముందు పరిస్ధితి ఎలా ఉన్నా.. కరోనా వచ్చాక మాత్రం ఇది తప్పనిసరిగా మారిపోతోంది. భారత్‌లోనే కాదు ప్రపంచదేశాల్లో సైతం నమస్తే ట్రెండ్‌ నడుస్తోంది. అమెరికా అధ్యక్షుడి నుంచి చిన్నా చితకా దేశాల్లో రాజకీయ నేతల వరకూ అంతా నమస్తే అంటూ రెండు చేతులు జోడించి పలకరించుకంటూ కనిపిస్తున్నారు.

  అంతర్జాతీయమైన నమస్తే...

  అంతర్జాతీయమైన నమస్తే...

  కరోనా కంటే ముందు అమెరికా అధ్యక్షుడి గౌరవార్ధం నమస్తే ట్రంప్‌ కార్యక్రమాన్ని భారత్ ప్రభుత్వం నిర్వహించినప్పుడు ఈ నమస్తే ఏంటనే చర్చ ప్రపంచవ్యాప్తంగా సాగింది. భారతీయతలోని నమస్తే పదాన్ని ట్రంప్‌ గౌరవార్ధం భారత్‌ వాడిందని అప్పట్లో అందరూ చర్చించుకున్నారు. కానీ ఇప్పుడు దాన్ని అనుసరించక తప్పని పరిస్ధితి అందరికీ వస్తుందని మాత్రం వారు ఊహించి ఉండరు. తాజాగా యూరోపియన్‌ దేశాలైన ఫ్రెంచ్‌, జర్మనీ అధినేతలు ఇమానుయేల్‌ మ్యాక్రాన్‌, ఏంజెలా మెర్కెల్‌ భేటీలోనూ నమస్తే కనిపించింది. కరోనా కారణంగా గతంలో వారు అనుసరించిన సంప్రదాయ హ్యాండ్‌ షేక్‌ విధానాన్ని పక్కనబెట్టి ఇరుదేశాల అధినేతలు నమస్తేతోనే పలకరించుకున్నారు. దక్షిణ ఫ్రాన్స్‌లోని తన వేసవి విడిదిలో మ్యాక్రాన్‌ ఏర్పాటు చేసిన విందుకు మెర్కెల్‌ హాజరైన సందర్భంగా ఈ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. దీంతో భారతీయ నమస్తే అంతర్జాతీయమైనట్లయింది.

  English summary
  With the coronavirus pandemic changing the way the world interacts with each other, salutations and greetings are also changing. And it seems the Indian 'namaste' is a popular choice as world leaders like France's Emmanuel Macron and Germany's Angela Merkel seem to have adopted it as their chosen form of greeting.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X