వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ భారత పర్యటన షెడ్యూల్: ఆ రెస్టారెంటుకు వెళ్లనున్న అగ్రరాజ్యం అధినేత

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: గుజరాత్‌లోని అహ్మదాబాదులో ట్రంప్ మోడీ "నమస్తే ట్రంప్" సమావేశం అచ్చం గతేడాది హూస్టన్‌లో జరిగిన హౌడీ మోడీ కార్యక్రమంలానే ఉంటుందని అన్నారు విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రవీష్ కుమార్. ట్రంప్ భారత పర్యటన కోసం ఆతురతతో ఎదురు చూస్తున్నట్లు రవీష్ కుమార్ చెప్పారు. ట్రంప్ భారత పర్యటనతో ప్రపంచదేశాలకు భారత్‌కు మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం అవుతుందని చెప్పారు.

ట్రంప్ పర్యటనతో బంధం మరింత బలోపేతం

ట్రంప్ పర్యటనతో బంధం మరింత బలోపేతం


భారత్‌లో రెండు రోజుల పర్యటనకోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌లు భారత్‌కు ఫిబ్రవరి 24న చేరుకుంటారని రవీష్ కుమార్ చెప్పారు. ట్రంప్ పర్యటనతో భారత్ అమెరికాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని రవీష్ కుమార్ చెప్పారు. గుజరాత్‌లోని అహ్మదాబాదుకు వెళ్లడం ద్వారా భారత్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన ప్రారంభమవుతుందని చెప్పిన రవీష్ కుమార్ ఆ తర్వాత ఉత్తర్ ప్రదేశ్‌లోని ఆగ్రాకు కూడా వెళతారని చెప్పారు. ఆ తర్వాత ఢిల్లీకి చేరుకుంటారని వెల్లడించారు. అదే రోజున సాయంత్రం ప్రధాని మోడీ విందును ఏర్పాటు చేస్తారని అదే సమయంలో ఇరు దేశాధినేతల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయని రవీష్ కుమార్ చెప్పారు

ఢిల్లీ స్కూలుకు మెలానియా ట్రంప్

ఢిల్లీ స్కూలుకు మెలానియా ట్రంప్

ఇక ఢిల్లీకి చేరుకున్న తర్వాత మెలానియా ట్రంప్ ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలను సందర్శించి అక్కడి విద్యార్థులతో ముచ్చటిస్తారని రవీష్ కుమార్ చెప్పారు. అంతేకాదు ఢిల్లీ సర్కార్ తీసుకొచ్చిన హ్యాపీ కరుక్యులమ్‌ గురించి మెలానియా ట్రంప్ తెలుసుకుంటారని చెప్పారు. న్యూఢిల్లీలోని చాణక్యపురిలో ఉన్న ఐటీసీ మౌర్యా హోటల్‌లో ట్రంప్ దంపతులు బసచేయనున్నట్లు రవీష్ కుమార్ చెప్పారు. వీరికోసం మంచి స్వీట్స్ కూడా తయారు చేయిస్తున్నట్లు రవీష్ కుమార్ చెప్పారు.

బుఖారా రెస్టారెంట్‌కు ట్రంప్ దంపతులు

బుఖారా రెస్టారెంట్‌కు ట్రంప్ దంపతులు

ఇక ఢిల్లీలోని ప్రముఖ ఇండియన్ రెస్టారెంట్ బుఖారాలో భోజనం చేయనున్నట్లు రవీష్ కుమార్ చెప్పారు. ఈ రెస్టారెంట్‌లో దాల్ బుఖారా వంటకంతో పాటు మాంసాహారం కూడా చాలా ఫేమస్ కావడంతో ట్రంప్ దంపతులు ఈ రెస్టారెంట్‌లో భోజనం చేస్తారని రవీష్ కుమార్ వెల్లడించారు. అయితే ట్రంప్ దంపతుల భోజనం గురించి చెఫ్స్ పూర్తిగా వివరాలు తెలపలేదు. సంప్రదాయ మిఠాయిలు ట్రంప్ మెనూలో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ట్రంప్‌క స్వీట్స్ అంటే చాలా ఇష్టమని సమాచారం.

రాష్ట్రపతి భవన్‌ టూ రాజ్‌ఘాట్

రాష్ట్రపతి భవన్‌ టూ రాజ్‌ఘాట్

ట్రంప్ భారత పర్యటన చాలా బిజీగా ఉండనుంది. మంగళవారం రాష్ట్రపతి భవన్‌లో బహిరంగ మీడియా సమావేశం ఉంటుంది. ఆ తర్వాత ట్రంప్ రాజ్‌ఘాట్‌కు వెళ్లి జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులు అర్పిస్తారు. అనంతరం లంచ్ మీటింగ్ కోసం హైదరాబాద్ హౌజ్‌లో ప్రధాని మోడీతో సమావేశం అవుతారు. ఆ తర్వాత సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇచ్చే విందులో ట్రంప్ దంపతులు పాల్గొంటారు.

English summary
The US President Donald Trump and the First Lady Melania Trump will be coming to India for a two-day trip on February 24. The visit, a first by Trumps’ to India, is being seen as a major boost to India-US ties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X