వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ మంత్రివర్గం పూర్తి జాబితా: ఎవరెవరికి ఏయే శాఖ

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ మంగళవారం పూర్తి స్థాయిలో పునర్వ్యవస్థీకరించారు. కొత్తగా 19 మంది మంత్రులకు తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. స్వతంత్ర హోదాలో పనిచేస్తున్న ప్రకాశ్ జవదేకర్‌కు కేబినెట్ మంత్రిగా పదోన్నతి కల్పించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు ఏయే శాఖలను కేటాయించారనే విషయమై పలు ఆసక్తికర కథనాలు వెలుగు చూస్తున్నాయి. కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్యనాయుడుకు మరో కీలక శాఖ సమాచార, ప్రసార శాఖను అప్పగించిన ప్రధాని మోడీ ఆయన నుంచి పార్లమెంటరీ వ్యవహారాల శాఖను తప్పించేశారు.

దీంతో వెంకయ్య వద్ద పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణం, పట్టణ పేదరిక నిర్మూలన శాఖలతో పాటు ఎంతో కీలకమైన కేంద్ర సమాచార, ప్రసార శాఖ అదనంగా చేరింది. మరోవైపు ఆయన వద్ద నుంచి తొలగించిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖను పార్టీ సీనియర్ నేత, మృదు స్వభావిగా పేరున్న అనంత్ కుమార్‌కు అప్పజెప్పారు.

తల్లి గెంటెస్తే! అనుప్రియను కేంద్రమంత్రిని చేసిన మోడీ తల్లి గెంటెస్తే! అనుప్రియను కేంద్రమంత్రిని చేసిన మోడీ

ఇటీవల కాలంలో వరుస వివాదాలకు నిలయమైన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖను స్మృతి ఇరానీని ఆ శాఖ నుంచి ఆమెను తప్పించి, బీజేపీ సీనియర్ నేత ప్రకాశ్ జవదేకర్‌కు ఆ శాఖను అప్పగించారు. నిన్నటిదాకా కేంద్ర పర్యావరణ మంత్రి (స్వతంత్ర హోదా)గా ఉన్న జవదేకర్... పర్యావరణ, అటవీ శాఖలకు సంబంధించి అనుమతుల జారీలో పారదర్శకంగా వ్యవహరించారు.

 Narendra Modi Cabinet reshuffle: Full list

అనుమతుల జారీలో ఆయన ఎలాంటి అవినీతికి పాల్పడలేదట. గత ప్రభుత్వాల హయాంలో ఈ శాఖను నిర్వహించిన మంత్రుల పనితీరుతో పోలిస్తే జవదేకర్ సమర్థవంతంగా పనిచేశారని కేంద్రంలోని ఉన్నతాధికారులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని తెలుస్తోంది.

ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకున్న ప్రధాని మోడీ, నిజాయతీగా వ్యవహరిస్తున్న జవదేకర్‌కు మానవ వనరుల మంత్రత్వ శాఖను అప్పగించి ఆయనకు కేబినెట్ మంత్రి హోదా కల్పించారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. మరో మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు ప్రధాని మోడీ ప్రమోషన్ ఇస్తూ న్యాయశాఖకు మార్చారు.

నిన్నటి వరకు న్యాయశాఖ మంత్రిగా ఉన్న సదానంద గౌడకు ఈ మంత్రివర్గ విస్తరణ పెద్ద షాక్ ఇచ్చింది. న్యాయ శాఖ మంత్రిగా ఉన్న ఆయన్ను ప్రాధాన్యత లేని గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖకు మార్చారు. సదానంద పనితీరు పట్ల మోదీ అంత సంతృప్తిగా లేకపోవడం, ఏపీ-తెలంగాణ ఉమ్మడి హైకోర్టు విభజన అంశంపై ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు అలజడి రేపడం ఆయన శాఖ మార్పునకు కారణంగా భావిస్తున్నారు.

మోడీ జంబో కేబినేట్: అద్వానీ గైర్హాజరు, సుష్మా అలక!మోడీ జంబో కేబినేట్: అద్వానీ గైర్హాజరు, సుష్మా అలక!

