వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇన్ఫోసిస్ సంక్షోభం: నీలేకని అమెరికా ట్రిప్ వాయిదా, అందరి మద్దతు

ఇన్ఫోసిస్‌లో సంక్షోభం నేపథ్యంలో ఆ సంస్థ సహ వ్యవస్థాపకులు నందన్ నీలేకని తిరిగి కంపెనీలోకి రానున్నట్లు ప్రచారం సాగుతోంది. అతను నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవిలో కూర్చునే అవకాశాలున్నాయని అంటున్నారు.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఇన్ఫోసిస్‌లో సంక్షోభం నేపథ్యంలో ఆ సంస్థ సహ వ్యవస్థాపకులు నందన్ నీలేకని తిరిగి కంపెనీలోకి రానున్నట్లు ప్రచారం సాగుతోంది. అతను నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవిలో కూర్చునే అవకాశాలున్నాయని అంటున్నారు.

ఇన్ఫోసిస్‌లోకి నందన్ నీలేకని రీ ఎంట్రీ?: సంక్షోభంలో తెరవెనుక..ఇన్ఫోసిస్‌లోకి నందన్ నీలేకని రీ ఎంట్రీ?: సంక్షోభంలో తెరవెనుక..

ప్రస్తుతం నందన్ నీలేకని తన రెండు నెలల అమెరికా ట్రిప్ వాయిదా వేసుకోవడం కూడా గమనార్హం. దీంతో ఆయన తిరిగి ఇన్ఫోసిస్‌లోకి వస్తారనే ప్రచారం వాస్తవంగా కనిపిస్తోంది.

నందన్ నీలేకనికి మద్దతు

నందన్ నీలేకనికి మద్దతు

నందన్‌ నీలేకనిని ఛైర్మన్‌గా నియమించాలని ఇన్ఫోసిస్‌ మాజీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ వి బాలకృష్ణన్‌ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఖాతాదార్లను అర్థం చేసుకోవడానికి నీలేకని అనుభవం తోడ్పడుతుందని, కంపెనీని నడిపించే మంచి వ్యక్తి ఆయన కాగలరని అభిప్రాయపడ్డారు.

Recommended Video

Infosys CEO and MD Vishal Sikka resigns ఇన్ఫోసిస్‌లో సంచలనం విశాల్ సిక్కా రాజీనామా ఎఫెక్ట్
ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరం

ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరం

అదే సమయంలో ప్రస్తుత ఛైర్మన్‌, సహ ఛైర్మన్‌‌లను తొలగించాలని బాలకృష్ణన్ పీటీఐతో అన్నారు. నీలేకని ఛైర్మన్‌గా వచ్చి, సీఈఓగా కాదగ్గ వ్యక్తిని ఎంపిక చేయడం ప్రస్తుత పరిస్థితులకు చాలా అవసరమని అభిప్రాయపడ్డారు.

ఖాతాదార్లతో మంచి సంబంధాలు

ఖాతాదార్లతో మంచి సంబంధాలు

నీలేకని కంపెనీలో ఉన్న సమయంలో చాలా బాగా పనిచేశారని, ఖాతాదార్లతో మంచి సంబంధాలు కలిగి ఉండే వారని బాలకృష్ణన్ గుర్తు చేశారు. అదీకాక నీలేకనికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు, గౌరవం ఉన్నాయని, చాలా ప్రభుత్వ ప్రాజెక్టుల్లోనూ ఆయన పనిచేశారని, ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆధార్‌ ప్రాజెక్ట్‌. అందుకే బోర్డులోకి రావడానికి ఆయనకు అన్ని విధాలా అర్హత ఉందని వివరించారు.

అప్పుడే

అప్పుడే

విశాల్‌ సిక్కా గత వారం సీఈఓగా రాజీనామా చేయడంతో తాత్కాలిక సీఈఓగా యు.బి. ప్రవీణ్‌ రావును నియమించిన సంగతి తెలిసిందే. కాగా, బాలకృష్ణన్‌ అభిప్రాయపడ్డట్లు ఇన్‌స్టిట్యూషనల్‌ అడ్వైజరీ సర్వీసెస్‌(ఐఐఏఎస్‌) కూడా నీలేకనిని నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా బోర్డులోకి తీసుకురావడం మంచిదని సిక్కా రాజీనామా చేసిన రోజునే తన నివేదికలో పేర్కొనడం గమనార్హం.

English summary
Infosys co-founder Nandan Nilekani may come back in the role of non-executive chairman of Infosys board, multiple sources familiar with the development told ET NOW. Nilekani is "seriously considering" a formal role and has postponed a 2-month visit to the US to stay back in Bengaluru and discuss the contours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X