బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగళూరు మెట్రో రైలు సిబ్బంది, పోలీసులు డిష్యూం డిష్యూం: అన్ని సర్వీసులకు బ్రేక్ !

బెంగళూరు మెట్రో రైలు (నమ్మ మెట్రో) సిబ్బంది ( బీఎంఆర్ సీఎల్) ధర్నాలు చేస్తూ ఆందోళనకు దిగిడంతో శుక్రవారం ఉదయం (జులై 7) నుంచి మెట్రో రైలు సంచారం పూర్తిగా నిలిచిపోయింది.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు మెట్రో రైలు (నమ్మ మెట్రో) సిబ్బంది ( బీఎంఆర్ సీఎల్) ధర్నాలు చేస్తూ ఆందోళనకు దిగిడంతో శుక్రవారం ఉదయం (జులై 7) నుంచి మెట్రో రైలు సంచారం పూర్తిగా నిలిచిపోయింది. పోలీసులు అరెస్టు చేసిన మెట్రో రైలు సిబ్బందిని వెంటనే విడుదల చెయ్యాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నారు.

<strong>నగ్నంగా మహిళ, మర్మాంగంలో కారం పొడి, రోడ్డులో ఊరేగింపు, నా మొగుడితో నీకేం పని !</strong>నగ్నంగా మహిళ, మర్మాంగంలో కారం పొడి, రోడ్డులో ఊరేగింపు, నా మొగుడితో నీకేం పని !

శుక్రవారం ఉదయం నుంచి బెంగళూరు మెట్రో రైలు సంచారం అస్తవ్యస్థం కావడంతో వేలాది మంది ప్రయాణికులు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న కర్ణాటక ప్రభుత్వం సీరియస్ అయ్యింది. మెట్రో రైలు సిబ్బంది మీద ఎస్మా చట్టం ప్రయోగించాలని ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.

ఇక్కడ మొదలైయ్యింది

ఇక్కడ మొదలైయ్యింది

మెట్రో రైలు సిబ్బంది ఆందోళనకు అసలు కారణం ఏంటంటే, గురువారం సర్. ఎం. విశ్వేశ్వరయ్య కాలేజ్ సమీపంలోని మెట్రో రైల్వే స్టేషన్ లో నేషనల్ ఇండష్ట్రియల్ సెక్యూరిటీ ఏజెన్సీ సిబ్బంది (పోలీసులు) ప్రయాణికుల బ్యాగులు, వారి జోబులు పరిశీలించి లోపలికి పంపిస్తున్నారు.

రాకేష్ వచ్చాడు

రాకేష్ వచ్చాడు

ఆ సందర్బంలో మెట్రో రైలు సిబ్బంది రాకేష్ అనే వ్యక్తి అక్కడికి వెళ్లాడు. అతని బ్యాగ్ పరిశీలించాలని పోలీసులు చెప్పారు. తాను మెట్రో రైలు సిబ్బంది అంటూ బ్యాగ్ పరిశీలించడానికి రాకేష్ నిరాకరించాడు. తరువాత మెటల్ డిటెక్టర్ గేట్ నుంచి అతను లోపలికి వెళ్లాడు.

చెంప పగిలింది

చెంప పగిలింది

మెటల్ డిటెక్టర్ గేట్ లో నుంచి వెలుతున్న సమయంలో సౌండ్ రావడంతో పోలీసులకు అనుమానం వచ్చి బ్యాగ్ కచ్చితంగా పరిశీలించాలని పట్టుబట్టాడు. అయితే రాకేష్ అంగీకరించకపోవడంతో మాటల యుద్దం జరిగింది. సహనం కొల్పోయిన ఓ పోలీసు రాకేష్ చెంప చెల్లు మనిపించాడు.

దుమ్ములేపేశారు

దుమ్ములేపేశారు

మెట్రో రైల్వే స్టేషన్ లోపలికి వెళ్లిన రాకేష్ తన సాటి సిబ్బందిని పిలుచుకుని వచ్చి మళ్లీ అక్కడ ఉన్న పోలీసులతో గొడవ పెట్టుకున్నారు. మాటామాట పెరగడంతో మెట్రో రైలు సిబ్బంది ఓ మహిళా పోలీసుతో సహ మొత్తం ముగ్గురు పోలీసులను చితకబాదేశారని సమాచారం.

పోలీసులతో పెట్టుకున్నారు

పోలీసులతో పెట్టుకున్నారు

విషయం తెలుసుకున్న పోలీసులు రాకేష్ తో సహ ఆరు మందిని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చెయ్యాలని డిమాండ్ చేస్తూ బెంగళూరు మెట్రో రైలు సిబ్బంది ఆందోళనకు దిగారు. పోలీసు అధికారులు మాత్రం సీసీ కెమెరాలు పరిశీలించిన తరువాతే మెట్రో రైలు సిబ్బందిని అరెస్టు చేశామని అంటున్నారు.

English summary
This morning (July 7th) Namma Metro services in Bengaluru have stopped due to protest of namma metro personnels.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X