బీజేపీ మహిళా నేత స్మృతి ఇరానీకి ఈ కేబినెట్ విస్తరణ పెను షాక్ ఇచ్చిందనే చెప్పాలి. నిన్నటి వరకు హెచ్‌ఆర్డీ మంత్రిగా ఉన్న ఆమెను ఆశాఖ నుంచి తప్పించిన తాజాగా ఆమెను జౌళి శాఖకు మార్చారు. పలు యూనివర్సిటీల్లో గొడవలు, దళిత విద్యార్థుల విషయంలో వివాదాల నేపథ్యంలో స్మృతిని హెచ్‌ఆర్‌డీ నుంచి తప్పించడం గమనార్హం.

ఎవరెవరికి ఏయే శాఖలు అప్పగింత:

ప్రధానమంత్రి
నరేంద్ర మోడీ: సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖలు, ఇతరులకు కేటాయించని శాఖలన్నీ

కేబినెట్‌ మంత్రులు
రాజ్‌నాథ్‌ సింగ్‌: హోం
సుష్మా స్వరాజ్‌: విదేశీ వ్యవహారాలు
అరుణ్‌ జైట్లీ: ఆర్థిక, కార్పొరేట్‌ వ్యవహారాలు
వెంకయ్యనాయుడు: పట్టణాభివృద్ధి, హౌసింగ్‌- పట్టణ పేదరిక నిర్మూలన, సమాచార ప్రసార శాఖలు
నితిన్‌ గడ్కరీ: రోడ్డు రవాణా, హైవేలు, షిప్పింగ్‌
మనోహర్‌ పారికర్: రక్షణ
సురేశ్‌ ప్రభు: రైల్వే
సదానంద గౌడ: గణాంకాలు, పథకాల అమలు
ఉమాభారతి: జల వనరులు
నజ్మా హెప్తుల్లా: మైనారిటీ వ్యవహారాలు
రామ్‌విలాస్‌ పాశ్వాన్‌: వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ
కల్‌రాజ్‌ మిశ్రా: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు
మేనకా గాంధీ: మహిళా శిశు సంక్షేమం
అనంతకుమార్‌: రసాయనాలు ఎరువులు, పార్లమెంటరీ వ్యవహారాలు
రవిశంకర్‌ ప్రసాద్‌: చట్టం-న్యాయం, ఎలక్ట్రానిక్స్, ఐటీ
జె.పి.నడ్డా: ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం
అశోక్‌ గజపతి రాజు: పౌర విమానయానం
అనంత గీతే: భారీ పరిశ్రమలు, పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌
హర్‌సిమ్రత కౌర్‌ బాదల్‌: ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలు
నరేంద్ర సింగ్‌ తోమర్‌: గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్‌, తాగునీరు, పారిశుద్ధ్యం
చౌదరి బీరేందర్‌ సింగ్‌: ఉక్కు
జ్యుయల్‌ ఓరమ్‌: గిరిజన వ్యవహారాలు
రాధామోహన్‌సింగ్‌: వ్యవసాయం, రైతు సంక్షేమం
తవర్‌ చంద్‌ గెహ్లాట్‌: సామాజిక న్యాయం సాధికారత
స్మృతి ఇరానీ: జౌళి
హర్ష్‌వర్ధన్‌: సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
ప్రకాశ్‌ జవడేకర్‌: మానవ వనరుల అభివృద్ధి

సహాయ మంత్రులు (స్వతంత్ర)
రావ్‌ ఇందర్‌జిత సింగ్‌: ప్రణాళిక, పట్టణాభివృద్ధి, హౌసింగ్‌-పట్టణ పేదరిక నిర్మూలన
బండారు దత్తాత్రేయ: కార్మిక ఉపాధి
రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ: నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌
విజయ్‌ గోయల్‌: క్రీడలు, యువజన వ్యవహారాలు, జల వనరులు
శ్రీపాద యశో నాయక్‌: ఆయుష్‌
ధర్మేంద్ర ప్రదాన్‌: పెట్రోలియం సహజవాయువు
పీయూష్‌ గోయల్‌: విద్యుత్, బొగ్గు, గనులు, పునరుత్పాదక ఇంధన వనరులు
జితేంద్ర సింగ్‌: ఈశాన్య ప్రాంత అభివృద్ధి, ప్రధాని కార్యాలయ వ్యవహారాలు, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, అణు శక్తి, అంతరిక్షం
నిర్మలా సీతారామన్‌: వాణిజ్యం, పరిశ్రమలు
మహేశ్‌ శర్మ: సాంస్కృతికం, పర్యాటకం
మనోజ్‌ సిన్హా: కమ్యూనికేషన్లు (స్వతంత్రంగా), రైల్వేలు (సహాయం)
అనిల్‌ మాధవ్‌ దావే: పర్యావరణం, అడువుల, వాతావరణ మార్పులు

