వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇజ్రాయిల్ ను సందర్శించే తొలి ఇండియా ప్రధాని మోడీ

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇజ్రాయిల్ దేశాన్ని సందర్శించిన తొలి ఇండియా ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ చరిత్ర సృష్టించనున్నారు.మంగళవారం నాడు మోడీ ఇజ్రాయిల్ పర్యటనకు చేరుకోనున్నారు.

ఈ రెండు దేశాల మధ్య సైబర్, మిలటరీ రంగాలపై ఒప్పందాలను చేసుకోనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ పర్యటన రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత ధృడపరిచే అవకాశాలున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.

మూడు రోజుల పర్యటనలో ఈ రెండు దేశాలు ఏ అంశాలపై కేంద్రీకరించనున్నాయోననే ఆసక్తి నెలకొంది. ప్రధానంగా రక్షణ ఒప్పందాలపైనే ఎక్కువగా కేంద్రీకరించారని సమాచారం.

 Narendra Modi to become first Indian PM to visit Israel

ఇజ్రాయిల్ -ఇండియా దేశాలు కౌంటర్ టెర్రరిజంపై కలిసి పనిచేస్తున్నాయి. భారత్ ఇజ్రాయిల్ నుండి పెద్ద ఎత్తున ఆయుధాలను కొనుగోలు చేస్తోంది. చాలా కాలంగా ఇక్కడినుండి ఆయుధాలను ఇండియా కొనుగోలు చేస్తున్న తరుణంలో మోడీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకొంది.

చైనా, పాకిస్థాన్ ను ఎదుర్కొనేందుకుగాను భారత్ కు ఇజ్రాయిల్ పెద్ద ఆయుధ గారంగా మారనుంది. ఏడాదికి ఒక్క బిలియన్ ఆయుధాలను మార్కెట్ చేసుకొనేందుకు ఇజ్రాయిల్ కు భారత్ పెద్ద మార్కెట్ గా నిపుణులు అంచనావేస్తున్నారు.

రాడార్, సైబర్, సెక్యూరిటీ, కమ్యూనికేషన్ సిస్టమ్స్ కొనుగోలుకు రక్షణ వ్యవస్థలో సహకారం తీసుకొనే విషయమై ఈ రెండు దేశాల మధ్య ఒప్పందాలు చోటుచేసుకొన్నాయి.

ఇజ్రాయిల్ కు భారత్ వ్యవసాయ ఉత్పత్తులు, ఫుడ్ సెక్యూరిటీ విషయమై చర్యలపై చర్చించనున్నారు. 25 ఏళ్ళుగా ఈ రెండు దేశాల మధ్య మంచి సంబంధాలున్నాయి.

ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజిమెన్ నెతాన్యుహు మోడీ పర్యటనను చారిత్రాత్మకమైందిగా అభివర్ణించారు. భద్రత, వ్యవసాయం, నీరు, ఇంధనం తదితర విషయాల్లో పాలుపంచుకోనున్నారు.

2008 లో ముంబై చోటుచేసుకొన్న కాల్పుల ఘటనలో తల్లిదండ్రులను మరణించిన బాలుడు మోషీ హోల్టీజెబర్గ్ ను కలుసుకోనున్నారు మోడీ.ముంబై ఘటనలో ఆరుగురు ఇజ్రాయిల్ పౌరులు చనిపోయారు.
మోడీ పర్యటనకు ఇజ్రాయిల్ ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

English summary
Narendra Modi will become the first Indian prime minister to visit Israel when he arrives on Tuesday.Mr Modi, who recently said India and the Jewish state share a "deep and centuries-old" connection, is expected to agree military and cyber security deals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X