వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిష్కేక్ సమ్మిట్‌కు రూటు మార్చిన మోడీ... పాక్ గగతలం గుండా ప్రయాణించని ప్రత్యేక విమానం

|
Google Oneindia TeluguNews

భారత ప్రధాని నరేంద్ర మోదీ జూన్‌ 13, 14 తేదీల్లో కిర్గిజిస్తాన్‌లోని బిష్కెక్‌లో జరిగే షాంఘై సహకార సదస్సు(ఎస్‌సీవో)కు హాజరయ్యేందుకు వెళ్లనున్నారు. మోదీ విమానానికి గగనతల అనుమతులు ఇవ్వాలన్న భారత్‌ విజ్ఞప్తికి పాకిస్తాన్‌ రెండు రోజుల క్రితం సానుకూలంగానే స్పందించింది. తమ దేశం మీదుగా మోదీ విమానం కిర్గిజిస్తాన్‌ వెళ్లేందుకు పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ అంగీకరించినట్లు పాకిస్తాన్‌ ప్రభుత్వవర్గాలు తెలిపాయి.కాని మోడీ వెళ్లనున్న ప్రత్యేక విమానం మాత్రం పాకిస్థాన్ మార్గం గుండా వెళ్లడం లేదని విదేశాంగ శాఖ అధికారులు ప్రకటించారు.

బిష్కేక్ వెళ్లేందుకు గాను రెండు మార్గాలను సిద్దం చేసినట్టు వారు తెలిపారు. అందులో ఓమన్, ఇరాన్, సెంట్రల్ ఏషియా దేశాల గుండా వెళ్లేందుకు నిర్ణయం చేశారు. కాని ప్రస్థుతానికి మాత్రం పాకిస్థాన్ గుండా మాత్రం వెళ్లడం లేదని అధికార వర్గాలు ప్రకటించాయి.

Narendra Modis aircraft wont fly over Pakistan on its way to Bishkek

ఇక బాలాకోట్‌లోని జైషే ఉగ్రవాద స్థావరంపై ఐఏఎఫ్‌ ఈ ఏడాది ఫిబ్రవరి 26న వైమానికదాడులు చేపట్టడంతో పాక్‌ తన గగనతలాన్ని మూసివేసింది. దేశంలోని మొత్తం 11 రూట్లకుగానూ రెండు మార్గాల్లోనే రాకపోకల్ని అనుమతిస్తోంది. దీంతో ఇండియన్ అధికారులు చేసిన
విజ్ఞప్తికి పాకిస్థాన్ అధికారులు సూత్రప్రాయంగా అంగీకరించారు. ఇక మరోవైపు ఏస్‌సీవో సదస్సు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో చర్చలు కూడ జరుగుతాయిని వార్తలు వెలువడ్డాయి. కాని అవార్తలను విదేశాంగ కార్యదర్శి రావిష్ కుమార్ కొట్టి పారేశారు. అలాంటీ చర్చలు అధికారిక షెడ్యుల్ల్లో లేవని ప్రకటించారు. దీంతో ఇరు దేశాల మధ్య శాంతి చర్చలకు బ్రేక్ పడింది.

అయితే పాక్ గుండా మోడీ ప్రత్యేక విమానం ఎందుకు వెళ్లక పోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మోడీ కనీసం పాక్ గగన తలాన్ని కూడ ఉపయోగించుకునేందుకు ఇష్టపడడం లేదా ..లేదంటే ఎదైనా సాంకేతిక పరమైన కారణాలు తలెత్తాయా అనే విషయాలు స్పష్టం కావాల్సి ఉంది.

English summary
Prime Minister Narendra Modi's aircraft won't fly over Pakistan on its way to Bishkek in Kyrgyzstan for regional meet SCO that starts tomorrow, the foreign ministry said today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X