వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

surender modi-దేవతల రాజు: రాహుల్‌ చైనాకు అతిపెద్ద మద్దతుదారంటూ బీజేపీ కౌంటర్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దులో ఇరు దేశాల ఘర్షణల నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శల దాడిని పెంచారు. అసలు సరిహద్దులు పరిస్థితి ఏంటి? చైనా దాడులకు దిగుతుంటే మీరు ఏం చేస్తున్నారు? అంటూ ఇప్పటికే రాహుల్ తోపాటు సోనియా గాంధీ ఇతర నేతలు కూడా ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే.

Recommended Video

China India Stand Off : Amit Shah And Rahul Gandhi ట్విట్టర్ వార్

సరేండర్ మోడీ అంటూ రాహుల్..

తాజాగా రాహుల్ గాంధీ ప్రధానిపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన నరేంద్ర మోడీ కాదు.. సరేండర్(Surender) మోడీ అంటూ తీవ్రంగా దుయ్యబట్టారు. అంతేగాక, జపాన్ టైమ్స్ ప్రచురించిన ఓ కథనాన్ని రాహుల్ ట్వీట్ చేశారు. ఇంచా చైనా అప్పీస్మెంట్ పాలసీ నడుస్తోందంటూ ఆ కథనం వెల్లడించినట్లు ఆయన పేర్కొన్నారు.

‘దేవతల రాజు' అనే కొత్త పేరు పెట్టారు..

కాగా, రాహుల్ గాంధీ విమర్శలపై అదేస్థాయిలో బీజేపీ నేతలు, మద్దతుదారులు ఎదురుదాడికి దిగారు. Surender=సురేందర్ అంటే దేవుళ్లకు రాజు అనే అర్థమవస్తోందని అరుణ్ పుదుర్ అనే వ్యక్తి బదులిచ్చారు. సుర అంటే దేవుడు అని, ఇంద్రుడు దేవతలకు రాజు అని చెప్పారు. నరేంద్ర మోడీకి కొత్త పేరు ఇచ్చినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

రాహుల్ చైనా పెద్ద మద్దతుదారు కానీ..

రాహుల్ ట్వీట్‌పై బీజేపీ ఎంపీ మీనాక్షిలేఖీ మండిపడ్డారు. కొన్నిసార్లు చూసింది జరిగి ఉండకపోవచ్చు. జరిగింది కనిపించకపోవచ్చు. ట్విట్టర్ చాలా మంది చైనా మద్దతుదారుల ప్రచారాన్ని బ్యాన్ చేసింది. కానీ, అతి పెద్ద మద్దతుదారుడిని మాత్రం మర్చిపోయింది అని రాహుల్ గాంధీకి చురకలంటించారు.

కాంగ్రెస్ విమర్శలు.. బీజేపీ కౌంటర్లు..

సరిహద్దులో చైనా దళాలు దాడులు చేసిన నాటి నుంచి కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇతర నేతలు ప్రదాని మోడీపై తీవ్రంగా విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. చైనా దళాలు భారత భూభాగంలోకి రాలేదని ప్రధాని స్వయంగా ప్రకటించినప్పటికీ కాంగ్రెస్ నేతలు ప్రశ్నలతో విరుచుకుపడుతున్నారు. చైనా సైనికులు మన భూభాగంలోకి రాకపోతే ఘర్షణ ఎందుకు జరిగిందని నిలదీస్తున్నారు. అంతేగాక, తాజాగా గాల్వన్ లోయ తమదేనంటూ చైనా ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు విమర్శల దాడిని మరింత పెంచారు. అయితే, చైనా వాదనను భారత్ తీవ్రంగా ఖండించింది. గాల్వన్ లోయ భారత భూభాగమని స్పష్టం చేసింది. కాగా, దేశ భద్రత విషయంలో కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

English summary
Narendra Modi is actually 'Surender Modi' says Rahul Gandhi; bjp counter on him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X