వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

త్వరలో కేంద్రమంత్రివర్గ పునర్వవ్యస్థీకరణ, జెడియూ, అన్నాడిఎంకెలకు చోటు?

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు చోటుచేసుకొనే అవకాశం కన్పిస్తోంది. కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.దీంతో మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయాలని ప్రధానమంత్రి మోడీ భావిస్తున్నారు.సెప్టెంబర్ 3వ, తేదిలోపుగా మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందని సమాచారం.

కేంద్ర మంత్రివర్గాన్ని సెప్టెంబర్ 3వ, తేదిలోపుగా పునర్వవ్యస్థీకరించే అవకాశాలున్నాయని సమాచారం. మంత్రివర్గంలో మార్పులపై ప్రధానమంత్రి మోడీ ఆర్ఎస్ఎస్ పెద్దలతో చర్చించారు. అదే విధంగా పార్టీ చీఫ్ అమిత్‌షాతో కూడ మోడీ మంత్రివర్గం కూర్పుపై చర్చించారు.

చైనాలో జరిగే బ్రిక్స్ సమావేశానికి ప్రధానమంత్రి మోడీ హాజరుకానున్నారు. అయితే ఈ సమావేశానికి మోడీ హజరుకావడానికి ముందే కేంద్ర మంత్రివర్గ పునర్వవ్యస్థీకరణ జరిగే అవకాశాలున్నాయని సమాచారం.

Narendra Modi may recast Cabinet by September 3

దేశంలో ఇటీవల కాలంలో మార్పులు చేర్పులు చోటుచేసుకొన్నాయి. బీహర్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మహకూటమి నుండి వైదొలిగారు. బిజెపితో జతకట్టారు. అన్నాడిఎంకె నేతలు కూడ బిజెపికి దగ్గరయ్యారు. ఈ రెండు పార్టీలకే కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలు కన్పిస్తున్నాయి.ః

అదే విధంగా ఎన్‌సిపి కూడ ఎన్‌డిఏలో చేరే అవకాశం ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయమై రెండు పార్టీల నుండి అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. అయితే ఎన్‌సిపి కూడ ఎన్‌డిఏతో జతకట్టేందుకు సిద్దమని చెబితే ఆ పార్టీకి కూడ కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది.

అయితే ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గం నుండి ఆరు నుండి ఏడు మందికి ఉద్వాసన పలికే అవకాశం ఉంది. అయితే మిత్రపక్షాలతో పాటు నలుగురికి చోటు దక్కే అవకాశం ఉందని సమాచారం.

English summary
With Prime Minister Narendra Modi leaving for the Brics Summit in China on September 3, speculation is rife that the much-awaited Cabinet reshuffle and expansion of his council of ministers could take place before he leaves. Other than representatives of the NDA’s new ally, the Nitish Kumar-led JD(U), representatives of Tamil Nadu’s ruling AIADMK and the Sharad Pawar-led Nationalist Congress Party could also find a place in the Union council of ministers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X