వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అజిత్ పవార్ కంగ్రాట్స్.. మహారాష్ట్ర ప్రభుత్వం, సీఎంపై ప్రధాని మోడీ భరోసా..

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్రలో నాటకీయ పరిణామాల మధ్య దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా, ఎన్సీపీ తిరుగుబాటు నేత అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా శనివారం తెల్లవారు జామున ప్రమాణ స్వీకారం చేయడం దేశ రాజకీయాలను వేడెక్కించాయి. అనూహ్య సంఘటనపై పలు రాజకీయ పార్టీలు విమర్శలు గుప్పిస్తుండటం తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాన నరేంద్రమోడీ కొత్తగా ఏర్పాటైన మహారాష్ట్ర ప్రభుత్వానికి శుభాకాంక్షలు అందించారు. ప్రధాని మోడీ తన సందేశంలో ఏమన్నారంటే..

బీజేపీ 105, ఎన్సీపీ 35 ఈక్వల్ టు 140.. ఐదు సీట్ల దూరంలో ఫడ్నవీస్ సర్కార్..బీజేపీ 105, ఎన్సీపీ 35 ఈక్వల్ టు 140.. ఐదు సీట్ల దూరంలో ఫడ్నవీస్ సర్కార్..

సుస్థిర ప్రభుత్వం కోసం

సుస్థిర ప్రభుత్వం కోసం

డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన అజిత్ పవార్ మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాల తర్వాత ఏ ఒక్కరికి స్పష్టమైన మెజారిటీ రాలేదు. ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. ప్రస్తుతం మహారాష్ట్రలో రైతుల సమస్యతోపాటు అనేక అంశాలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. అందుకే స్థిరమైన ప్రభుత్వం కోసం బీజేపీతో చేతులు కలిపాను అని అన్నారు.

 శివసేన మాట మార్చిందని

శివసేన మాట మార్చిందని

మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు మాకు స్పష్టమైన మెజారిటీని ఇచ్చారు. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత శివసేన ఇతర పార్టీలతో కలిసి మా అలయెన్స్‌కు తూట్లు పొడిచింది. దాంతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. మహారాష్ట్రకు స్థిరమైన ప్రభుత్వం ఉండాలనే ఆలోచనతో అజిత్ పవార్ మాతో కలిశారు అని అన్నారు.

సీఎం, డిప్యూటీ సీఎంకు కంగ్రాట్స్

సీఎం, డిప్యూటీ సీఎంకు కంగ్రాట్స్

సీఎంగా, డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన ఫడ్నవీస్, అజిత్ కంగ్రాట్స్. వారిద్దరు మహారాష్ట్రకు బంగారు భవిష్యత్‌ను అందిస్తారనే విషయంలో నమ్మకంగా ఉన్నారు. వారిద్దరూ కలిసి సంక్షేమ రంగాన్ని ముందుకు తీసుకెళ్తారు అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ప్రధానితో హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా సోషల్ మీడియాలో ఇద్దరికి శుభాకాంక్షలు అందజేశారు.

 అసెంబ్లీలో బలాబలాలు

అసెంబ్లీలో బలాబలాలు

మహారాష్ట్ర అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాలని సీఎం ఫడ్నవీస్‌కు గవర్నర్ సూచించారు. ప్రస్తుతం బీజేపీకి 105 సీట్లు, ఎన్సీపీకి 54 సీట్లు ఉన్నాయి. అజిత్ మద్దతుతో ప్రభుత్వా ఏర్పాటుకు కావాల్సిన 144 సీట్ల మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసింది. తాజా పరిణామాల మధ్య ఎన్సీపీ ఎమ్మెల్యేలందరూ మద్దతు తెలుపుతారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది.

English summary
Narendra Modi congrats for Devendra Fadnavis and Ajit Pawar after Maharashtra government formation. He tweeted that Congratulations to Dev_FadnavisJi and AjitPawarSpeaks Ji on taking oath as the CM and Deputy CM of Maharashtra respectively. I am confident they will work diligently for the bright future of Maharashtra."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X