బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సంపదలో సగభాగం దాతృత్వానికే: ‘ఇన్ఫోసిస్’ నీలేకని సంచలనం, భగవద్గీతే ప్రేరణ

ఇన్పోసిస్‌ సహ వ్యవస్థాపకులు, ప్రస్తుత ఛైర్మన్ నందన్‌ నీలేకని, ఆయన భార్య రోహిణి నీలేకని సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ సంపదలో సగభాగాన్ని దాతృత్వానికి కేటాయించనున్నట్లు ప్రకటించారు.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఇన్పోసిస్‌ సహ వ్యవస్థాపకులు, ప్రస్తుత ఛైర్మన్ నందన్‌ నీలేకని, ఆయన భార్య రోహిణి నీలేకని సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ సంపదలో సగభాగాన్ని దాతృత్వానికి కేటాయించనున్నట్లు ప్రకటించారు.

Recommended Video

Nandan Nilekani set to return as Infosys Non-Executive Chairman | Oneindia Telugu
 సంపదలో సగభాగం

సంపదలో సగభాగం

తమ సంపదలో అర్ధభాగాన్ని దాతృత్వ కార్యక్రమాలకు కేటాయించేందుకు ప్రపంచ సంపన్నులు నెలకొల్పిన ‘ది గివింగ్‌ ప్లెడ్జ్‌'లో నీలేకని దంపతులు కూడా చేరారు. నీలేకని అంగీకారంతో రాసిన లేఖను ది గివింగ్‌ ప్లెడ్జ్‌ వెబ్‌సైట్‌ అప్‌లోడ్‌ చేసింది.

 భగద్గీతే ప్రేరణ

భగద్గీతే ప్రేరణ

‘భగవద్గీత నుంచి పొందిన ప్రేరణతో.. బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఈ అరుదైన అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మన కర్తవ్యాన్ని నిర్వర్తిద్దాం. దాన్నుంచి ప్రతిఫలాన్ని ఆశించవద్దు. ప్రత్యక్ష ప్రతిస్పందన లభించదనే భావనతో, చేయకుండా ఆగిపోకూడదు' అని వివరించారు.

 బిల్ గేట్స్ స్వాగతం

బిల్ గేట్స్ స్వాగతం

నీలేకని దంపతులను సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు బిల్‌గేట్స్‌ ట్వీట్‌ చేశారు. ఇప్పటికే భారత్‌కు చెందిన విప్రో ఛైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీ, బయోకాన్‌ ఛైర్మన్‌ కిరణ్‌ మజుందార్‌ షా, శోభా డెవలపర్స్‌ గౌరవ ఛైర్మన్‌ పీఎన్‌సీ మేనన్‌ ఈ పథకంలో భాగస్వాములయ్యారు.

 అసమానతలు పెరిగిపోతున్నాయి..

అసమానతలు పెరిగిపోతున్నాయి..

కాగా, ఈ సందర్భగా నీలేకని మాట్లాడుతూ.. ‘ప్రపంచ దేశాల్లో అసమానతలు వేగంగా పెరిగిపోతున్నాయి. యువత, శ్రమ జీవులు తమ కష్టానికి తగిన ఫలితాన్ని పొందలేకపోతున్నారు. ధనం ఎక్కువగా ఉన్నవారు పేదల జీవితాల్లో వెలుగు నింపేందుకు కృషి చేయాలి' అని వ్యాఖ్యానించారు. గతంలో కూడా నీలేకని ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో తనవంతు బాధ్యతగా సాయమందించారు.

English summary
Infosys Chairman Nandan Nilekani and wife Rohini have joined the 'Giving Pledge' - an elite network of billionaires who have promised half of their wealth to philanthropy. The "Giving Pledge" was created by Bill and Melinda Gates and Warren Buffet in August 2010 to encourage billionaires to dedicate the majority of their wealth for philanthropy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X