వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శక్తివంతుల జాబితా విడుదల చేసిన ఫోర్బ్స్: 9వ,స్థానంలో మోడీ

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా అత్యంత శక్తిమంతమైన వ్యక్తుల జాబితాలో టాప్‌ టెన్‌లో మోదీ చోటు దక్కించుకున్నారు. ప్రముఖ మ్యాగజైన్‌‌ ఫోర్బ్స్‌ విడుదల చేసిన ఈ జాబితాలో మోదీ 9వ స్థానంలో నిలిచారు.

2018 సంవత్సరానికి గానూ ఫోర్బ్స్‌ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన వ్యక్తుల జాబితాను విడుదల చేసింది. ప్రపంచాన్ని మార్చిన వ్యక్తులతో ఈ జాబితాను రూపొందించింది. ప్రపంచ వ్యాప్తంగా 7.5 బిలియన్ల మనుషులుంటే. ఇందులో 75 మంది వ్యక్తులు శక్తిమంతమైన వారిగా నిలిచారు. అంటే ప్రతి 10కోట్ల మందిలో ఒక శక్తిమంతమైన వ్యక్తి ఉన్నారని ఫోర్బ్స్ ప్రకటించింది.

Narendra Modi among top 10 in Forbes list of worlds most powerful people; Chinas Xi Jinping leads chart

ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ తో పాటు , యూకే ప్రధాని థెరిసా మే తదితరులను దాటి ఇండియా ప్రధానమంత్రి మోడీ 9వ, స్థానంలో నిలిచారు. . ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ 13వ స్థానానికి పరిమితమయ్యారు. ఆ తర్వాత స్థానాన్ని , యూకే ప్రధాని థెరిసా మే దక్కించుకొన్నారు. త అవినీతిని నిర్మూలించేందుకు 2016లో ప్రధాని మోదీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ఫోర్బ్స్‌ ప్రస్తావించింది.

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ తొలిసారిగా ప్రథమస్థానంలో నిలిచారు. శక్తిమంతమైన వ్యక్తుల జాబితాలో గత నాలుగేళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ను దాటేసి జిన్‌పింగ్‌ ఈసారి తొలిస్థానం దక్కించుకున్నారు. పుతిన్‌ రెండో స్థానానికి పడిపోయారు. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 3, జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ 4, అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ 5, పోప్‌ ఫ్రాన్సిస్‌ 6, మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్‌ 7, సౌదీ అరేబియా యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ అల్‌ సాద్‌ 8, ఆల్ఫాబెట్‌ సీఈవో లారీ పేజ్‌ 10వ స్థానంలో నిలిచారు.

భారత అపర కుబేరుడు ముకేశ్‌ అంబానీకి ఈ జాబితాలో చోటుదక్కింది. ముఖేష్ అంబానీ 32వ స్థానంలో నిలిచారు. మోదీ కాకుండా ఈ జాబితాలో చోటు దక్కించుకున్న మరో భారతీయుడు ముకేశ్ కావడం విశేషం. ముకేశ్‌ అంబానీ సంస్థ రిలయన్స్‌ తీసుకొచ్చిన జియో నెట్‌వర్క్‌ను ఫోర్బ్స్‌ ప్రస్తావించింది. భారత సంతతికి చెందిన సత్య నాదేళ్ల 40వ స్థానంలో నిలిచారు.

English summary
Prime Minister Narendra Modi has been ranked among the top 10 most powerful people in the world by Forbes in a list that has been topped for the first time ever by Chinese president Xi Jinping, who dethroned Russian president Vladimir Putin as the most influential person on the planet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X