వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రతన్ టాటాకు నారాయణమూర్తి పాదాభివందనం: గ్రేట్ లెజెండ్స్ అంటూ నెటిజన్ల ప్రశంసలు

|
Google Oneindia TeluguNews

Recommended Video

Narayana Murthy Touches Ratan Tata's Feet : Never Before Ever After

ముంబై: వారిద్దరూ పారిశ్రామిక దిగ్గజాలు. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తులు. వారే ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి. తాజాగా చోటు చేసుకున్న ఓ ఆసక్తికర ఘటన నేపథ్యంలో వీరిద్దరి గురించి చెప్పుకోవాల్సి వచ్చింది. ఓ కార్యక్రమంలో రతన్ టాటాకు నారాయణ మూర్తి పాదాభివందనం చేయడం గమనార్హం. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

రతన్ టాటా పాదాలను తాకిన నారాయణమూర్తి

రతన్ టాటా పాదాలను తాకిన నారాయణమూర్తి


వివరాల్లోకి వెళితే.. టైకాన్ 11వ వార్షిక అవార్డుల కార్యక్రమం ముంబైలో మంగళవారం రాత్రి ఘనంగా జరిగింది. రతన్ టాటాను జీవనకాల సాఫల్య పురస్కారంతో సత్కరించారు. నారాయణ మూర్తి చేతుల మీదుగా టాటా ఈ అవార్డును అందుకున్నారు. అవార్డును ప్రదానం చేసిన తర్వాత నారాయణమూర్తి.. రతన్ టాటా పాదాలను తాకారు. ఈ పరిణామం అక్కడున్నవారిని ఆకట్టుకుంది.

హృదయాన్ని హత్తుకునే వినమ్రత..

కాగా, ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇంటర్నెట్, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. టైకాన్ కూడా తన ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోలను పోస్టు చేసింది. ‘హృదయాన్ని హత్తుకునే వినమ్రత.. ఇదో చారిత్రక క్షణం' అంటూ వ్యాఖ్యానించింది. నెటిజన్లు కూడా వీరిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇద్దరు నిజమైన లెజెండ్స్ అని వ్యాఖ్యానించారు. భారతీయులందరికీ వీరిద్ద గొప్ప మార్గదర్శకులని కొనియాడుతున్నారు.

గర్వంగా ఉందంటూ రతన్ టాటూ

గర్వంగా ఉందంటూ రతన్ టాటూ


రతన్ టాటా కూడా తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో ఈ ఫొటోలను పోస్ట్ చేసి.. ‘గొప్ప స్నేహితుడైన నారాయణమూర్తి నుంచి అవార్డు అందుకోవడం గర్వంగా ఉంది' అని హర్షం వ్యక్తం చేశారు. నెటిజన్లు కూడా ఈ ఫొటోలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. విలువలను చూపించిన లెజెండ్స్.. కార్పొరేట్ చరిత్రలో గొప్ప క్షణం.. భారత సంప్రదాయంలో ఇతరులను గౌరవించడం కంటే మించింది లేదంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇది మన సంప్రదాయమని, భారత గొప్పతనమని వ్యాఖ్యానిస్తున్నారు. మనసు తాకేవిధంగా ఈ లెజెండ్స్ వ్యవహరించారని అన్నారు.

English summary
In what can be called a historic corporate moment, TiEcon Mumbai witnessed two powerful, renowned industrialists share the stage with each other.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X