వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హఠాత్తుగా వచ్చి సర్ప్రైజ్ చేశారు: క్యాంటీన్లో తిని రూ.29 చెల్లించిన మోడీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం నాడు పార్లమెంటు క్యాంటీన్లో మధ్యాహ్న భోజనం చేశారు. అందుకు గాను ఆయన రూ.29 రూపాయలు చెల్లించారు. పార్లమెంటు సభ్యులతో కలిసి మోడీ సోమవారం మధ్యాహ్నం క్యాంటీన్లో భోజనం చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటు బిల్డింగులోని ఫస్ట్ ఫ్లోర్లో గల గది నెంబర్ 70కి వచ్చారు. అతను రావడంతో ఎంపీలు అందరు ఆశ్చర్యపోయారు. అక్కడ అతను భోజనం చేశారు.

అతను క్యాంటీన్లో వెజిటేరియన్ తాలీ తీసుకున్నారు. అందుకుగాను 29 రూపాయలు చెల్లించారని తెలుస్తోంది. అతను ఎంపీలతో కలిసిపోయారు. వారితో పిచ్చాపాటిగా మాట్లాడారు. పార్లమెంటు క్యాంటీన్లోని విజిటర్స్ పుస్తకంలో ఆయన ఓ సందేశం కూడా రాశారు. అన్నాదాత సుఖీభవ అంటూ రాశారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!