వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూయార్క్‌లో మోడీ: పటేళ్ల నిరసన విరమణ(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మూడు గంటల ప్రాంతంలో న్యూయార్క్‌లో దిగారు. వారం రోజుల పర్యటనలో భాగంగా బుధవారం ఐర్లాండ్‌కు చేరుకున్న మోడీ అక్కడి ప్రధానితో భేటీ తర్వాత అక్కడ నుంచి న్యూయార్క్‌కు బయల్దేరి అమెరికా చేరుకున్నారు.

న్యూయార్క్‌లోని ప్రఖ్యాత హాల్డార్ఫ్‌ అస్టోరియా హోటల్‌లో బస చేశారు. భారత్‌లో పెట్టుబడులే లక్ష్యంగా ఆయన అమెరికాకు చెందిన పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. ప్రధాని హోదాలో అమెరికాలో రెండోసారి పర్యటిస్తున్న మోడీ పర్యటనను అడ్డుకోవాలని భావించిన పటేళ్ల సామాజిక వర్గం తమ ఆలోచనను విరమించుకుంది.

 న్యూయార్క్‌లో మోడీ: పటేళ్ల నిరసన విరమణ

న్యూయార్క్‌లో మోడీ: పటేళ్ల నిరసన విరమణ

అంతేకాదు ప్రధాని మోడీకి బస చేసిన హోటల్‌కు వెళ్లి ఆయన ఘన స్వాగతం పలకడంతో పాటు సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. అమెరికా కాలమాన ప్రకారం గురువారం ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభ సమావేశంలో ప్రధాని మోడీ పాల్గొననున్నారు.

న్యూయార్క్‌లో మోడీ: పటేళ్ల నిరసన విరమణ

న్యూయార్క్‌లో మోడీ: పటేళ్ల నిరసన విరమణ


తర్వాత మరికొన్ని సదస్సులకు ఆయన హాజరవుతారు. అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాతో కలిసి అంతర్జాతీయ శాంతి పరిరక్షక దళంతో మోడీ భేటీ కానున్నారు.

న్యూయార్క్‌లో మోడీ: పటేళ్ల నిరసన విరమణ

న్యూయార్క్‌లో మోడీ: పటేళ్ల నిరసన విరమణ


శనివారం నాడు వెస్ట్ కోస్ట్ కు వెళ్లేముందు జర్మనీ చాన్స్ లర్ అంజెలా మెర్కెల్, జపాన్ ప్రధాని షింజో అబే, బ్రెజిల్ అధ్యక్షుడు దిల్మా రౌసెఫ్ తదితరులతో సమావేశమై చర్చలు జరపనున్నారు.

న్యూయార్క్‌లో మోడీ: పటేళ్ల నిరసన విరమణ

న్యూయార్క్‌లో మోడీ: పటేళ్ల నిరసన విరమణ

ఆమెరికాలో తన ఐదు రోజుల పర్యటనలో భాగంగా ఫార్చూన్ 500 జాబితాలోని సంస్థల సీఈఓలతో ఆయన విందు సమావేశంలో పాల్గొంటారు. ఫేస్‌బుక్, గూగుల్ తదితర సంస్థల సీఈఓలతో భేటీ కానున్నారు.

English summary
Prime Minister Narendra Modi will brainstorm with media baron Rupert Murdoch and 15 other leaders of the world media industry on how to use communication technology for development on Thursday, Indian Ambassador to the U.S. Arun K. Singh said. Mr. Modi arrived in New York City on Wednesday evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X