• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బోర్డర్ లో భారీ నార్కో-టెర్రర్ రాకెట్ : పాకిస్థానీ పిస్టల్స్, నకిలీ కరెన్సీ, కేజీ హెరాయిన్.. బీఎస్ఎఫ్ స్వాధీనం

|

భారతదేశంలో ఉగ్రవాదుల చొరబాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని నిర్దిష్ట ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా భారీగా సెర్చ్ ఆపరేషన్ సాగుతుంది. జమ్మూ కాశ్మీర్ లో నియంత్రణ రేఖకు సమీపంలో నిర్వహించిన ఒక సెర్చ్ ఆపరేషన్ లో భారీగా నార్కో టెర్రర్ రాకెట్ ను ఛేదించారు.సరిహద్దు భద్రతా దళం జమ్మూ కాశ్మీర్‌లో అఖ్నూర్ సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు నుండి భారీ ఆయుధాలు, మందుగుండు సామగ్రి, నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకుంది. ఈ సామాగ్రి ఉగ్రవాదులకు చేరవేయటానికి తెచ్చినట్టు భావిస్తున్నారు.

బీఎస్ఎఫ్ సెర్చ్ ఆపరేషన్ .. భారీగా డ్రగ్స్తో పాటు ఆయుధాలు

బీఎస్ఎఫ్ సెర్చ్ ఆపరేషన్ .. భారీగా డ్రగ్స్తో పాటు ఆయుధాలు

నిర్దిష్ట ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా నియంత్రణ రేఖకు సమీపంలో భద్రతా దళాలు నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్ లో, నాలుగు పిస్టల్స్, ఎనిమిది మ్యాగజైన్‌లు, 190 రౌండ్లు 7.63 x 25 ఎంఎం , ఒక కిలో బరువున్న 'హెరాయిన్' డ్రగ్స్ కలిగిన ప్యాకెట్, రూ .2,75,000 విలువైన నకిలీ అంతర్జాతీయ కరెన్సీతో కూడిన బ్యాగ్ లభించిందని భద్రత దళాలు వెల్లడించాయి. ఈ సరుకు ఆ ప్రాంతంలోని యాంటీ-నేషనల్ ఎలిమెంట్స్ (ANEs) ఉగ్రవాదులకు బట్వాడా అయ్యే అవకాశం ఉందని , కానీ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఈ సరుకును స్వాధీనం చేసుకోవడం ద్వారా వారి దుర్మార్గపు ప్రయత్నాలను విఫలం చేసిందని జమ్మూలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ , బిఎస్ఎఫ్ పీఆర్ఓ ఎస్పీఎస్ సంధు చెప్పారు.

శ్రీనగర్ లో ఉగ్రవాద స్థావరాన్ని చేదించిన పోలీసులు , భద్రతా సిబ్బంది

శ్రీనగర్ లో ఉగ్రవాద స్థావరాన్ని చేదించిన పోలీసులు , భద్రతా సిబ్బంది

అయితే ఈ సరుకు తెచ్చింది ఎవరు? వారు ఎవరికి చేరవెయ్యటానికి ఈ సామాగ్రి తెచ్చారు అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ భారీ విధ్వంసకర సామాగ్రిని తెచ్చినవారిని పట్టుకోవటం కోసం భారీగా తనిఖీలు చేపట్టారు. ఇదిలా ఉండగా, పుల్వామాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను జమ్మూ కాశ్మీర్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. మరోవైపు శ్రీనగర్ జిల్లాలోని రాజౌరికడల్ ప్రాంతంలో ఉగ్రవాద స్థావరాన్ని ఛేదించారు. శ్రీనగర్ పోలీసులు, పుల్వామా పోలీసులు మరియు ఇండియన్ ఆర్మీ యొక్క 50 ఆర్ఆర్ దక్షిణ కాశ్మీర్ జిల్లా నుండి ఉగ్రవాద కార్యాకలాపాలకు పాల్పడే ఇద్దరు అండర్ గ్రౌండ్ వర్కర్స్ ను అరెస్టు చేశారు.

లష్కరే తోయిబా కమాండర్ స్థావరంపై రైడ్ .. ఇంటి యజమాని విచారణ

విచారణలో లష్కరే తోయిబా కమాండర్ రియాజ్ సతర్‌గుండ్ పేరు బయటకు వచ్చింది. రాజౌరికడల్ లో ఒక రహస్య స్థలాన్ని ఏర్పాటు చేయాలని రియాజ్ అండర్ గ్రౌండ్ వర్కర్ లను కోరినట్లు సమాచారం. ఈ క్రమంలో భద్రతా దళాలు, మరియు పోలీసులు, సిఆర్‌పిఎఫ్ సిబ్బందితో కలిసి ఈ రోజు ఉదయం రియాజ్ రహస్య స్థావరం వద్ద కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. కానీ అక్కడ స్థావరం ఖాళీగా ఉంది. ఆ ఇంటి యజమానిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.

  Salaar 'Prabhas': Disha Patani And 2 more Bollywood Heroines in Movie

  పండుగ సమయంలో ఉగ్రవాద కార్యాకలాపాలపై ఇంటిలిజెన్స్ హెచ్చరికలు


  దేశంలో రాబోయే పండగ సీజన్లో ఉగ్రవాద కార్యకలాపాలను అమలు చేయడానికి జమ్మూకాశ్మీర్ ప్రాంతంలోని పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులతో పాటు, ఆఫ్ఘనిస్తాన్ మూలాలున్న ఉగ్రవాదులు కూడా రంగంలోకి దిగే అవకాశం ఉందని, దాడులు చేసే ప్రమాదం పొంచి ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఇంటెలిజెన్స్ ఏజెన్సీల ప్రకారం, వారు లష్కరే తోయిబా, హర్కత్ ఉల్-అన్సార్ (హువా) మరియు హిజ్బుల్ ముజాహిదీన్ కదలికలకు సంబంధించి తమ వద్ద సమాచారం ఉందని పేర్కొన్నారు. పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలు, ఆఫ్ఘన్ మూలాలున్న ఉగ్రవాదులు భారతదేశంలోకి ప్రవేశించడానికి సహాయం చేస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో హై అలెర్ట్ ప్రకటించి క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.

  English summary
  During a search operation near the Line of Control (LoC), security forces found four pistols, eight magazines, 190 rounds of 7.63 x 25 mm, 1 kg heroin and a bag containing counterfeit international currency worth Rs 2,75,000. Troops revealed.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X