సహాయ మంత్రులు
జనరల్‌ వి.కె.సింగ్‌: విదేశీ వ్యవహారాలు
సంతోశ్‌ కుమార్‌ గాంగ్వార్‌: ఆర్థికం
ఫగ్గన్‌ సింగ్‌ కులస్తే: ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం
ముఖ్తార్‌ అబ్బాస్‌ నక్వీ: మైనారిటీ వ్యవహారాలు, పార్లమెంటరీ వ్యవహారాలు
ఎస్‌.ఎ్‌స.అహ్లూవాలియా: వ్యవసాయం, రైతు సంక్షేమం, పార్లమెంటరీ వ్యవహారాలు
రామ్‌దాస్‌ అథవాలే: సామాజిక న్యాయం, సాధికారత
రామ్‌కృపాల్‌ యాదవ్‌: గ్రామీణాభివృద్ధి
హరిభాయ్‌ పర్తీభాయ్‌ చౌదరి: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు
గిరిరాజ్‌ సింగ్‌: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు
హన్స్‌రాజ్‌ గంగారామ్‌ అహిర్‌: హోం
జి.ఎం.సిద్ధేశ్వర: భారీ పరిశ్రమలు, పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌
రమేశ్‌ చందప్ప: తాగునీరు, పారిశుద్ధ్యం
రాజేన్‌ గొహైన్‌: రైల్వే
పర్షోత్తమ్‌ రూపాలా: వ్యవసాయం, రైతు సంక్షేమం, పంచాయతీరాజ్‌
ఎం.జె.అక్బర్‌: విదేశీ వ్యవహారాలు
ఉపేంద్ర కుష్వాహా: మానవ వనరుల అభివృద్ధి
పి.రాధాకృష్ణన్‌: రోడ్డు రవాణా, హైవేలు, షిప్పింగ్‌
కిరెన్‌ రిజిజు: హోం
కృషన్‌ పాల్‌: సామాజిక న్యాయం, సాధికారత
జశ్వంత సింహ్‌: గిరిజన వ్యవహారాలు
సంజీవ్‌ కుమార్‌ బల్యాన్‌: జల వనరులు
విష్ణు దేవ్‌ సాయి: ఉక్కు
సుదర్శన్‌ భగత్: వ్యవసాయం, రైతు సంక్షేమం
సుజనా చౌదరి: సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
జయంత సిన్హా: పౌర విమానయానం
కల్నల్‌ రాజ్యవర్ధన్‌ రాథోడ్‌: సమాచార ప్రసార శాఖ
బాబుల్‌ సుప్రియో: పట్టణాభివృద్ధి, హౌసింగ్‌-పట్టణ పేదరిక నిర్మూలన
సాధ్వి నిరంజన్‌ జ్యోతి: ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలు
విజయ్‌ సంప్లా: సామాజిక న్యాయం, సాధికారత
అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌: ఆర్థికం, కార్పొరేట్‌ వ్యవహారాలు
మహేంద్రనాథ్‌ పాండే: మానవ వనరుల అభివృద్ధి
అజయ్‌ టమ్టా: జౌళి
కృష్ణ రాజ్‌: మహిళా శిశు సంక్షేమం
మన్‌సుఖ్‌భాయ్‌ మాండవ్య: రోడ్డు రవాణా, హైవేలు, షిప్పింగ్‌, రసాయనాలు, ఎరువులు
అనుప్రియా పటేల్‌: ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం
సి.ఆర్‌.చౌదరి: వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ
పి.పి.చౌదరి: చట్టం-న్యాయం, ఐటీ
సుభాష్‌ భమ్రే: రక్షణ

English summary
Smriti Irani is no more the country's Education Minister. In a big cabinet reshuffle by Prime Minister Narendra Modi on Tuesday, Ms Irani has been moved out of the Human Resource Development or HRD ministry and Prakash Javadekar, promoted to cabinet rank this morning, will hold the portfolio now.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X