వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సౌత్‌లో మోడీ గ్లామర్ దూకుడు: పార్టీతో, పార్టీ లేకుండా..

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దక్షిణ భారతదేశంలో అంతంత మాత్రంగా ఉన్న భారతీయ జనతా పార్టీకి గ్లామర్ రూపంలో ఆ పార్టీ ప్రధానమంత్రి అధ్యక్షులు నరేంద్ర మోడీ మద్దతు కూడగడుతున్నారు. బిజెపి హవా ఉత్తరాది వైపే ఎక్కువగా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. దక్షిణాదిన ప్రాంతీయ పార్టీలతో పాటు కాంగ్రెసు హవా ఉంటుంది. తమిళనాడులో డిఎంకె, అన్నాడిఎంకె, కేరళలో లెఫ్ట్, కాంగ్రెసు, ఎపిలో కాంగ్రెసు, టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు, తెరాస... ఇలా ఆయా దక్షణాది రాష్ట్రాల్లో హవా ఉంది.

దక్షిణాదిన బిజెపి హవా లేకపోయినప్పటికీ గాలి, యడ్యూరప్పల కారణంగా గతంలో కర్నాటకలో ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ ఇద్దరు పార్టీని వీడటంతో కర్నాటకలో గత ఎన్నికల్లో బిజెపి ఓటమి చవి చూడాల్సి వచ్చింది. ఇప్పుడు వారు మళ్లీ బిజెపికి చేరువయ్యారు. ఇలా ఏ రకంగా చూసిన దక్షిణాదిన బిజెపికి హవా అంతంతమాత్రమేనని చెప్పవచ్చు. అయితే, రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఢిల్లీ పీఠం ఎక్కాలంటే దక్షిణాదిన కొన్ని సీట్లు దక్కించుకోవాల్సి ఉంటుంది.

దీనిని గుర్తించిన మోడీ దక్షిణాది రాష్ట్రాల పైన దృష్టి సారించారు. ఉత్తర భారతంలో మోడీ హావా బాగా ఉంది. అక్కడే దాదాపు రెండువందలకు అటు ఇటుగా సీట్లు వచ్చే అవకాశముంది. మేజిక్ ఫిగర్ దాటడం కోసం మోడీ దక్షిణాది పైన ఆధార పడ్డారు! ఇందులో భాగంగా ఇప్పటికిప్పుడు పార్టీని ఎన్నికల్లో గట్టెక్కించుకునేందుకు మోడీ గ్లామర్ మంత్రం పఠిస్తున్నారు. అందులో భాగంగానే దక్షిణాది స్టార్లు అతనికి ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు పలుకుతున్నారంటున్నారు.

 నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

అంతేకాదు కొందరు పార్టీ పెట్టి మద్దతు పలికితే.. మరికొందరు పార్టీ లేకుండా.. పరోక్షంగా మద్దతు పలుకుతున్నారు. ప్రత్యక్షంగా మద్దతు పలికిన వారిలో జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముందువరుసలో ఉన్నారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

నాగార్జున, రజనీకాంత్ తదితరులు పరోక్షంగా మద్దతు పలికారనే చెప్పవచ్చు. మోడీతో తమ భేటీకి రాజకీయ ప్రాధాన్యం లేదని చెబుతున్నప్పటికీ ఆ హీరోలు చెబుతున్నప్పటికీ వారి భేటీ బిజెపికి కలిసి వచ్చే అంశమేనని చెప్పవచ్చు

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

కాంగ్రెసు పార్టీకి బద్ద వ్యతిరేకి అయిన పవన్ కళ్యాణ్ పార్టీని స్థాపించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెసు వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండేందుకు పోటీ చేయడం లేదని చెబుతూ.. మోడీకి మద్దతు పలికారు. మోడీకి ఓటేయాలని రాష్ట్ర ప్రజలను కోరారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

ఇక నాగార్జున గుజరాత్ వెళ్లి మోడీని కలిశారు. ఆయన చేసిన అభివృద్ధిపై ప్రశంసల వర్షం కురిపించారు. కన్నడనాట నటి రక్షిత బిజెపిలో చేరారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

తమిళనాడు విషయానికి వస్తే డిఎండికె అధ్యక్షుడు విజయకాంత్ ఎన్డీయో కూటమిలో ఉన్నారు. ఇక భారత సూపర్ స్టార్ రజనీకాంత్‌తో మోడీ ఆదివారం భేటీ అయ్యారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

మరోవైపు ఐటం గర్ల్ రాఖీ సావంత్ ఓ పార్టీని స్థాపించి ముంబైలో పోటీ చేస్తున్నారు. ఆమె పార్టీ పెట్టక ముందు మోడీకి మద్దతు పలికారు. ఆమె పార్టీ పెట్టింది కూడా స్థానికంగా బిజెపికి లబ్ధి చేకూర్చేందుకేనని కాంగ్రెసు నేతల వాదన.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

దక్షిణ భారతదేశంలో అంతంత మాత్రంగా ఉన్న భారతీయ జనతా పార్టీకి గ్లామర్ రూపంలో ఆ పార్టీ ప్రధానమంత్రి అధ్యక్షులు నరేంద్ర మోడీ మద్దతు కూడగడుతున్నారు.

English summary
BJP PM candidate Narendra Modi get South stars support.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X