వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ 'మావోయిస్ట్' వ్యాఖ్యలే ఆప్‌ విజయానికి కారణమా?

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తిరిగి ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకోవడానికి ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలే కారణమా? అంటే అవుననే అంటున్నారా రాజకీయ విశ్లేషకులు. 2007 గుజరాత్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ మాట్లాడుతూ అప్పటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్రమోడీని 'మృత్యు బేహారి'గా అభివర్ణించారు.

ఆ ఎన్నికల్లో అది మోడీకి బాగా కలిసి వచ్చింది. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల సందర్భంగా మోడీ మాట్లాడుతూ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలను మావోయిస్టులతో పోల్చారు. 'కేవలం 49 రోజుల్లో ప్రభుత్వాన్ని వదిలేసిపోయిన వ్యక్తికి మళ్లీ అవకాశం ఇచ్చే ప్రయోగం చేయోద్దు. నాగరిక సమాజంలో అలాంటి వారు (అరవింద్ కేజ్రీవాల్) ఉండటానికి వీల్లేదు. వారు బహిస్కృత నక్సల్స్ మాదిరిగా అడువుల్లోకి వెళ్లి నివసించాలి' అని మోడీ అన్నారు.

స్ధానిక నేతలు మరో అడుగు ముందుకు వేసి అరవింద్ కేజ్రీవాల్‌ను 'ఉపద్రవి గోత్రా'నికి చెందిన వ్యక్తిగా అభివర్ణించారు. సాధారణంగా ఎన్నికల ప్రచారంలో మోజీ ప్రత్యర్ధులపై ఆచితూచి బాణాలు సంధిస్తుంటారు. కానీ ఢిల్లీ ఎన్నికల్లో స్వయంగా ప్రధాని మోడీయే ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో అందరూ విస్తుబోయారు.

Narendra modi maoist comments on arvind kejriwal

ప్రధాని స్ధాయి నేత నోటి నుండి వెలువడిని ఆ వ్యాఖ్యలు ఓటర్లకు చేరిపోయాయి. ఆమ్ ఆద్మీ పార్టీని అనవసరంగా ఆడిపోసుకున్నట్లు ఉందని కరుడుగట్టిన బీజేపీ మద్దతుదారులు సైతం ఆ వ్యాఖ్యలపై అభ్యంతరాలు తెలిపాయి.

ఇక హర్యానాలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఢిల్లీకి ఉదాహరణకు తాగునీటిని అందిస్తోందని దక్షిణ, పశ్చిమ ఢిల్లీ ఎన్నికల సభల్లో ప్రధాని మోడీ చెప్పారు. మోడీ అలా ఎన్నికల సభలకు వదిలి వెళ్లారో లేదో స్ధానిక బీజేపీ నేతలు మాట్లాడుతూ ఒకవేళ ఆప్ అధికారంలోకి వస్తే హర్యానా ప్రభుత్వం నీళ్లు ఇవ్వదని బెదిరించారు.

తాను అధికారంలోకి వచ్చాక పెట్రోల్ ధరలు తగ్గిపోవడంతో తనది అదృష్ట జాతమని చెప్పారనీ, అలాంటప్పుడు ఢిల్లీ పాలించడానికి దుష్ట శకునాన్ని ఎందుకు తెచ్చుకోవాలని ప్రధాని మోడీ ప్రశ్నించడమూ వివాదాస్పదమైంది.

కేంద్రంలో, గుజరాత్‌లో విషయంలో అలా ఎందుకు జరగకూడదనే వాదనలూ గట్టిగా ప్రధాని మోడీ వినిపించారు. వీటన్నింటిని కూలంకుషంగా చూస్తే బీజేపీ చేసిన వ్యతిరేక ప్రచారమే ఆప్‌కి బాగా కలిసి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

English summary
Narendra modi maoist comments on arvind kejriwal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X